సాక్షి,న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ అంటేనే వినియోగదారులు భయపడే మరో సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన ద్వారా ఆర్డర్ చేసిన ఢిల్లీకి చెందిన ఒక వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. రూ.35 వేల ఫోన్ బుక్ చేస్తే మైండ్ బ్లైండయ్యే గిఫ్ట్ వచ్చింది. దీంతో లబోదిబోమన్న కస్టమర్ పోలీసులను ఆశ్రయించారు.
వివరాల్లోకి వెళితే, ఢిల్లీకి చెందిన మానస్ సక్సేనా మాతృదినోత్సవం సందర్భంగా కన్నతల్లికి బహుమతి ఇద్దామనుకున్నారు. దీంతో ఓ ఈ-కామర్స్ సంస్థను సంప్రదించి స్మార్ట్ ఫోన్ ఆర్డర్ ఇచ్చి డబ్బు చెల్లించారు. ఇక్కడే ఈయనకు ఈ కామర్స్ సైట్ దిమ్మతిరిగే షాకిచ్చింది. మే 26న ఆన్‌లైన్లో వన్‌ప్లస్ 6 ఫోన్‌ను ఆర్డర్ చేసి రూ. 34,999ను డెబిట్ కార్డు ద్వారా పే మెంట్ చేశారు. మే 27న పార్శిల్ వచ్చింది. అయితే ఫోన్ కు బదులుగా పార్సిల్‌లో మార్బుల్ స్టోన్స్ దర్శనమిచ్చాయి. దీంతో అవాక్కయన ఆయన ఆన్‌లైన్ సంస్థకు ఫిర్యాదు చేశారు. వారు సరిగా స్పందించడకపోవడంత పోలీసులను ఆశ్రయించారు.
సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. డెలివరీ బాయ్, లేదా ఏజెన్సీ ప్రమేయం వుండొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment