
సాక్షి, గుంటూరు: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విద్య, వివేకం, జ్ఞానం, దీక్ష, దక్షత అన్నీ నేర్పేది గురువు. జీవిత లక్ష్యాన్ని సాధించే దిశగా నడిపించే మార్గదర్శి గురువు. అనునిత్యం మనలో స్ఫూర్తి నింపే గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ఘన నివాళి
మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, పెనమలూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి పాల్గొన్నారు.

విద్య, వివేకం, జ్ఞానం, దీక్ష, దక్షత అన్నీ నేర్పేది గురువు. జీవిత లక్ష్యాన్ని సాధించే దిశగా నడిపించే మార్గదర్శి గురువు. అనునిత్యం మనలో స్ఫూర్తి నింపే గురువులందరికీ ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు.#TeacherDay pic.twitter.com/M7LwkkTawA
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2024

Comments
Please login to add a commentAdd a comment