Nirmal Assembly Constituency
-
గెలుపు ఓటములపై ప్రభావం.. అక్కడ మైనారీటీలు ఏ పార్టీ వైపు?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ బీజేపీకి ఊపునిచ్చింది. ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. ప్రభంజనంలా తరలివచ్చిన జనంతో జైత్రయాత్రను మరిపించింది. కానీ బీజేపీని ఓడించడానికి ముస్లింలు, మైనారీటీలు ఏకం అవుతున్నారా.? కారు పార్టీకి మైనారీటీలు మళ్లీ అండగా నిలబడుతారా? లేదంటే కాంగ్రెస్ వైపు మళ్లుతున్నారా? ఓట్ల చీలిక మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని ఓటమి నుండి గట్టేక్కిస్తుందా? అసలు మైనారీటీలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు మైనారీటీ ఓట్ల భయంపై స్పెషల్ స్టోరీ. నిర్మల్ నియోజక వర్గంలో ఎన్నికల పోరు ఉత్కంఠను రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మూడోసారి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కూచడి శ్రీహరిరావు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు ఎన్నికలలో గెలవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ముగ్గురు హేమాహేమీలు నువ్వా.. నేనా రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నిర్మల్‌లో నిర్వహించిన సభకు ప్రదాని నరేంద్ర మోదీ హజరయ్యారు. మోదీ సభ. సూపర్ సక్సైసైంది. ఈ సభతో విజయం ఖాయమని మహేశ్వర్ రెడ్డి భావిస్తున్నారట. కానీ ముస్లిం మైనారిటీల ఓట్లు దడ పుట్టిస్తున్నాయట. నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై వేలకుపైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో ముప్పై అయిదు వేల నుంచి నలబై వేల వరకు ముస్లిం మైనారీటీల ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లే అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. ఈ ఓట్లను దక్కించుకోవడానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కూచడి శ్రీహరిరావు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: రైతుబంధుకు ఈసీ బ్రేక్.. మంత్రి హరీశ్‌రావే కారణం గత అసెంబ్లీ ఎన్నికలలో ముస్లింలు బడార్ఎస్ వైపు మొగ్గు చూపారు. ఈసారి ముస్లింలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత కారణంగా ముస్లింలు కాంగ్రెస్ వైపు చూపుతున్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో ముగ్గురు ఒకరికంటే ఒకరు ప్రజల మద్దతు కూడగట్టడానికి పోటీ పడుతున్నారు. ముస్లింల ఓట్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా లేదంటే బీఆర్ఎస్ వైపు వెళ్తారనేది ఉత్కంఠను రేపుతుందట. బీజేపీని ఓడించడానికి ఒకవేళ గెలిచే కాంగ్రెస్ వైపు వెళతారు. అదేవిధంగా బీఆర్ఎస్ వైపు మొగ్గు ఉంటే కారు పార్టీ వైపు ఓట్లు వేసే అవకాశం ఉంది. బీజేపీని ఓడించటమే ముస్లిం లక్ష్యం. ఆరునూరైనా బీజేపీ విజయం సాదించవద్దని ముస్లింలు బావిస్తున్నారట. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్య ముస్లిం ఓట్ల చీలిక ఉంటుందని బీజేపీ అంచనా వేస్తుంది. ఇది తనకు కలిసి వస్తుందని బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి భావిస్తున్నారట. గత అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే బీజేపీ అభ్యర్థి స్వర్ణ రెడ్డికి 16,900 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తే 70,714 ఓట్లు వచ్చాయి. ఈ. ఎన్నికలలో మైనారిటీ ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయి. మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఆయన చేరికతో నియోజకవర్గంలో బీజేపీకి ఊపు, ఉత్సాహం వచ్చింది. గత పార్లమెంటు ఎన్నికలలో కూడా నిర్మల్ నియోజకవర్గంలో బీజేపీ వైపు ప్రజలు భారీగా మొగ్గు చూపారు. ఎంపీగా సోయంబాపురావు మెజారిటీ విజయం సాదించారు. పార్లమెంటు ఎన్నికల ఊపు మళ్లీ ఉంటుందని తన విజయం ఖాయమని మహేశ్వర్ రెడ్డి బావిస్తున్నారట. బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతుండటంతో తన విజయానికి ఎదురులేదని మహేశ్వర్ రెడ్డి అనుకుంటున్నారట. కానీ బీజేపీ విజయాన్ని అడ్డుకోవడానికి మైనారిటీలు ఏకం అవుతున్నారట. మహేశ్వర్ రెడ్డి ఓటమే లక్ష్యంగా మైనారిటీలు ఎత్తగడలు వేస్తున్నారట. ఓట్ల చీలిక నివారించి గెలిచే కారు, కాంగ్రెస్ ఓట్లు వేయాలని ముస్లింలు భావిస్తున్నారట.ఇప్పటికే నిర్మల్‌లో ఎంఐఎం మంత్రికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తోంది. మంత్రి కూడ ముస్లింల మద్దతు కూడగడుతున్నారట. బీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓట్లు వేయాలని మైనారిటీలను మంత్రి కోరుతున్నారట. మైనారీటీలు కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రచారం ఉంది. ముస్లింలు గంపగుత్తగా ఓట్లు వేస్తే మంత్రి విజయం ఖాయమని తెలిందట. మైనారీటీలు ఎకంగా మహేశ్వర్ రెడ్డికి దడ పుట్టిస్తోందట. కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్య ఓట్ల చీలికతో గట్టేక్కాలనుకున్నా ఆశలు అవిరవుతున్నాయట. విజయంపై ఆశలు సన్నగిల్లుతున్నాయట. అయితే ఏది ఏమైనా పార్లమెంటు ఎన్నికల మాదిరిగా ఈసారి విజయం ఖాయమని బావిస్తున్నారట. ముస్లిం మైనారీటలు ఎకమైనా, ఎంతమంది తన విజయాన్ని అడ్డుకోవడానికి కుట్రలు పన్నినా తన విజయాన్ని ఏవరు అపలేరంటున్నారట మహేశ్వర్ రెడ్డి. మరోకవైపు సర్కారు వ్యతిరేకత, మైనారిటీ ఓట్లతో కూచడి ధీమాతో ఉన్నారట. ఈ ముగ్గురిలో ఏవరు విజయం సాధిస్తారో చూడాలి -
నిర్మల్ ఎన్నికల ‘వరద’లో ఎదురీదేవరు?
ఆ పట్టణం వేనిస్ను మరిపిస్తోంది. వర్షకాలం వస్తే చాలు కాలనిలు చెరువులు అవుతున్నాయి. రోడ్లు కాల్వలు అవుతాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి పడవల్లో ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. పోని ఇదంతా పర్యాటక ప్రాంతమా అంటే అదీ కాదు. పోనీ ప్రగతి అంటే కాదు. అభివృద్ధి అసలు కాదు. మరి దశాబ్ద కాలంగా మంత్రి సాధించిన వందల కోట్ల అభివృద్ధి పనులు వరద పాలు కావడానికి కారణాలేంటి? ఆ వరదలు మంత్రిని ఎన్నికలలో ముంచుతాయా? వరదనీటిలో కమలం వికసిస్తుందా? వరదనీరు తెలంగాణ యోధుడు శ్రీహరి రావు విజయతీరాలకు చేర్చుతుందా? నిర్మల్ ఎన్నికల వరదలో ఎదురీదేవరు? ఏటిలో కోట్టుపోయేదేవరు? నిర్మల్ ఎన్నికల వరద యుద్దంపై సాక్షి స్పేషల్ రిపోర్ట్. వంద ఏళ్ల చరిత్ర, ఘనకీర్తి కలిగిన నిర్మల్ నిర్మల్ నియోజకవర్గానికి వందల చరిత్ర ఉంది. ఏంతో ఘనకీర్తి ఉంది. పాలన చిహ్నలు ఉన్నాయి. కోటలు ఉన్నాయి. కరువు పాతరేసిన చెరువులు ఉన్నాయి. కాలే కడుపులకు కడుపునిండా అన్నం పెట్టిన ధాన్యాగారం.. నియోజకవర్గంలో మామడ, లక్ష్మణ చాందా, సోన్ నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, సారంగపూర్, దిలావర్ పూర్, నర్సాపూర్ జి మండలంలో కోన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో నూతన ఓటరు జాబితా ప్రకారం 2,33,248 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మున్నూర్ కాపు, ముస్లిం, ముదిరాజ్, పద్మశాలి, గంగపుత్రుల ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. ఈ నియోజకవర్గం నుండి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్పీ పార్టీ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత మారిన సమీకరణాలతో అప్పటి టీఆర్ఎస్.. ఇప్పటి బీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ క్యాబినెట్లో మంత్రయ్యారు ఇంద్రకరణ్. మళ్లీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలలో 79,985 ఓట్లతో 46 శాతం ఓట్లు సాధించి. కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డిపై విజయం సాధించారు. 9,271 ఓట్ల మెజారిటీతో మంత్రి విజయం సాధించారు. క్యాబినెట్లో రెండోసారి మంత్రి అయ్యారు. రెండోసారి మంత్రిగా అభివృద్ధిలో నిర్మల్ నియోజకవర్గం రూపురేఖలు మార్చారు. నిర్మల్ పట్టణం సుందరీకరణ చేశారు. కాలనిలకు రోడ్లు నిర్మించారు. జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరెట్ నిర్మాణం, మెడికల్ కళాశాల వంటివి సాధించారు. అదేవిధంగా మారుమూల ప్రాంతాలకు రోడ్డు రవాణా కల్పించారు. అదే విధంగా నిర్మల్ ఆసుపత్రిని వంద పడకల అసుపత్రిగా మార్చారు. ఈ ప్రగతితో నిర్మల్ రూపురేఖలు మార్చారని పేరుంది. వీటితో పాటు అడెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దశ తిగిన దిశ మారని నిర్మల్ అభివృద్ధితో నిర్మల్ దశ మారిన దిశ మారలేదు. వందల ఎళ్లుగా నీళ్లను అందించే చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. ఆ కబ్జాలతో చెరువులు కనిపించకుండా పోతున్నాయి. వర్షకాలంలో చెరువులలో వెళ్లాల్సిన వరదనీరు రోడ్లపైకి వస్తోంది. కాల్వలను మరిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలలో ఇండ్ల పైకప్పులను ముంచుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పడవల్లో ప్రజలు భయటకు వస్తున్నారు. అదేవిధంగా నిర్మల్ మున్సిపల్లో నాలగో తరగతి ఉద్యోగులనియమాకం వివాదస్పందంగా మారింది. ఉద్యోగాలన్ని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ బంధువులకు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధుల బంధువులకు దక్కాయి. అక్రమంగా ఉద్యోగాల నియమాకాలపై తీవ్రమైన దుమారం రేగింది. సంతలో సరుకులా మున్సిపల్ ఉద్యోగాలు అమ్ముకున్నారని ప్రజలు పార్టీల అధ్వర్యంలో ఉద్యమించారు. ఈ అక్రమం ఉద్యోగాల నియమాకాలపై అర్డిఓ చేత విచారణ జరిపించారు. ఆవిచారణలో ఉద్యోగాలు అక్రమంగా నియమాకాలు చేశారని తెలింది. ఆ ఉద్యోగాలు రద్దు చేయాలని అర్డీఓ సిఫార్స్ చేశారు. మంత్రి కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. ఇది మంత్రికి మచ్చగా మారింది. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరెట్ నిర్మాణం వివాదంగా మారుతోంది. చెరువులో ఎస్ఎటీఎల్ లేవల్ నిర్మాణం ఒక వివాదమైతే. దీనికి తోడు మంత్రి, బంధువులకు భూములు ఉన్నచోట కలెక్టరెట్ నిర్మాణం చేశారని ప్రతిపక్షాలు అరోపిస్తున్నాయి. ఉద్యోగాల మచ్చ తోలగక ముందే పట్టణంలో మాస్టర్ ప్లాన్ మంత్రికి దడపుట్టిస్తోంది. తమ భూములు కోల్లగోట్టేందుకు మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపోందించారని రైతులు అందోళన కోనసాగిస్తున్నారు. భూములకు నష్టం కలిగించమని మంత్రి భరోసా ఇచ్చిన ఇంకా ప్రజలు నమ్మడం లేదట. అవినీతికి అడ్డాగా మంత్రి..! వీటితో పాటు డీ1 పట్టాలు మంత్రి బంధువులు అక్రమంగా పోందారని కాంగ్రెస్, బీజేపీలు ప్రజల్లో ప్రచారం చేస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే దళితుల సంక్షేమం అమలు చేస్తున్నా ఈ దళితబంధు పథకం మంత్రికి అడ్డంగా తిరిగింది. నర్సాపూర్ జిలో దళిత బంధు గురించి మంత్రిని ప్రశ్నించిన మహిళపై కేసు నమోదైంది. అది దళిత వర్గాలపై వ్యతిరేకతను పెంచింది. నియోజకవర్గంలో సాగునీరు అందించే ప్రాణహిత, చేవేళ్ల 27 ప్యాకేజీ పనులు అంగులం కదలడం లేదు. అభివృద్ధి పనులు పురోగతి లేకున్నా పార్టీలో అసంతృప్తి మంత్రికి తలనోప్పిగా మారిందట. గత అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ శోభ సత్యనారాయణ భర్త సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, బీఆర్ఎస్ కీలక నాయకుడు శ్రీహరి మంత్రి గెలుపులో కీలకంగా వ్యవహరించారు. మంత్రి తీరుతో విసిగిపోయిన శ్రీహరి మంత్రిపై తిరుగుబాటు చేశారు. పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అదేవిధంగా మంత్రి సన్నిహితుడు సారంగపూర్ జడ్పీటీసీ మంత్రితో విబేధాల కారణంగా పార్టీ వీడారు. కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి గెలుపు కోసం పనిచేసిన శ్రీహరి రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. మంత్రిపై ప్రజల్లో వ్యతిరేకత, అవినీతి ఆరోపణలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ ఎత్తుగడలు వేస్తున్నాయి. రెండుసార్లు అత్యల్ప ఓట్లతో ఓటమి పాలైనా ఈసారి ఆరునూరైనా విజయం సాధించాలని మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఈసారి మహేశ్వర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. వ్యూహలు రచిస్తున్నారు. ప్రజల్లోకి వెళుతున్నారు. మంత్రి వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలలో ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మంత్రిపై వ్యతిరేకత.. కాంగ్రెస్, బీజేపీలకు ప్లస్? అదేవిధంగా అవినీతి మంత్రిని ఓడించాలని ప్రజలను కోరుతున్నారు. వరదలకు మంత్రి కబ్జాలే కారణమని ఆరోపిస్తున్నారట. ఈ సందర్భంగా ఎలేటి మహేశ్వర్‌రెడ్డి ఎన్నికలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే బీసీ, ఎస్సీ ఓటర్ల మద్దతు కూడ గడుతున్నారు. ఎలేటికి ప్రజల్లో మద్దతు లభిస్తున్న ఎన్నికల వరకు మద్దతు ఉపయోగించుకోవడం లేదని పేరుంది. ఈసారి చివరి వరకు పట్టు నిలుపుకోని విజయం సాధించాలని ఆయన భావిస్తున్నారు. అయితే మహేశ్వర్‌రెడ్డి నియోజకవర్గంలో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ప్రచారం ఉంది. చుట్టం చూపులా హైదారాబాద్ నుండి వచ్చి పోతున్నారని భావన. ఈ భావన తోలగించుకోకుంటే ప్రతికూలంగా మారుతుందని కార్యకర్తల్లో ఉంది. అదేవిధంగా సర్కార్ వైఫల్యాలపై పోరాటం చేయడంలో వెనుకబడ్డారని సోంత పార్టీలో ఉంది. మంత్రిపై వ్యతిరేకత ఉన్నా అనుకూలంగా మలుచుకోకపోతే గత రెండు ఎన్నికల ఫలితాలే పునరావుతం అయ్యే అవకాశం ఉంది. కానీ ఈసారి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా మంత్రిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. ఎన్నికలలో గెలిచి తీరాలనే కసితో ప్రజల్లోకి వెళ్లుతున్నారు. కచ్చితంగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారట మహేశ్వర్ రెడ్డి. మరోకవైపు 2009, 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీహరి రావు పోటీ చేశారు. ఈ ఎన్నికలలో శ్రీహరి రావుకు భారీగా ఓట్లు లభించాయి. విజయ అంచుల వరకు హరి కేవలం ఎనిమిది వేల ఓట్లతో శ్రీహరి రావు ఇంద్రకరణ్‌రెడ్డిపై ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికలలో శ్రీహరి రావు మంత్రి బీఅర్ఎస్లో చేరడంతో టికెట్ దక్కలేదట. కానీ బీజేపీలో మహేశ్వర్‌రెడ్డి చేరడంతో బీఆర్ఎస్లో ఉన్న శ్రీహరి రావు కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి మంత్రికి వ్యతిరేకంగా తనకు మద్దతు కూడగడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. 2014 ఎన్నికలలో ఓటమికి ఈ ఎన్నికలలో కసి తీర్చుకోవాలని భావిస్తున్నారట. మంత్రిపై ఉన్న వ్యతిరేకత తనకు గెలుపు ఖాయమని భావిస్తున్నారట శ్రీహరి. మరి ఈ ముగ్గురిలో ఎవరికి ప్రజలు పట్టం కడుతారో చూడాలి. -
నిర్మల్ నియోజకవర్గం ఘన చరిత్ర
నిర్మల్ - నాలుగోసారి గెలిచి మళ్లీ మంత్రి అయిన ఇంద్రకరణ్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ నాయకుడుగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి మరోసారి నిర్మల్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన నాలుగోసారి తన సమీప ప్రత్యర్ది మహేష్‌రెడ్డిపై 9271 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. గతంలో ఎమ్.పిగా, జడ్పి చైర్మన్‌గా కూడా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి టిడిపితో రాజకీయాలలోకి వచ్చారు. తదుపరి కాంగ్రెస్ఐలోకి వచ్చారు. 2014లో అనూహ్యంగా ఆయన బిఎస్పి టిక్కెట్‌పై గెలుపొంది, ఆ తర్వాత టిఆర్ఎస్లో విలీనం అయ్యారు. దాంతో ఆయన మంత్రి అయ్యారు. 2018లో టిఆర్ఎస్ గెలిచి కెసిఆర్ క్యాబినెట్లో మరోసారి స్థానం సంపా దించుకున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి 79985 ఓట్లు రాగా, మహేష్ రెడ్డికి 70714 ఓట్లు వచ్చాయి. కాగా బిజపి పక్షాన పోటీచేసిన డాక్టర్ ఇండ్ల సువర్ణారెడ్డికి 16900 ఓట్లు వచ్చి మూడో స్థానంలో ఉన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి సామాజికంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2014లో ఎ.ఇంద్రకరణ్ రెడ్డి 8497 ఓట్ల మెజార్టీ సాధించి తన సత్తా చాటుకున్నారు. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం అభ్యర్దిగా రంగంలోకి వచ్చిన మహేష్ రెడ్డిపై స్వల్ప తేడాతో ఓడిపోయినా తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి వరసగా రెండుసార్లు విజయం సాధించడం విశేషం. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అవడంతో మహేష్ రెడ్డి కాంగ్రెస్ ఐ ఎమ్మెల్యే అయ్యారు. ఇంద్రకరణ్ కొంతకాలం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్‌లోకి వెళ్లారు. తెలంగాణ ఆవిర్భావంతో తిరిగి కాంగ్రెస్ ఐలోకి వచ్చారు. కాని 2014లో టిక్కెట్ రాదని అర్ధం అవడంతో బిఎస్పి టిక్కెట్ లపై నిర్మల్ నుంచి పోటీచేసి గెలుపొందడం విశేషం. నిర్మల్‌లో అత్యధికంగా పదమూడుసార్లు రెడ్లు ఎన్నిక కాగా, మూడుసార్లు బ్రాహ్మణులకు అవకాశం వచ్చింది. ఒక ఎస్.సి కూడా ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు గెలిచారు.నిర్మల్ నియోజకవర్గానికి కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఆరుసార్లు, టిడిపి ఐదుసార్లు సోషలిస్టు పార్టీ, ప్రజారాజ్యం పార్టీ, బిఎస్పి, టిఆర్ఎస్ ఒక్కోసారి గెలుపొందాయి. ఒక ఇండి పెండెంటు కూడా నెగ్గారు. ఇక్కడ నుంచి మాజీ మంత్రి పి.నర్సారెడ్డి మూడుసార్లు గెలిస్తే ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నర్సారెడ్డి లోక్‌సభకు కూడా ఎన్నిక య్యారు. 1985 నుంచి టిడిపి సీనియర్ నేతగా ఉండి ఎస్. వేణుగోపాల్‌చారి మూడుసార్లు ఇక్కడ గెలిచి, ఆ తరువాత మూడుసార్లు ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసిన చరిత్రను ఈయన సొంతం చేసుకున్నారు. 2009లో ముధోల్ నుంచి పోటీచేసి వేణుగోపాలాచారి గెలిచారు. తదుపరి టిఆర్ఎస్లో చేరి 2014లో ముధోల్‌లో తిరిగి పోటీచేసి ఓడిపోయారు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు అయిన వారిలో వేణుతో పాటు ఇంద్రకరణ్‌రెడ్డి, నర్సారెడ్డి, గంగారెడ్డిలు కూడా ఎమ్.పిలుగా ఎన్నికయ్యారు. 2008లో టిఆర్ఎస్కు చెందిన లోక్‌సభ సభ్యుడు రాజీనామా చేసిన కారణంగా జరిగిన ఉప ఎన్నికలో ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్ ఐ తరుఫున పోటీ చేసి గెలుపొందడం విశేషం. కాని 2009లో శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ఇక్కడ నుంచి గెలిచి మంత్రులైన వారిలో నర్సారెడ్డి, వేణుగోపాలాచారి, పి.గంగారెడ్డి, ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నారు. గంగారెడ్డి 1978లో చెన్నారెడ్డి క్యాబినెట్లో ఉండగా. నర్సారెడ్డి అప్పట్లో పి.వి., జలగం క్యాబినెట్లలో పనిచేసారు. జిల్లా పరిషత్ ఛ్కెర్మన్గా పనిచేసిన ఇంద్రకరణ్‌రెడ్డి గతంలో టిడిపి తరుఫున లోక్‌సభకు ఎన్నికైనా, ఆ తరువాత పి.వి. నరసింహారావు ప్రభుత్వాన్ని రక్షించడం కోసం పార్టీ మారినవారిలో ఉన్నారు. నిర్మల్‌లో గెలిచిన మరో నేత ఎ.భీమ్‌రెడ్డి 1983లో డిప్యూటీ స్పీకర్ పదవి నిర్వహించారు. నిర్మల్ గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..