పోటీ నుంచి తప్పుకున్న నితిన్ | Nithin trivikram movie out of pongal race | Sakshi
Sakshi News home page

పోటీ నుంచి తప్పుకున్న నితిన్

Published Tue, Oct 6 2015 8:46 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పోటీ నుంచి తప్పుకున్న నితిన్ - Sakshi

పోటీ నుంచి తప్పుకున్న నితిన్

హీరోగానే కాక నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నితిన్, త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమాకు రెడీ అవుతున్నాడు. 'అ ఆ' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో హీరోగా స్టార్ ఇమేజ్ అందుకోవాలని భావిస్తున్నాడు ఈ యంగ్ హీరో. అదే సమయంలో అఖిల్ హీరోగా తను నిర్మిస్తున్న 'అఖిల్' సినిమాతో మంచి సక్సెస్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు.

త్రివిక్రమ్తో చేయబోయే సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసి స్టార్ హీరోగా తన లైన్ క్లియర్ చేసుకోవాలనుకున్నాడు. అయితే ప్రస్తుతానికి ఈ యంగ్ హీరో ఆ ఆలోచన విరమించుకున్నాడట. ఇప్పటికే పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, బాలయ్య లాంటి టాప్స్టార్లు సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధం అవుతుండటంతో, ఆ సమయంలో తాను పోటీకి దిగటం కరెక్ట్ కాదని భావిస్తున్నాడట. అందుకే కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇంకా షూటింగ్ కూడా మొదలు కానీ 'అ ఆ' సినిమాను హడావిడిగా పూర్తి చేసి రిలీజ్ చేసే కన్నా, కాస్త గ్యాప్ తీసుకొని ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం కరెక్ట్ అని నిర్ణయించుకున్నాడు. అందుకే ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న త్రివిక్రమ్ కాంబినేషన్లో నటిస్తున్న 'అ ఆ' సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి నితిన్ కొత్త ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement