సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పేపర్ లీక్ కేసు బండి సంజయ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన రిమాండ్‌ను సవాల్ చేస్తూ సంజయ్ పిటిషన్ వేశారు.
ఇందులో భాగంగా హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా సంజయ్ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును అడ్వకేట్ జనరల్(ఏజీ) కోరారు. ఇక, విచారణకు బండి సంజయ్ సహకరించట్లేదని ఏజీ.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సంజయ్ తన ఫోన్‌ను అప్పగించలేదని ఏజీ తెలిపారు. దీంతో, ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. అనంతరం, తదుపరి విచారణను ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: పేపర్ లీక్ కేసు.. బండి సంజయ్ సంచలన నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment