నిర్మల్‌ ఎన్నికల ‘వరద’లో ఎదురీదేవరు? | Adilabad: Who Will Be Next Incumbent in Nirmal Constituency | Sakshi
Sakshi News home page

నిర్మల్‌ ఎన్నికల ‘వరద’లో ఎదురీదేవరు? కోట్టుపోయేదేవరు?

Published Mon, Aug 28 2023 12:37 PM | Last Updated on Fri, Sep 1 2023 12:48 PM

Adilabad: Who Will Be Next Incumbent in Nirmal Constituency - Sakshi

ఆ పట్టణం వేనిస్‌ను మరిపిస్తోంది. వర్షకాలం వస్తే చాలు కాలనిలు చెరువులు అవుతున్నాయి. రోడ్లు కాల్వలు అవుతాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి పడవల్లో ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. పోని ఇదంతా పర్యాటక ప్రాంతమా అంటే అదీ కాదు. పోనీ ప్రగతి అంటే కాదు. అభివృద్ధి అసలు  కాదు. మరి దశాబ్ద కాలంగా మంత్రి సాధించిన వందల కోట్ల అభివృద్ధి పనులు వరద పాలు కావడానికి కారణాలేంటి? ఆ వరదలు మంత్రిని ఎన్నికలలో ముంచుతాయా? వరదనీటిలో కమలం వికసిస్తుందా? వరదనీరు తెలంగాణ యోధుడు శ్రీహరి రావు విజయతీరాలకు చేర్చుతుందా? నిర్మల్ ఎన్నికల వరదలో ఎదురీదేవరు? ఏటిలో కోట్టుపోయేదేవరు? నిర్మల్ ఎన్నికల వరద యుద్దంపై సాక్షి స్పేషల్  రిపోర్ట్.

వంద ఏళ్ల చరిత్ర, ఘనకీర్తి కలిగిన నిర్మల్‌

నిర్మల్ నియోజకవర్గానికి వందల చరిత్ర ఉంది. ఏంతో ఘనకీర్తి ఉంది. పాలన చిహ్నలు ఉన్నాయి. కోటలు ఉన్నాయి. కరువు పాతరేసిన చెరువులు ఉన్నాయి. కాలే కడుపులకు కడుపునిండా అన్నం పెట్టిన ధాన్యాగారం.. నియోజకవర్గంలో మామడ, లక్ష్మణ చాందా, సోన్ నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, సారంగపూర్, దిలావర్ పూర్, నర్సాపూర్ జి మండలంలో కోన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో నూతన ఓటరు జాబితా ప్రకారం 2,33,248 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మున్నూర్ కాపు, ముస్లిం, ముదిరాజ్, పద్మశాలి, గంగపుత్రుల ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. ఈ నియోజకవర్గం నుండి మంత్రి  ఇంద్రకరణ్  రెడ్డి  ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్‌పీ పార్టీ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత మారిన  సమీకరణాలతో అప్పటి టీఆర్‌ఎస్‌.. ఇప్పటి బీఆర్‌ఎస్‌లో చేరారు. 

సీఎం కేసీఆర్‌ క్యాబినెట్‌లో మంత్రయ్యారు ఇంద్రకరణ్‌. మళ్లీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలలో 79,985 ఓట్లతో 46 శాతం ఓట్లు సాధించి. కాంగ్రెస్‌ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డిపై విజయం సాధించారు. 9,271 ఓట్ల మెజారిటీతో మంత్రి విజయం సాధించారు. క్యాబినెట్‌లో రెండోసారి మంత్రి అయ్యారు. రెండోసారి మంత్రిగా  అభివృద్ధిలో నిర్మల్ నియోజకవర్గం రూపురేఖలు మార్చారు. నిర్మల్ పట్టణం సుందరీకరణ చేశారు. కాలనిలకు  రోడ్లు నిర్మించారు. జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరెట్ నిర్మాణం, మెడికల్  కళాశాల వంటివి  సాధించారు. అదేవిధంగా మారుమూల ప్రాంతాలకు రోడ్డు రవాణా కల్పించారు. అదే విధంగా నిర్మల్ ఆసుపత్రిని వంద పడకల అసుపత్రిగా మార్చారు. ఈ  ప్రగతితో నిర్మల్ రూపురేఖలు మార్చారని పేరుంది. వీటితో పాటు అడెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

దశ తిగిన దిశ మారని నిర్మల్‌ 

అభివృద్ధితో నిర్మల్ దశ మారిన దిశ మారలేదు. వందల ఎళ్లుగా నీళ్లను అందించే చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. ఆ కబ్జాలతో చెరువులు కనిపించకుండా పోతున్నాయి. వర్షకాలంలో చెరువులలో వెళ్లాల్సిన వరదనీరు రోడ్లపైకి వస్తోంది. కాల్వలను మరిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలలో ఇండ్ల పైకప్పులను ముంచుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పడవల్లో ప్రజలు భయటకు వస్తున్నారు. అదేవిధంగా నిర్మల్ మున్సిపల్‌లో నాలగో తరగతి ఉద్యోగులనియమాకం వివాదస్పందంగా మారింది. ఉద్యోగాలన్ని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ బంధువులకు, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధుల బంధువులకు దక్కాయి. అక్రమంగా   ఉద్యోగాల నియమాకాలపై తీవ్రమైన దుమారం రేగింది. సంతలో సరుకులా మున్సిపల్ ఉద్యోగాలు అమ్ముకున్నారని ప్రజలు పార్టీల అధ్వర్యంలో  ఉద్యమించారు. 

ఈ అక్రమం ఉద్యోగాల నియమాకాలపై అర్డిఓ చేత విచారణ జరిపించారు. ఆవిచారణలో ఉద్యోగాలు అక్రమంగా నియమాకాలు చేశారని తెలింది. ఆ ఉద్యోగాలు రద్దు చేయాలని అర్డీఓ సిఫార్స్‌ చేశారు. మంత్రి కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. ఇది మంత్రికి మచ్చగా మారింది. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరెట్ నిర్మాణం వివాదంగా మారుతోంది. చెరువులో ఎస్ఎ‌టీఎల్ లేవల్ నిర్మాణం ఒక వివాదమైతే. దీనికి తోడు మంత్రి, బంధువులకు  భూములు ఉన్నచోట కలెక్టరెట్ నిర్మాణం చేశారని ప్రతిపక్షాలు అరోపిస్తున్నాయి. ఉద్యోగాల మచ్చ తోలగక ముందే పట్టణంలో మాస్టర్ ప్లాన్ మంత్రికి దడపుట్టిస్తోంది. తమ భూములు కోల్లగోట్టేందుకు మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపోందించారని రైతులు అందోళన కోనసాగిస్తున్నారు. భూములకు నష్టం కలిగించమని మంత్రి  భరోసా ఇచ్చిన ఇంకా ప్రజలు నమ్మడం లేదట.

అవినీతికి అడ్డాగా మంత్రి..!

వీటితో పాటు డీ1 పట్టాలు  మంత్రి  బంధువులు అక్రమంగా పోందారని కాంగ్రెస్, బీజేపీలు ప్రజల్లో ప్రచారం చేస్తున్నాయి. ఇదంతా  ఒక ఎత్తయితే దళితుల సంక్షేమం అమలు చేస్తున్నా ఈ దళితబంధు పథకం మంత్రికి అడ్డంగా తిరిగింది. నర్సాపూర్ జిలో  దళిత బంధు గురించి మంత్రిని ప్రశ్నించిన మహిళపై కేసు నమోదైంది. అది దళిత వర్గాలపై వ్యతిరేకతను పెంచింది. నియోజకవర్గంలో సాగునీరు అందించే ప్రాణహిత, చేవేళ్ల 27 ప్యాకేజీ పనులు అంగులం కదలడం లేదు. అభివృద్ధి పనులు పురోగతి లేకున్నా పార్టీలో అసంతృప్తి మంత్రికి తలనోప్పిగా మారిందట. గత అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ శోభ సత్యనారాయణ భర్త సత్యనారాయణ, మాజీ  ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్  రెడ్డి,  బీఆర్‌ఎస్‌ కీలక నాయకుడు శ్రీహరి మంత్రి గెలుపులో కీలకంగా వ్యవహరించారు.

మంత్రి తీరుతో విసిగిపోయిన శ్రీహరి మంత్రిపై తిరుగుబాటు చేశారు.  పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అదేవిధంగా మంత్రి సన్నిహితుడు సారంగపూర్ జడ్పీటీసీ మంత్రితో విబేధాల కారణంగా పార్టీ వీడారు. కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి గెలుపు కోసం పనిచేసిన శ్రీహరి రావు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. మంత్రిపై ప్రజల్లో వ్యతిరేకత, అవినీతి ఆరోపణలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ ఎత్తుగడలు వేస్తున్నాయి. రెండుసార్లు అత్యల్ప ఓట్లతో ఓటమి పాలైనా ఈసారి ఆరునూరైనా విజయం సాధించాలని మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఈసారి మహేశ్వర్రెడ్డి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. వ్యూహలు రచిస్తున్నారు. ప్రజల్లోకి వెళుతున్నారు. మంత్రి వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలలో ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

మంత్రిపై వ్యతిరేకత.. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్లస్‌?

అదేవిధంగా అవినీతి మంత్రిని ఓడించాలని ప్రజలను కోరుతున్నారు. వరదలకు మంత్రి కబ్జాలే కారణమని ఆరోపిస్తున్నారట. ఈ సందర్భంగా ఎలేటి మహేశ్వర్‌రెడ్డి ఎన్నికలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే బీసీ, ఎస్సీ ఓటర్ల మద్దతు కూడ గడుతున్నారు. ఎలేటికి ప్రజల్లో మద్దతు లభిస్తు‍న్న ఎన్నికల వరకు మద్దతు ఉపయోగించుకోవడం లేదని పేరుంది. ఈసారి చివరి వరకు పట్టు నిలుపుకోని విజయం సాధించాలని ఆయన భావిస్తున్నారు. అయితే మహేశ్వర్‌రెడ్డి నియోజకవర్గంలో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ప్రచారం ఉంది. చుట్టం చూపులా హైదారాబాద్ నుండి వచ్చి పోతున్నారని భావన. ఈ భావన తోలగించుకోకుంటే ప్రతికూలంగా మారుతుందని కార్యకర్తల్లో ఉంది. అదేవిధంగా సర్కార్ వైఫల్యాలపై పోరాటం చేయడంలో వెనుకబడ్డారని సోంత పార్టీలో ఉంది. మంత్రిపై వ్యతిరేకత ఉన్నా అనుకూలంగా మలుచుకోకపోతే గత రెండు ఎన్నికల ఫలితాలే పునరావుతం అయ్యే అవకాశం ఉంది.

కానీ ఈసారి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా  మంత్రిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. ఎన్నికలలో గెలిచి తీరాలనే కసితో ప్రజల్లోకి వెళ్లుతున్నారు. కచ్చితంగా గెలుస్తామనే  ధీమాను వ్యక్తం చేస్తున్నారట మహేశ్వర్ రెడ్డి. మరోకవైపు 2009, 2014 ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా శ్రీహరి రావు పోటీ చేశారు. ఈ ఎన్నికలలో శ్రీహరి రావుకు భారీగా ఓట్లు లభించాయి. విజయ అంచుల వరకు హరి కేవలం ఎనిమిది వేల ఓట్లతో శ్రీహరి రావు ఇంద్రకరణ్‌రెడ్డిపై ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికలలో శ్రీహరి రావు  మంత్రి  బీఅర్ఎస్‌లో చేరడంతో టికెట్‌ దక్కలేదట. కానీ బీజేపీలో మహేశ్వర్‌రెడ్డి చేరడంతో బీఆర్‌ఎస్‌లో ఉన్న శ్రీహరి రావు కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి మంత్రికి వ్యతిరేకంగా తనకు మద్దతు కూడగడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. 2014 ఎన్నికలలో ఓటమికి ఈ ఎన్నికలలో కసి తీర్చుకోవాలని భావిస్తున్నారట. మంత్రిపై ఉన్న వ్యతిరేకత తనకు గెలుపు ఖాయమని భావిస్తున్నారట శ్రీహరి. మరి ఈ ముగ్గురిలో ఎవరికి ప్రజలు పట్టం కడుతారో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement