Woman gives birth to daughter on the same day she wins the lottery - Sakshi
Sakshi News home page

అదృష్టం మాములుగా లేదుగా! ఒకేసారి రెండు జాక్‌పాట్‌లు

Published Sat, Dec 3 2022 3:10 PM | Last Updated on Sat, Dec 3 2022 3:26 PM

US Woman Gave Birth To Her Daughter On The Same Day Win Lottery - Sakshi

అందరూ ఏదైనా మంచి జరగలాంటే మనకు అదృష్టం ఉండాలి అంటుంటారు. కాస్త మన హార్డ్‌వర్క్‌కి కొంచెం లక్‌ తోడైతే ఇక మనకు తిరుగుండదు. ఔనా! ఇంతకీ ఎందుకూ ఈ అదృష్టం గురించి చెబుతున్నానంటే ఇక్కడున్న మహిళకు అదృష్టం మాములుగా లేదు. ఒకేసారి ఉబ్బితబ్బిబై ఎగిరి గంతేసేంత పట్టరాని ఆనందం ఒకేసారి వరించింది. 

వివరాల్లోకెళ్లే...అమెరికాలోని నార్త్‌కరోలినాలోని ఒక మహిళ ఒకేసారి రెండు జాక్‌పాట్‌లు కొట్టేసింది. ఈ మేరకు బ్రెండా గోమెజ్‌ హెర్నాండెజ్‌ అనే 28 ఏళ్ల మహిళ పండటి బిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపట్లోనే ఆమె రూ. 81 లక్షల లాటరీని గెలుచుకుంది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆమె అమెరికాలోని కాంకర్డ్‌ సిటీలోని ఒక క్విక్‌ట్రిప్‌ స్టోర్‌ నుంచి పవర్‌బాల్‌ టికెట్‌ను కొనుగోలు చేసింది.

ఆమె సరిగ్గా నవంబర్‌ 9న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అదే రోజు కొద్ది నిమిషాల్లోనే ఆమె లాటరీ గెలిచుకున్నట్లు లాటరీ నిర్వహణ అధికారులు తెలిపారు. ఈ మేరకు హెర్నాండెజ్‌ మాట్లాడుతూ...కచ్చితంగా ఈ చిట్టితల్లి వల్లే తాను ఈ లాటరీ గెలుచుకున్నాను, ఆమె నా అదృష్టదేవత అంటూ మురిసిపోయింది. అలాగే మిగతా నా ఇద్దరు మగ పిల్లలు కూడా ఈ అదృష్టం‍లో భాగమే. ఎందుకంటే ఈ లాటరీని ఆ ఇద్దరు పిల్లల పుట్టిన రోజుల నెంబర్లను ఆధారంగా లాటరీ టిక్కెట్‌ని ఎంచుకుని కొనుగోలు చేయడంతో  గెలవగలిగానని ఆనందంగా చెబుతోంది. 

(చదవండి: వామ్మో! కుక్కపిల్లకి చేయిస్తున్నట్లుగా కోబ్రాకి స్నానం చేయిస్తున్నాడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement