దొడ్డబళ్లాపురం(బెంగళూరు): రైలు పట్టాలపై ఒక బాలుడు రాళ్లు పెట్టిన వీడియో ఒకటి కర్ణాటక రాష్ట్రంలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో ఒక బాలుడు రైలు పట్టాలపై రాళ్లను వరుసగా పేర్చాడు. కొందరు ఆ బాలుడిని పట్టుకుని రాళ్లు ఎవరు పెట్టమన్నారని అడుగుతున్నారు. అయితే తనకు ఎవరూ ఇలా చేయమని చెప్పలేదని పోలీసులకు అప్పగించవద్దని ఏడుస్తూ వేడుకోవడం, తరువాత ఆ బాలుడిని వదిలేయడం రికార్డయ్యాయి.
అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందీ తెలీడం లేదు. ఈ వీడియోను కేంద్ర రైల్వే శాఖమంత్రి అశ్విన్ వైష్ణవ్ రైల్వే ఉన్నతాధికారులకు ట్యాగ్ చేసి ఇది చాలా సీరియస్ విషయమని, దీనికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. కాగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఓ బాలుడు రైలు పట్టాలపై రాళ్లు పెట్టిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఓ వ్యక్తి సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి.
⚠️ Shocking: Another #TrainAccident Averted.
— Arun Pudur (@arunpudur) June 5, 2023
An underage boy was caught sabotaging the railway Track this time in #Karnataka.
We have tens of thousands of Kms of railway tracks and forget adults now even kids are being used for sabotaging and causing deaths.
This is a serious… pic.twitter.com/URe9zW4NgG
చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: మృతదేహాలలో నుంచి ఒక చేయి అతనిని పట్టుకోగానే...
Comments
Please login to add a commentAdd a comment