రోజుకు 50 వేల సర్వే రాళ్లు | 50 thousand survey stones per day | Sakshi
Sakshi News home page

రోజుకు 50 వేల సర్వే రాళ్లు

Published Wed, Apr 26 2023 5:37 AM | Last Updated on Wed, Apr 26 2023 5:37 AM

50 thousand survey stones per day - Sakshi

సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో సర్వే రాళ్లు పాతే కార్యక్రమం ముమ్మ­రంగా జరుగుతోంది. రైతులపై పైసా భారం లేకుండా ప్రభుత్వ ఖర్చుతోనే సర్వే చేసిన భూముల్లో రాళ్లు పాతుతున్నారు. ఇప్పటికే విశాఖ­పట్నం, గుంటూరు, నంద్యాల, అల్లూరి సీతారామ­రాజు జిల్లాల్లో ఈ కార్యక్రమం వంద శాతం పూర్తయింది. మిగతా జిల్లాల్లోనూ వేగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రోజుకు 50 వేల రాళ్లు పాతడమే లక్ష్యంగా సర్వే సెటిల్మెంట్, రెవెన్యూ యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఈ నెల 18వ తేదీన 54,538 రాళ్లను రైతుల భూముల సరిహద్దుల్లో పాతారు.

ఆరోజు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 8 వేలకుపైగా రాళ్లను పాతారు. ఆ తర్వా­త నుంచి ప్రతి రోజూ 50 వేలకు తగ్గకుండా రాళ్లను పాతుతున్నారు. ఇందుకోసం జిల్లాలవారీగా షె­డ్యూ­ల్‌­ను రూపొందించారు. దాని ప్రకారం రోజూ రాళ్లు పాతుతున్నారో లేదో పర్యవేక్షిస్తు­న్నారు. ఒకే­సారి భారీగా సర్వే రాళ్లు పాతుతుండడంతో ఉన్న రోవర్లు సరిపోవడంలేదు. దీంతో సర్వే శాఖ అదనంగా వెయ్యి రోవర్లను సమకూర్చుకుంది.  వచ్చే నెల 20లోగా సర్వే పూర్తయిన గ్రామాలన్నింటిలో ఈ కార్యక్రమం పూర్తి చేయా­లని లక్ష్యంగా పనిచేస్తు­న్నారు.

ఈ గ్రామాల్లో 25.80 లక్షల రాళ్లు పాతా­ల్సి ఉండగా ఇప్పటివరకు 14 లక్షలకుపైగా రాళ్లు పాతారు. రికార్డు స్థాయిలో సర్వే రాళ్లు పాతే కార్యక్ర­మం నడుస్తోందని సర్వే, సెటిల్మెంట్‌ కమిషనర్‌ సిద్ధార్థ జైన్‌ తెలిపారు. రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లోని రైతులకు భూహక్కు పత్రాల పంపిణీ చివరి దశకు వచ్చిందని చెప్పారు. రాళ్లు కూడా పాతడం పూర్తయితే రీ సర్వే ప్రాజెక్టులో ఈ గ్రామాలు మోడల్‌గా ఉంటాయని తెలిపారు.

కోటీ ఇరవై ఐదు లక్షల సర్వే రాళ్లు అవసరం
సర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా కోటీ ఇరవై ఐదు లక్ష­ల సర్వే రాళ్లు అవసరమవుతాయని అంచనా. అన్ని రాళ్లను సమకూర్చే సామర్థ్యం ఉన్న ఫ్యాక్టరీలు రా­ష్ట్రం­లో, సమీప రాష్ట్రాల్లోనూ లేవు. దీంతో రాష్ట్ర ప్ర­భుత్వమే  4 సర్వే రాళ్ల కర్మాగారాలు ఏర్పాటు చేసి రా­ళ్లు ఉత్పత్తి చేస్తోంది. సర్వే రాళ్లు తయారు చే­యడానికి అవసరమైన గ్రానైట్‌ రాళ్లను గనుల శాఖ ఈ ఫ్యాక్టరీలకు సమకూరుస్తోంది. వాటిని 2 సైజు­ల్లో తయారు చేసి సర్వే శాఖకు అప్పగిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement