realeased
-
జైలు నుంచి బండి సంజయ్ విడుదల
సాక్షి, కరీంనగర్: పేపర్ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో హన్మకొండ కోర్టు సంజయ్కు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి శుక్రవారం ఉదయం విడుదలయ్యారు. కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా, సంజయ్ విడుదల నేపథ్యంలో పోలీసులు.. జైలు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లో ఎవరు గుమిగూడరాదని ఆదేశాలు జారీ చేశారు. జైలు బయట వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. మరోవైపు, సంజయ్ విడుదల నేపథ్యంలో కరీంనగర్ జైలు వద్దకు బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. -
హెల్త్ యూనివర్సిటీ రైఫిల్ షూటింగ్ జట్టు
విజయవాడ స్పోర్ట్స్ : గురునానక్ దేవ్ (అమృత్సర్) యూనివర్సిటీలో ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ రైఫిల్ షూటింగ్ టోర్నీలో పాల్గొనే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జట్టును వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఇ.త్రిమూర్తి శుక్రవారం విడదల చేశారు. పురుషుల జట్టుకు పి.భార్గవ్హర్ష (డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ), డి.విశాల్ అంకిత్ (ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల), ఎన్.తేజవర్థన్ నాయుడు (నిమ్రా మెడికల్ కళాశాల), మహిళా జట్టుకు సీహెచ్.సత్యహర్షిణి (సెయింట్జోసెఫ్ డెంటల్ కళాశాల, ఏలూరు) ఎంపికయ్యారు. టోర్నీకి పయనమైన జట్టు సభ్యులకు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. -
అన్నమయ్య కీర్తనల్లో తెలుగుదనం గుబాళింపు
విజయవాడ కల్చరల్: పద కవితకు ఆద్యుడు అన్నమయ్య అని జిల్లా సెషన్ జడ్జి శ్రీకాంతాచారి అన్నారు. శివరామకృష్ణ క్షేత్రంలో శ్రీఅన్నమయ్య సంకీర్తన కచేరి, జ్యోతిష్య శాస్త్రవేత్త అచ్చిరెడ్డి రచించిన దైవదర్శనం గ్రం«థావిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాంతాచారి మాట్లాడుతూ తెలుగు సాహిత్య చరిత్రలో అన్నమయ్యకు విశిష్టమైన స్థానం ఉందని, ఆయన సంకీర్తనలలో తెలుగు పదాల గుబాళింపు ఉంటుందని వివరించారు. యువ జ్యోతిష్య శాస్తవేత్త కె.లక్ష్మీప్రియ మాట్లాడుతూ జ్యోతిష్యంకూడా ఒక శాస్త్రమేనని ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన అన్నమయ్య సంకీర్తనల ప్రచారకుడు గాయకుడు దిలీప్కుమార్ బృందం రసరమ్యంగా అన్నమయ్య సంకీర్తనలను గానం చేసింది. చివరగా ఘంటసాల భక్తి సంగీత విభావరి వీనుల విందుగా సాగింది.