వరంగల్: తెలంగాణలో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన ఆరోపణలపై వరంగల్ సీపీ రంగనాథ్ స్పందించారు. ఈ కేసుకు సంబంధించి తాను సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపించారని, అది నిరూపిస్తే తన సీపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు సీపీ రంగనాథ్. కేసు విషయంలో నిజాయితీ ఉంటే మూడు సింహాలపై సీపీ ప్రమాణం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సీపీపై పలు ఆరోపణలు చేశారు బండి సంజయ్.
ఈ వ్యవహారంపై ఈరోజు(మంగళవారం) మీడియా ముందుకొచ్చిన సీపీ.. తాను సెటిల్మెంట్లు చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. తనకు బీజేపీ వాళ్లపై తప్పుడు కేసులు పెట్టాలనే ఉద్దేశం లేదని, రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నాని తెలిపారు. తాను ఎవరి పక్షాన ఉంటానో ప్రజలకు తెలుసని, కొన్ని కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవడం వల్లే వారికి బాధ కలిగి ఉండొచ్చని ఈ సందర్భంగా సీపీ రంగనాథ్ పేర్కొన్నారు.
సత్యంబాబు కేసులో తాను విచారణ అధికారిని కాదని, స్పెషల్ ఆఫీసర్‌గా నందిగామకు పంపించారన్నారు. ప్రతి కేసులో ప్రమాణాలు చేస్తే తాను ఇప్పటివరకూ 10 వేలసార్లు ప్రమాణాలు చేయాలని, ప్రమాణం అనే మాట వినడానికే ఆశ్చర్యం వేస్తోందన్నారు సీపీ.
Comments
Please login to add a commentAdd a comment