హెల్త్ యూనివర్సిటీ రైఫిల్ షూటింగ్ జట్టు
విజయవాడ స్పోర్ట్స్ : గురునానక్ దేవ్ (అమృత్‌సర్) యూనివర్సిటీలో ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ రైఫిల్ షూటింగ్ టోర్నీలో పాల్గొనే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జట్టును వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఇ.త్రిమూర్తి శుక్రవారం విడదల చేశారు. పురుషుల జట్టుకు పి.భార్గవ్‌హర్ష (డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ), డి.విశాల్ అంకిత్ (ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాల), ఎన్.తేజవర్థన్ నాయుడు (నిమ్రా మెడికల్ కళాశాల), మహిళా జట్టుకు సీహెచ్.సత్యహర్షిణి (సెయింట్‌జోసెఫ్ డెంటల్ కళాశాల, ఏలూరు) ఎంపికయ్యారు. టోర్నీకి పయనమైన జట్టు సభ్యులకు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.