karimnagar Jail
-
హిందీ పేపర్‌ను ఎవడైనా లీక్ చేస్తారా?: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: పేపర్ లీకేజీ వ్యవహారంలో కోర్టు ఆదేశాలతో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో హన్మకొండ కోర్టు సంజయ్‌కు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం, కేసీఆర్ సర్కార్, కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విడుదల అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి. కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలి. పేపర్ లీకేజీలో నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల భృతి ఇవ్వాలి. జిమ్మిక్కులతో ఇష్యూను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. హిందీ పేపర్ ఎవడైనా లీక్ చేస్తారా. మరి తెలుగు పేపర్‌ను ఎవరు లీక్ చేశారు?. పేపర్‌ను ఎవరో లీక్ చేస్తే నాకేంటి సంబంధం అని ప్రశ్నించారు. సరే లీకేజ్ అని అంటున్నారు కదా.. అసలు పరీక్ష సెంటర్లోకి ఫోన్లు ఎట్లా తీసుకువెళ్లారు. పోలీసులు, ఇన్విజిలేటర్లు ఏం చేస్తున్నారు. ఫోన్లు లోపలికి ఎలా తీసుకుపోయారు? ఎవరు తీసుకుపోయారో దర్యాప్తు చేయండి. అవి ఏవీ చేయకుండా నన్ను కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు. సీపీ ప్రమాణం చేసి తాను చెప్పిందంతా నిజమని చెప్పాలి. కరీంనగర్ పోలీసులు పోస్టుల కోసం, డబ్బుల కోసం పనిచేస్తున్నారు. సీపీ అసత్యాలు మాట్లాడుతున్నారు. వాట్సాప్‌లో ఎవరో పేపర్ షేర్ చేస్తే నాకేంటి సంబంధం అని ప్రశ్నించారు. లీక్‌కు, మాల్ ప్రాక్టీస్‌కు కూడా సీపీకి తేడా తెలియదా?. కేసీఆర్ అడ్డగోలుగా డబ్బు సంపాదించారు. రాజ్‌దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యలపైనా విచారణ జరపాలి. కేసీఆర్ బిడ్డ కవిత జైలుకు పోతుంది. కొడుకు కేటీఆర్ కూడా పోతాడు. తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల చేతిలో ఉంది. కేసీఆర్ కుటుంబం నియంత పాలనపై తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. నయా నిజాం కేసీఆర్‌ను తరిమికొడతాం. మంత్రి హరీష్‌రావు పచ్చి అబద్దాలు చెబుతున్నారు. కేటీఆర్‌ను సీఎం చేస్తే హరీష్‌రావే ముందుగా పార్టీ నుంచి జంప్ అవుతారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చదవండి: జైలు నుంచి బండి సంజయ్ విడుదల.. 144 సెక్షన్ విధింపు! -
జైలు నుంచి బండి సంజయ్ విడుదల
సాక్షి, కరీంనగర్: పేపర్ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో హన్మకొండ కోర్టు సంజయ్‌కు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి శుక్రవారం ఉదయం విడుదలయ్యారు. కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా, సంజయ్ విడుదల నేపథ్యంలో పోలీసులు.. జైలు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లో ఎవరు గుమిగూడరాదని ఆదేశాలు జారీ చేశారు. జైలు బయట వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. మరోవైపు, సంజయ్ విడుదల నేపథ్యంలో కరీంనగర్ జైలు వద్దకు బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. -
నీ కోసమే జైలుకు వెళ్లిన కేసీఆర్: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: హైకోర్టు ఆదేశాలతో కరీంనగర్ జైలు నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్‌పై విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణలో ధర్మ యుద్దం ప్రారంభమైందని, సీఎం కేసీఆర్‌ను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు జైలుకు వెళ్లడం కొత్త కాదని, అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్లేందుకు కూడా బాధ లేదన్నారు. ఇప్పటి వరకు తాను తొమ్మిదిసార్లు జైలుకు వెళ్లినట్లు, తెలిపారు. జైలుకు పంపినా సరే కానీ ఉద్యోగులు నరకయాతన పడుతున్నారని, 317 జీవోను సవరించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌ను కూడా జైలుకు పంపుతామని హెచ్చరించారు. తాను ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోసం జైలుకు వెళ్లానని, కేసీఆర్ మాత్రం వేరే ఇష్యూ మీద జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. కేసీఆర్ జైలుకు పోతే ఆయన్ను ఎవరూ కాపాడలేరని తెలిపారు. జీవోను వెంటనే సవరించకుండా కేసీఆర్ సంగతి చూస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తల చేతులు, కాళ్లు విరగొట్టారని, మహిళా కార్యకర్తలపై అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఇప్పుడు కూడా స్పందించకుంటే జీవితాంతం ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుందని సూచించారు. సంబంధిత వార్త: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట ‘ప్రజల సొమ్మును, తెలంగాణ సమాజాన్ని దోచుకున్నావు. హైకోర్టు మొట్టికాయలు వేసిన సిగ్గు లేదు. నా పార్టీ ఆఫీస్‌ను బద్దలు కొడతావా.. ఎవరూ ఇచ్చిండు నీకు అధికారం. సిగ్గుండాలి.. నీ కంటే సిగ్గుమాలిన వ్యక్తులు ఎవరూ ఉండరు. మేము ఏమైనా దుండగులమా, హంతకులమా దోపిడి దారులమా.. ధర్మం కోసం, తెలంగాణ సమాజం కోసం పనిచేసే వ్యక్తులం. భయపడతాం అనుకున్నావా. బలిదానలకు సిద్ధమైన పార్టీ మాది. అయినా తెగించి కొట్లాడుతున్నాం. నీ తాటాకు చప్పుళ్లకు భయపడతామా.. కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేస్తావా.. నీ గోతి నువ్వే తవ్వుకుంటున్నావ్.. నీ కోసమే జైలుకు పోయినా.. జైళ్లన్నీ ఎట్లున్నాయో చూసిన.. ఇగ తరువాత నిన్నే జైలుకు లాక్కెళ్తారు. అవినీతి కుబేరుడివి అయ్యావ్. వేల కోట్ల రూపాయలు దోచుకున్నావ్. నిన్ను వదిలి పెట్టే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో జీవో 317 సవరించాలి’ అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. చదవండి: బండి పోతే బండి వస్తుంది కానీ గుండు పోతే గుండు వస్తుందా సంజయ్: కేటీఆర్ -
జైలులో రిమాండ్ ఖైదీ మృతి
కరీంనగర్ క్రైం: కరీంనగర్ జైలులో ఓ రిమాండ్ ఖైదీ ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. శంకరపట్నం మండలం ఇప్పలపల్లికి చెందిన సంబు కొమురయ్య (45)ను దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 10న కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. అప్పటి నుంచి కొమురయ్య ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ఆదివారం మరింత క్షీణించడంతో జైలు అధికారులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు.. అతను చనిపోయాడని ధ్రువీకరించారు. జైలు అధికారుల ఫిర్యాదు మేరకు టౌన్ ఏసీపీ పి.అశోక్ విచారణ చేపట్టారు. ఆస్పత్రిని డీసీపీ చంద్రమోహన్ (పరిపాలన), టూటౌన్ సీఐ లక్ష్మీబాబు, హుజూరాబాద్ రూరల్ సీఐ కిరణ్ తదితరులు సందర్శించారు. కాగా, న్యాయమూర్తి సాయి సుధ ఆస్పత్రి, జైలు లో వాంగ్మూలం తీసుకున్నారు. ప్రాణం ఖరీదు రూ.3 లక్షలు? ఇప్పలపల్లె గ్రామానికి చెందిన కొమురయ్య ప్రాణానికి పోలీసు అధికారులు రూ.3 లక్షలు ఖరీదు కట్టారు. కరీంనగర్ జిల్లా జైలులో ఆదివారం రాత్రి మృతి చెందగా, ఆస్పత్రికి చేరుకున్న బంధువులు, గ్రామస్తులు కొమురయ్య మృతదేహంపై గాయలు ఉన్నాయని ఆరోపించారు. దీంతో ఆందోళనకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, కుటుంబీకుల మధ్య చర్చలు జరిగాయి. చివరకు రూ.3 లక్షల పరిహారం ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. కాగా, చర్చల సమయంలో పరిహారం అడిగినందుకు ఎల్ఎండీ ఎస్సై తమను బెదిరించాడని మృతుడి బంధువులు ఆరోపించారు. -
జైలు నుంచి ఇద్దరు దొంగల పరారీ
కరీంనగర్: కరీంనగర్ జైలు నుంచి ఇద్దరు దొంగలు పరారీ అయ్యారు. వీరి కోసం కరీంనగర్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జైలు నుంచి పరారైన వారు మహారాష్ట్ర పార్సీ గ్యాంగ్‌కు చెందిన జితేందర్, యోగేశ్లుగా గుర్తించారు. -
టీడీపీ నేతపై గన్ ఎక్కుపెట్టిన సెంట్రీ
-
టీడీపీ నేతపై గన్ ఎక్కుపెట్టిన సెంట్రీ
- కరీంనగర్ జిల్లా జైలు వద్ద ఘటన - జిల్లా అధ్యక్షుడిని కలిసేందుకు వెళ్తుండగా వాగ్వాదం కరీంనగర్ క్రైం: కరీంనగర్ జిల్లా జైలు గేటులోకి వెళ్తున్న చొప్పదండి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిపై డ్యూటీలో ఉన్న సెంట్రీ తుపాకీ ఎక్కు పెట్టాడు. ముందస్తు అనుమతి తీసుకున్నా.. తనను లోనికి వెళ్లకుండా అడ్డుకోవడంతోపాటు గన్ ఎక్కుపెట్టి ‘కాల్చి పారేస్తా’నని సెంట్రీ అన్నా డని టీడీపీ నేత మేడిపల్లి సత్యం ఆరోపించారు. కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతకుంట విజయరమ ణారావును మంగళవారం కోర్టు రిమాండ్ చేసిన విషయం తెలిసిందే. జిల్లా జైలులో ఉన్న ఆయనను కలిసేందుకు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి బుధవారం వచ్చారు. జైలులో ఉన్న విజయరమణారావును కలిసేందుకు రేవంత్‌తోపాటు పలువురు నాయకులు ముందుగానే అనుమతి తీసుకుని లోనికి వెళ్లారు. పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం కూడా లోనికి వెళ్తుండగా సెంట్రీ అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సెంట్రీ తనవద్దనున్న తుపాకీ ఎత్తి కాల్చి వేస్తానని బెదిరించాడు. కార్యకర్తలు, పోలీసులు ఇద్దరిని దూరంగా తీసుకుపోవడంతో వివాదం సద్దుమణిగింది. దీనిని నిరసిస్తూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. దీనిపై ఇన్చార్జి జైలు సూపరింటెండెంట్ సమ్మయ్య మాట్లాడుతూ... జైలు గేట్ వద్ద లోనికి తోసుకుని వెళ్తుండగా వారిని నియంత్రించే క్రమంలో జరిగిన సంఘటన మాత్రమేనని, దీనిపై ఎలాంటి విచారణ చేయడం లేదని అన్నారు. జరిగిన సంఘటన గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కేసీఆర్ పతనం ప్రారంభమవుతుంది: రేవంత్ తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్కు అండగా నిలిచిన కరీంనగర్ గడ్డ నుంచే సీఎం కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షు డు చింతకుంట విజయరమణారావును బుధవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రజలను, రైతులను చులకనగా చూస్తున్నారన్నారు. సమస్యలు పరి ష్కరించాలని ఉద్యమించిన వారిపై పోలీసులను ఉసిగొల్పి అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. ఎండుతున్న పంటలకు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయూలని ఆందోళన చేసిన టీడీపీ నాయకులు, రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదన్నారు. ఎస్సారెస్పీ నీటి విడుదలపై మాట తప్పిన మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావులను అరెస్టు చేసి జైల్లో పెట్టాలన్నారు. విజయరమణారావు జైలు నుంచి రావడంతోనే ఎల్లంపల్లి నీటి విడుదలపై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. పలువురు దళితులపై విద్యుత్ దొంగలుగా ముద్రవేసి జైలుకు పంపించారని రేవంత్‌రెడ్డి చెప్పారు. కరీంనగర్ జైలులో ఉన్న దళితులకు బెరుుల్ తీసుకునే స్తోమత కూడా లేదని, టీడీపీ తరఫున న్యాయవాదులను నియమించి వారికి బెరుుల్ వచ్చేలా చూస్తామని అన్నారు. ఆయన వెంట టీడీపీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు, పార్టీ జిల్లా ఇన్చార్జి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఉన్నారు. -
'రాష్ట్రంలో పోలీస్ రాజ్యం సాగుతోంది'
కరీంనగర్: తెలంగాణలో పోలీస్ రాజ్యం కొనసాగుతోందనీ తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జైళ్లలో తొండలు గుడ్లు పెడుతాయని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారంలోకి రాగానే ఉద్యమాలను అనచివేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. బుధవారం రేవంత్.. కరీంనగర్ జైలులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావుతో ములాకత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరసన తెలిపే వారిపై కేసీఆర్ అక్రమ కేసులు బనాయించి వారిని జైల్లో పెడుతున్నారని ధ్వజమెత్తారు. సాగు నీళ్లు అడిగిన పాపానికి టీడీపీ నేతలతో పాటు రైతులపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేసులు పెట్టాల్సి వస్తే మంత్రులు ఈటల రాజేందర్, హరీష్‌రావులపై నమోదు చేయాలన్నారు. కేసీఆర్ పతనానికి కరీంనగర్ నుంచే నాంది పలుకుతామని పిలుపునిచ్చారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్ల కోసం త్వరలో ఆందోళన చేపడుతామని రేవంత్ రెడ్డి చెప్పారు. -
జైల్ వద్ద టీడీపీ తమ్ముళ్ల అత్యుత్సాహం