పండగ సెలవులు | Karthi shoots in Tenkasi for Lokesh Kanagaraj film | Sakshi
Sakshi News home page

పండగ సెలవులు

Published Mon, Jan 7 2019 3:21 AM | Last Updated on Mon, Jan 7 2019 3:21 AM

Karthi shoots in Tenkasi for Lokesh Kanagaraj film - Sakshi

కార్తీ

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తారని తెలిసిందే. సంక్రాంతిని తమిళనాడులో పొంగల్‌ పేరుతో సెలబ్రేట్‌ చేసుకుంటారని తెలిసిందే. ఈ పెద్ద పండక్కి కుటుంబ సభ్యులతో కలిసి జాలీగా గడపటానికి ఇష్టపడతారు సినీ తారలు. ఈ లిస్ట్‌లో కార్తీ కూడా ఉన్నారు.

ఈ ఏడాది పొంగల్‌కి ఆయన రెండు రోజులు సెలవు తీసుకుని తిరగి షూట్‌లో జాయిన్‌ అవుతారు. ప్రస్తుతం ‘మా నగరం’ ఫేమ్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కార్తీ హీరోగా ఓ యూక్షన్‌ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా చెన్నైలో స్టార్ట్‌ అయిన ఈ సినిమా షూటింగ్‌ తాజాగా టెన్‌కాశీలో జరుగుతోంది. పొంగల్‌కి బ్రేక్‌ తీసుకుని మరలా అదే లోకేష¯Œ లో షూట్‌ స్టార్ట్‌ చేస్తారు టీమ్‌. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రే లేకపోవడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement