
వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు 2015 చిరస్మరణీయ సంవత్సరం కావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
2015లో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని వైఎస్ జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా శ్రేయస్సుకు కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని తెలుగు ప్రజలకు మేలు చేయాలని వైఎస్ జగన్ కోరారు.