Guntur Doctors Removed 219 Stones In Female Gall Bladder, Goes Viral - Sakshi
Sakshi News home page

Guntur Doctors: మహిళ గాల్‌ బ్లాడర్‌లో 219 రాళ్లు

May 28 2022 4:17 PM | Updated on May 28 2022 9:39 PM

Guntur Doctors Removed 219 Stones in Female Gallbladder - Sakshi

పిత్తాశయం నుంచి తొలగించిన 219 రాళ్లు

నరసరావుపేట (పల్నాడు జిల్లా): పట్టణంలోని మాతాశ్రీ హాస్పిటల్‌ వైద్యులు ఓ మహిళ పిత్తాశయం (గాల్‌ బ్లాడర్‌) నుంచి ఏకంగా 219 రాళ్లను వెలికితీశారు. హాస్పిటల్‌ డాక్టర్‌ పి.రామచంద్రారెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన 52 ఏళ్ల ఫాతిమా కడుపునొప్పితో తమను సంప్రదించిందన్నారు. హైప్రోస్కోపిక్‌ ద్వారా ఆమె పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆమెకు ఈ నెల 20న ఆపరేషన్‌ చేసి 219 రాళ్లను వెలికితీశామన్నారు. 

సాధారణంగా 20 రాళ్లు ఉంటేనే కఠినతరంగా భావిస్తామని, ఏకంగా ఓ మహిళ గాల్‌ బ్లాడర్‌ నుంచి ఇన్ని రాళ్లను వెలికితీయటం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చని పేర్కొన్నారు. ఆపరేషన్‌ అనంతరం ఆ మహిళ సురక్షితంగా ఇంటికి వెళ్లారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement