
న్యూఢిల్లీ: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమసమాజ స్థాపనకు, దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధించేందుకు పౌరులంతా ప్రతిజ్ఞచేయాలని ఆమె పిలుపునిచ్చారు. కొత్త ఆశలు, ఆకాంక్షల సాధన కోసం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందడుగువేయాలని ఆమె అభిలషించారు.
ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఆదివారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ కొత్త ఏడాదిలో దేశ పౌరులందరికీ సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వాలు దక్కాలి. దేశ పురోగతికి మనందరం పాటుపడదాం. అభివృద్ధి భారత్ కోసం కొత్త తీర్మానాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. నూతన సంవత్సరం సందర్భంగా దేశ, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ నా శుభాకాంక్షలు’’ అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment