
సాక్షి, కరీంనగర్: పేపర్ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో హన్మకొండ కోర్టు సంజయ్‌కు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి శుక్రవారం ఉదయం విడుదలయ్యారు.
కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా, సంజయ్ విడుదల నేపథ్యంలో పోలీసులు.. జైలు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లో ఎవరు గుమిగూడరాదని ఆదేశాలు జారీ చేశారు. జైలు బయట వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. మరోవైపు, సంజయ్ విడుదల నేపథ్యంలో కరీంనగర్ జైలు వద్దకు బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు.