
చెన్నై: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులను పలకరించడానికి తన నివాసం నుంచి బయటకు వచ్చారు. తనను చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ..రజనీ సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇందులో తెల్లని కుర్తా, పైజామా ధరించిన సూపర్ స్టార్ తనదైన స్టైల్లో నమస్కారం చేస్తూ సూపర్ కూల్‌గా ఉన్నారు. తాము అభిమానించే నటుడ్ని దగ్గరనుంచి కలిసినందుకు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు రజనీకాంత్ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి పండుగను చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ట్విటర్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు.
చదవండి: నాగ చైతన్య, సమంత విడాకులు.. డైరెక్టర్‌కు తెచ్చిన కష్టాలు
‘మనమందరం భయంకరమైన, ప్రమాదకరమైన కాలంలో జీవిస్తున్నాము. కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని మనం రక్షించుకోడానికి అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. మన ఆరోగ్యం కంటే ముఖ్యమైంది ఏదీ లేదు. అందరికీ పొంగల్ శుభాకాంక్షలు' అని రజనీకాంత్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
చదవండి: ఈ వార్తలకి, చర్చలకు ఫుల్‌స్టాప్ పెట్టండి: చిరంజీవి
Comments
Please login to add a commentAdd a comment