రాళ్ల దాడి అనుకున్నాం..
ఈ నెల 5న ఉదయం అమర్‌నాథ్‌కు వెళ్లి తిరుగు పయనమయ్యారు. అనంతనాగ్ జిల్లా ఖాజీగుండ్ ప్రాంతంలో 6వ తేదీ సాయంత్రం ఆగి భోజనాలు చేసుకు న్నారు. 6 గంటల సమయంలో బస్సు కదల గానే ఒక్కసారిగా దాడి జరిగింది. బస్సులో అరుపులు, బొబ్బలతో అందరూ ఒకరిపై ఒకరు పడుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరకు బస్సును కొంత దూరంలో డ్రైవర్ ఆపారు. సీఆర్పీఎఫ్ పోలీసులు వచ్చి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గ్రెనేడ్ పేలుడులో కరీంనగర్‌కు చెందిన శంకరశర్మ (60) మృతి చెందగా, జయంతి, విశ్వనాథం, విజయ, లక్ష్మీబాయి తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు అనంతనాగ్‌కు, అనంతరం శ్రీనగర్‌కు తరలించారు. తెలంగాణ ప్రభు త్వం, కామారెడ్డి జిల్లా యంత్రాంగం చొరవతో 38 మంది బాధితులను శనివారం రాత్రి హైద రాబాద్‌కు తరలించారు. గాయపడ్డ నలు గురు, నలుగురు సహాయకులు అక్కడే ఉండి పోయారు. చికిత్స పొందుతున్నవారిని తీసుకు రావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.