![Dhanush and Rajni have a clash this year - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/12/darba.jpg.webp?itok=dQ5g41oG)
రజనీకాంత్, ధనుష్
మామాఅల్లుళ్ల సవాల్ సినిమాల్లో భలే సరదాగా ఉంటాయి. నువ్వా? నేనా? అని మామా అల్లుళ్లు తలపడటం సినిమాల్లో చూస్తుంటాం. ఇప్పుడు తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర మామాఅల్లుళ్లు రజనీకాంత్, ధనుష్ తలపడే అవకాశం కనిపిస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయిక. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. మరోవైపు దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘పటాస్’. మెహరీన్, స్నేహా కథానాయికలు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ‘పటాస్’ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. దాంతో వచ్చే ఏడాది పొంగల్‌కి బాక్సాఫీస్ దగ్గర మామాఅల్లుళ్ల క్లాష్ ఏర్పడనుందని భావిస్తున్నారంతా. ఏం జరుగుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment