సాక్షి, కరీంనగర్: పేపర్ లీకేజీ వ్యవహారంలో కోర్టు ఆదేశాలతో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో హన్మకొండ కోర్టు సంజయ్‌కు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం, కేసీఆర్ సర్కార్, కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
విడుదల అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి. కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలి. పేపర్ లీకేజీలో నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల భృతి ఇవ్వాలి. జిమ్మిక్కులతో ఇష్యూను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. హిందీ పేపర్ ఎవడైనా లీక్ చేస్తారా. మరి తెలుగు పేపర్‌ను ఎవరు లీక్ చేశారు?. పేపర్‌ను ఎవరో లీక్ చేస్తే నాకేంటి సంబంధం అని ప్రశ్నించారు. సరే లీకేజ్ అని అంటున్నారు కదా.. అసలు పరీక్ష సెంటర్‌లోకి ఫోన్లు ఎట్లా తీసుకువెళ్లారు.
పోలీసులు, ఇన్విజిలేటర్లు ఏం చేస్తున్నారు. ఫోన్లు లోపలికి ఎలా తీసుకుపోయారు? ఎవరు తీసుకుపోయారో దర్యాప్తు చేయండి. అవి ఏవీ చేయకుండా నన్ను కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు. సీపీ ప్రమాణం చేసి తాను చెప్పిందంతా నిజమని చెప్పాలి. కరీంనగర్ పోలీసులు పోస్టుల కోసం, డబ్బుల కోసం పనిచేస్తున్నారు. సీపీ అసత్యాలు మాట్లాడుతున్నారు. వాట్సాప్‌లో ఎవరో పేపర్ షేర్ చేస్తే నాకేంటి సంబంధం అని ప్రశ్నించారు. లీక్‌కు, మాల్ ప్రాక్టీస్‌కు కూడా సీపీకి తేడా తెలియదా?.
కేసీఆర్ అడ్డగోలుగా డబ్బు సంపాదించారు. రాజ్‌దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యలపైనా విచారణ జరపాలి. కేసీఆర్ బిడ్డ కవిత జైలుకు పోతుంది. కొడుకు కేటీఆర్ కూడా పోతాడు. తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల చేతిలో ఉంది. కేసీఆర్ కుటుంబం నియంత పాలనపై తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. నయా నిజాం కేసీఆర్‌ను తరిమికొడతాం. మంత్రి హరీష్‌రావు పచ్చి అబద్దాలు చెబుతున్నారు. కేటీఆర్‌ను సీఎం చేస్తే హరీష్‌రావే ముందుగా పార్టీ నుంచి జంప్ అవుతారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
చదవండి: జైలు నుంచి బండి సంజయ్ విడుదల.. 144 సెక్షన్ విధింపు!
Comments
Please login to add a commentAdd a comment