సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: తెలంగాణలో టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సంజయ్ శుక్రవారం కరీంనగర్ జైలు నుంచి విడులయ్యారు. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. త్వరలోనే కేటీఆర్, కవిత జైలుకు వెళ్తారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం బండి సంజయ్‌కు బీజేపీ జాతీయ నేతలు ఫోన్స్ చేశారు. ఈ సందర్బంగా సంజయ్‌తో వారు మాట్లాడారు. ఇక, కేంద్రహోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్.. సంజయ్‌కు ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం, బీజేపీ నాయకత్వం మీకు అండగా ఉందని వారు బండి సంజయ్‌కు భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాడాలంటూ ఫోన్‌లో సంజయ్‌కు ధైర్యం చెప్పినట్టు తెలుస్తోంది.
మరోవైపు.. బీజేపీ ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్, బీజేపీ ముఖ్య నేతలు కరీంనగర్ బయలుదేరినట్టు సమాచారం. వీరు, బండి సంజయ్‌ను హైదరాబాద్‌కు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు సంజయ్‌కు స్వాగతం పలుకనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment