
ఈజిప్ట్: ఒక్కసారి లాటరీ గెలిస్తేనే ఎగిరి గత్తేస్తాం. రెండూ సార్లు గెలిస్తే అబ్బో అదృష్టం అంటే మనదే అంటూ తెగ సంబరపడిపోతాం. కానీ ఏకంగా 20 సార్లు గెలిస్తే ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఎంత అదృష్టం ఉంటే ఇలా జరుగుతుంది అని అనిపిస్తుంది. కానీ ఇక్కడొక వ్యక్తి కొనుగోలు చేసిన 20 టికెట్లకి లాటరీ తగిలింది. ఎవరా లక్కీ ఫెలో అని ఎగ్జాయింటింగ్ ఉన్నారా!
(చదవండి: హౌరా బ్రిడ్జ్ పై జౌరా అనిపించే డ్యాన్స్)
వివరాల్లోకెళ్లితే....అలెగ్జాండ్రియాకు చెందిన విలియం నెవెల్ వర్జినియాలోని ఓ దుకాణం నుంచి ఆన్‌లైన్‌లో 20 ఒకేలాంటి టికెట్లు కొనుగోలు చేశాడు. అయితే నాలుగు టికెట్ల చొప్పున వరుసగా 5, 4, 1, 1 సంఖ్యలను ఎంచుకున్నాడు. ఇక అంతే వర్జినియా లాటరీ అధికారులు లాటరీ తీసిన ప్రతిసారి నెవెల్ కొనుగొలు చేసిన 20 టికెట్లకు 20 సార్లు గెలిచాడు.
దీంతో నెవెల్ ప్రతి టికెట్‌కి 5 వేల డాలర్లు చొప్పున మొత్తం1,00,000 డాలర్లు (అంటే రూ.74 లక్షలు) గెలుచుకున్నాడు. ఏది ఏమైనా ఒకటి, రెండు సార్లు కూడా కాదు ఏకంగా 20 సార్లు అతను కొనగోలు చేసిన 20 టికెట్లుకు లాటరీ తగలడం విశేషం.
(చదవండి: అది బైక్ ? విమానమా !)
Comments
Please login to add a commentAdd a comment