సాక్షి, నిర్మల్: మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనగతితో మానవ శరీరంలోని కిడ్నీల్లో ఒకట్రెండు రాళ్లు తయారుకావడం సహజమే. కానీ ఆమె గాల్‌బ్లాడర్‌లో ఏకంగా 20 వరకు రాళ్లు.. అవి కూడా 20మి.మీ. ఉండటం గమనార్హం. జిల్లాకేంద్రానికి చెందిన నస్రీన్ రెండేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారు.
ఈ క్రమంలో చికిత్సకోసం నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్‌లతోపాటు మహారాష్ట్రలోని నాందేడ్ వరకూ వెళ్లారు. అనేక ప్రైవేటు ఆసుపత్రులు తిరిగారు. సమస్య మాత్రం తీరలేదు. చివరకు నిర్మల్ జిల్లాకేంద్రంలోనే దేవీబాయి ఆస్పత్రి వైద్యుడు అవినాశ్ కాసావార్‌ను కలిశారు. గాల్‌బ్లాడర్‌లో పెద్ద మొత్తంలో రాళ్లు ఉండటం వల్లే కడుపునొప్పి వస్తున్నట్లు ఆయన గుర్తించారు. ఈమేరకు శుక్రవారం ల్యాపరోస్కోపి విధానంలో ఆపరేషన్ చేయగా, ఆమె గాల్‌బ్లాడర్‌లో సుమారు 20రాళ్లు, ఒక్కో రాయి సైజు 20మి.మీ. ఉన్నవి బయటపడ్డాయి. ఇలాంటి అరుదైన ఆపరేషన్ జిల్లాలోనే తొలిసారిగా చేసినట్లు వైద్యుడు అవినాశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment