
సాక్షి, హైదరాబాద్: ట్యాబ్లెట్ వేసుకునే అవకాశం కూడా లేకుండా బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారని, టెర్రరిస్ట్ కంటే దారుణంగా ఆయనను ట్రీట్ చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బండి సంజయ్ అరెస్ట్ దుర్మార్గమన్నారు. అర్ధరాత్రి అరెస్ట్ చేసి మానసికంగా వేధించారని, కేసీఆర్ కళ్లలో ఆనందం కోసం పోలీసులు పనిచేస్తున్నారని మండిపడ్డారు.
‘‘తమ చేతుల్లో అధికారం ఉందని తప్పుడు కేసులు పెడుతున్నారు. కుట్రలు, కుతంత్రాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. మీడియా సంస్థలను కూడా కేసీఆర్ వదిలిపెట్టలేదు. ప్రగతి భవన్ డైరెక్షన్‌లోనే బండి సంజయ్‌ను ఇరికించారు. ఆయనపై కేసులు అప్రజాస్వామిక చర్య’’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
చదవండి: బండి సంజయ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
Comments
Please login to add a commentAdd a comment