grenade explosion
-
ఎన్నికల రాష్ట్రంలో వరుస గ్రెనేడ్ దాడులు
ఇంఫాల్: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్‌లో వరుస గ్రెనేడ్ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) మద్దతుదారుడు లోకెన్ సింగ్ ఇంటిపైకి దుండగులు గ్రెనేడ్ విసిరారు. కైరావ్ అసెంబ్లీ సెగ్మెంట్లోని ఇరిల్బంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరాప్తి అవాంగ్ లీకైలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. గ్రెనేడ్ పేలుడులో లోకెన్ సింగ్ 27 ఏళ్ల కుమారుడి కుడి కాలికు గాయాలయ్యాయని వెల్లడించారు. డీజీపీ, సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు మొదలు పెట్టామని, గ్రెనేడ్ దాడికి పాల్పడిన వారిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని లోకెన్ కుటుంబీకులు చెప్పారు. ఇటీవల తమ ఇంటి ఆవరణలో బీజేపీ జెండా పెట్టేందుకు అనుమతించలేదని వారు వెల్లడించారు. మరోవైపు గ్రెనేడ్ దాడిని ఖండిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. (చదవండి: పొలిటికల్ సిద్ధూయిజం: క్రికెట్లో అజారుద్దీన్‌నీ వదల్లేదు..) ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని జనవరి 9న జరిగిన మరో ఘటనలో ఇండియా రిజర్వ్ బెటాలియన్(ఐఆర్బీ) పనిచేస్తున్న వ్యక్తితో పాటు బీజేపీ కార్యకర్త హత్యకు గురయ్యారు. కాంగ్రెస్ నేతల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో జనవరి 13న అరగంట వ్యవధిలో రెండు గ్రెనేడ్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఎవరూ గాయపడనప్పటికీ, ఆస్తి నష్టం సంభవించింది. (చదవండి: ఆ రోజు వద్దు.. మరో రోజు పోలింగ్ పెట్టండి ప్లీజ్) -
రాళ్ల దాడి అనుకున్నాం..
సాక్షి, కామారెడ్డి: ‘‘అప్పుడే భోజనం చేసి బస్సు ఎక్కి కూర్చున్నాం. ఒక్కసారిగా బస్సు అద్దాలు పగులుతున్న చప్పుడు వినిపించింది. ఎవరో రాళ్ల దాడి చేస్తున్నారనుకున్నాం. పగి లిన అద్దాల నుంచి దూసుకొచ్చిన గ్రెనేడ్ పేలింది. క్షణంలో గ్రెనేడ్ ముక్కలు వచ్చి పలు వురిని గుచ్చుకున్నాయి. మాలో ఒకరు తీవ్ర గాయాలతో చనిపోగా, మరికొందరు గాయాల పాలయ్యారు’ అంటూ అమర్నాథ్ యాత్రలో ఇబ్బందుల పాలై ఆదివారం ఉదయం తిరిగి ఇళ్లకు చేరిన బాధితులు తెలిపారు. గత నెల 27న శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ట్రావెల్స్ యజమాని ఓంప్రకాశ్ ద్వారా ఉత్తర భారత తీర్థయాత్రకు 44 మంది యాత్రికులు, ఇద్దరు వంట మనుషు లతో బయలుదేరారు. ఈ నెల 5న ఉదయం అమర్నాథ్కు వెళ్లి తిరుగు పయనమయ్యారు. అనంతనాగ్ జిల్లా ఖాజీగుండ్ ప్రాంతంలో 6వ తేదీ సాయంత్రం ఆగి భోజనాలు చేసుకు న్నారు. 6 గంటల సమయంలో బస్సు కదల గానే ఒక్కసారిగా దాడి జరిగింది. బస్సులో అరుపులు, బొబ్బలతో అందరూ ఒకరిపై ఒకరు పడుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరకు బస్సును కొంత దూరంలో డ్రైవర్ ఆపారు. సీఆర్పీఎఫ్ పోలీసులు వచ్చి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గ్రెనేడ్ పేలుడులో కరీంనగర్‌కు చెందిన శంకరశర్మ (60) మృతి చెందగా, జయంతి, విశ్వనాథం, విజయ, లక్ష్మీబాయి తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు అనంతనాగ్‌కు, అనంతరం శ్రీనగర్‌కు తరలించారు. తెలంగాణ ప్రభు త్వం, కామారెడ్డి జిల్లా యంత్రాంగం చొరవతో 38 మంది బాధితులను శనివారం రాత్రి హైద రాబాద్‌కు తరలించారు. గాయపడ్డ నలు గురు, నలుగురు సహాయకులు అక్కడే ఉండి పోయారు. చికిత్స పొందుతున్నవారిని తీసుకు రావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు
-
పఠాన్‌కోట్ లో పేలుడు; మరో జవాన్ మృతి
పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ లో ఆదివారం ఉదయం ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆర్మీ ఆఫీసర్ నిరంజన్ సింగ్ మృతిచెందగా, మరో ఐదుగురు సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం ఎయిర్‌బేస్ నుంచి తుపాకీ కాల్పులతో పాటు పేలుడు శబ్ధాలు వినిపించినట్టు స్థానికుల చెబుతున్నారు. ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్ కౌంటర్ లో మొత్తం ఐదగురు ఉగ్రవాదులను హతమార్చగా, ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల మృతదేహాల పక్కన పడిఉన్న ఏకే-47, గ్రనైడ్స్, జీపీఎస్ పరికరాలు, మోర్టార్లను సిబ్బంది స్వాధీనం చేసుకుంది. ఆర్మీ, పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఎయిర్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఐఎస్ఐ పథకం ప్రకారం జైష్ ఫిదేయిన్స్ ఉగ్రవాదులు పఠాన్‌కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంపుపై దాడి చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బాంబు పేలుడులో పోలీసు మృతి
కాశ్మర్లోని సొపోర్ పట్టణంలో శనివారం ఉదయం ఓ గ్రెనేడ్ పేలడంతో ఓ పోలీసు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సొపోర్ పట్టణంలో అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు రాళ్లు విసురుతుండగా పోలీసులు వారిని అదుపు చేస్తున్నారని, అంతలో ఉగ్రవాదులు కూడా అక్కడకు చేరుకుని పోలీసులపై గ్రెనేడ్ విసిరారని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఈ పేలుడు వల్ల ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో ఓ పోలీసు కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉండి, తర్వాత అతడు మరణించాడని తెలిపారు. మిగిలిన నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన ఇద్దరికి కొద్దిపాటి గాయాలయ్యాయన్నారు. ముస్లింలకు పవిత్రమైన షబ్బే ఖదర్ రాత్రి ఈ దాడి జరిగింది. ప్రపంచవ్యాప్తంగా భక్తులంతా రాత్రంతా ప్రార్థనలు జరుపుతున్న సమయంలో ఈ మారణహోమం సంభవించింది.