నేవీ డే వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము
పూరీ: నౌకల తయారీలో 2047కల్లా ఆత్మ నిర్భరత సాధించడంపై నావికాదళం దృష్టి పెట్టాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. నేవీ డే సందర్భంగా బుధవారం ఒడిశాలోని పూరీ సాగర తీరంలో జరిగిన వేడుకల్లో త్రివిధదళాధిపతి హోదాలో ఆమె పాల్గొన్నారు. మహిళా సాధికారతకు నేవీ తన వంతు కృషి చేస్తోందని ప్రశంసించారు. ‘‘ఐదు వేల ఏళ్ల పై చిలుకు ఘన చరిత్ర భారత నావికా రంగం సొంతం. దేశంలో తొలి మహిళా అగ్నివీర్‌లు నేవీలోనే చేరారు’’ అన్నారు.
15 యుద్ధనౌకలు, 37 వాయుసేన విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఐఎన్‌ఎస్ జల్సా, మిసైల్, డి్రస్టాయర్ ఐఎన్‌ఎస్ ఢిల్లీ, ఐఎన్‌ఎస్ శక్తి, ఐఎన్‌ఎస్ సూర్య, ఐఎన్‌ఎస్ అరిహంత్, ఐఎన్‌ఎస్ సతొపురా వంటి ప్రముఖ యుద్ధనౌకలతో పాటు జలాంతర్గాములూ ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. హాక్, సీ–కింగ్, మిగ్29కే వంటి యుద్ధవిమానాలు, చేతక్, ఎంఎస్ 60 హెలికాప్టర్లు, హాక్ విమానాల విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment