వివిధ సంక్రాంతి | sankranthi festival celebrations in other states | Sakshi
Sakshi News home page

వివిధ సంక్రాంతి

Published Sun, Jan 12 2014 1:36 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

వివిధ సంక్రాంతి - Sakshi

వివిధ సంక్రాంతి

పండుగ
 వివిధ రాష్ట్రాలలో సంక్రాంతిని వివిధ రకాలైన పేర్లతో, వివిధ రకాలుగా జరుపుకుంటారు.
 తమిళనాడు: సంక్రాంతిని పొంగల్‌గా జరుపుకుంటారు. ఇంటి ఇలవేల్పుకు భక్తిశ్రద్ధలతో పూజ చేసి, పొంగలిని నైవేద్యం పెడతారు. మరికొందరు బియ్యం, రకరకాల పప్పుదినుసులు, పాలు, నెయ్యి కలిపి కిచిడీలా తయారు చేసి, కులదేవతకు నైవేద్యం సమర్పిస్తారు.
 
 ఉత్తరప్రదేశ్:వీరికిది  ఖిచిరి పేరుతో నదులలో పుణ్యస్నానాలు చేసే రోజు. పండుగకి నెలరోజుల ముందునుంచే మాఘమేళా పేరుతో నదులలో స్నానం చేసే సంప్రదాయం ఆరంభమవుతుంది. త్రివేణి సంగమం, ప్రయాగ, హరిద్వార్‌లలో పుణ్యస్నానాలు చేస్తారు.
 
 బెంగాల్: ప్రజలంతా ఈ రోజున గంగాసాగర్‌లో పుణ్య స్నానాలు చేస్తారు.  
 మహారాష్ట్ర:చక్కెర, నువ్వులు కలిపి తయారు చేసిన పంచదార బిళ్లలను పంచుకుంటారు.  ‘గత సంవత్సరంలో నా వల్ల జరిగిన తప్పులు, పొరపాట్లను క్షమించి, నన్ను ఆశీర్వదించు’ అని చెబుతూ పరస్పరం ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, నువ్వుల లడ్డూలను తినిపించుకుంటారు. వివాహితలు హల్దీ- కుంకుమ్ ఉత్సవ్ పేరుతో ముత్తయిదువులను ఇంటికి పిలిచి,   కొత్త పాత్రలో పసుపు, కుంకుమ ఇసారు.
 గుజరాత్: కుటుంబంలోని పెద్దలు చిన్నవాళ్లకు కానుకలిస్తారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు మంజూరు చేస్తారు. జ్యోతిషం, తత్త్వశాస్త్రంలో పరిపూర్ణత సాధించిన  శిష్యులను గురువులు సత్కరిస్తారు. ప్రజలంతా పెద్ద ఎత్తున గాలిపటాలు ఎగురవేస్తారు.
 
 మధ్యప్రదేశ్: సకారత్ పేరుతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. రకరకాల పిండివంటలు చేసుకుని, ఒకరికొకరు పంచుకుంటారు.
 
 కేరళ: అయ్యప్పదీక్షకు ముగింపు పలుకుతూ ఉత్సవాలు, పూజలు చేస్తారు.
 ఒరిస్సా: గిరిజన తెగలలో ఈ పండుగను కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. నెగడు వెలిగించి, దానిచుట్టూ పాటలతో నృత్యం చేస్తారు. ప్రత్యేకమైన వంటకాలను ఆరగిస్తారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement