సాక్షి, తాడేపల్లి: ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్‌ను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పంపేందుకు సర్వం సిద్దమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరొందిన ఎల్‌వీఎం3–ఎం4 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం జరగనుంది.
ఈ సందర్భంగా చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. జాబిల్లిపై ఇప్పటిదాకా ఎవరూ అడుగు పెట్టని దక్షిణ దిశను ముద్దాడాలన్న చిరకాల లక్ష్యాన్ని సాధించేందుకు ఇస్రో మరోసారి సన్నద్ధమవుతోంది.
చదవండి: ఆవలి దిక్కున... జాబిలి చిక్కేనా!
చంద్రయాన్–3 మిషన్‌ను నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి మోసుకెళ్లేందుకు ఇస్రో గెలుపు గుర్రం, బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం–3 సిద్ధమవుతోంది. ఈ మిషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేసి నాలుగేళ్ల నాటి చంద్రయాన్–2 వైఫల్యం తాలూకు చేదు జ్ఞాపకాలను చెరిపేయాలని ఇస్రో పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నింటి కళ్లూ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రయోగంపైనే నిలిచాయి.
చదవండి: కూకట్‌పల్లి: మామకు మనమూ చుట్టాలమే
My best wishes to the entire team at @isro on the scheduled launch of Chandrayaan-3 from Sriharikota in our very own #AndhraPradesh today.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2023
Comments
Please login to add a commentAdd a comment