సాక్షి, హైదరాబాద్: అనగనగా ఒక కాకి.. ఆ కాకికి దాహం వేసింది. చుట్టూ వెదికింది. ఎక్కడా నీళ్లు కనిపించలేదు.. దాహంతో గొంతు తడారిపోతుండగా. ఎక్కడో అడుగున కాసిన్ని నీళ్లతో ఒక కూజా కనిపించింది. ఆ నీళ్లు అందకపోవడంతో తెలివిగా కొన్ని గులకరాళ్లను తెచ్చి అందులో వేసి.. నీళ్లు పైకి వచ్చాక తన దాహాన్ని తీర్చుకుంది.. హాయిగా ఎగిరిపోయింది..ఈ కథ తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. అంతేనా కాకమ్మ తెలివితేటల గురించి చాలా స్టోరీలు ఇప్పటిదాకా వైరల్ అయ్యాయి. మనుషులు అతి నిర్లక్ష్యంగా పారవేసిన చెత్తను, ప్లాస్టిక్ బాటిళ్లతో సహా ఏరి చెత్త కుండీలో పారవేసిన స్వచ్ఛ్ భారత్ కాకి కథను కూడా విన్నాం. కానీ తాజాగా అలనాటి పాత కథను తలపించేలా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక చిన్న ప్లాస్టిక్ బాటిల్‌లో ఉన్న నీళ్ల కోసం ఒక పిట్ట కష్టపడుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. కాకికే షాకిచ్చిందిగా బుల్లి పిట్ట. ఔరా అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు.
ఈ వీడియోలోకనిపించిన మాగ్‌పై పక్షలు కూడా కాకుల్లాగే చాలా తెలివైనవట. గత ఏడాది స్టీవ్ స్టీవార్డ్ విలియమ్స్ అనే యూజర్ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అది తిరిగి తిరిగి మళ్లీ ఇపుడు వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేసుకోండి మరి!
Comments
Please login to add a commentAdd a comment