పొంగల్ బరిలో మరో చిత్రం.. ఆ స్టార్ హీరోలతో పోటీ! | Arun Vijay Starrer Mission: Chapter 1 To Release On Pongal | Sakshi
Sakshi News home page

Mission Chapter 1: సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో మిషన్ చాప్టర్-1!

Published Wed, Dec 27 2023 4:16 PM | Last Updated on Wed, Dec 27 2023 4:35 PM

Arun Vijay Starrer Mission Chapter 1 Release On Pongal Day - Sakshi

సంక్రాంతి వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద పోటీ మామూలుగా ఉండదు. స్టార్ హీరోల సినిమాలు పొంగల్‌ బరిలో ఉండడం సహజం. అలాగే వచ్చే ఏడాది కూడా కోలీవుడ్ స్టార్స్ రజనీకాంత్‌, ధనుష్‌ చిత్రాలు కూడా ఉన్నాయి. స్టార్ హీరోలతో మరో చిత్రం పోటీకి సిద్ధం అవుతోంది.

అరుణ్‌ విజయ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మిషన్‌ చాప్టర్‌– 1. ఐచ్చంయన్బదు ఇల్లయే. ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఆమెతో పాటు నటిగా మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న నిమీషా సజయన్‌ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల హక్కులను లైకా ప్రొడక్షనన్స్‌ అధినేత సుభాస్కరన్‌ పొందారు. 

తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని పొంగల్‌ సందర్భంగా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు విజయ్‌ తన దర్శక ప్రతిభతో నిర్మాతలకు నచ్చిన దర్శకుడిగా మారారన్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె, లండన్‌లో 70 రోజల పాటు నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. మంచి యాక్షన్‌తో రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 ఇటీవల విడుదల చేసిన చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. ముఖ్యంగా యాక్షన్‌తో కూడిన ఉద్వేగ భరిత సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. చిత్ర ఆడియో, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం త్వరలోనే వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో అభిహాసన్‌, భరత్‌ బొప్పన్న ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ.ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement