సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు.. బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. అక్రమ అరెస్ట్ అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తరుణ్‌చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బండి సంజయ్ అరెస్ట్‌పై తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. సంజయ్ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. కారణం లేకుండా సంజయ్‌ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. ప్రశ్నిస్తే జైల్లో వేస్తామంటే బీజేపీ నేతలు భయపడరు. బండి సంజయ్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. సంజయ్ కోసం బీజేపీ కార్యకర్తలంతా పోరాడుతారు. కేసీఆర్ ఏ వ్యవస్థను గౌరవించడం లేదు. కేసీఆర్ సర్కార్ అహంకారపూరితంగా వ్యవహరిస్తోంది. కేసీఆర్ కుటుంబ అవినీతిపాలనపై బీజేపీ పోరాడుతుంది. అరెస్టుకు కారణాన్ని వెల్లడించడంలో పోలీసులు విఫలమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు భయపడే కేసీఆర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు.
మరోవైపు.. బండి సంజయ్ అరెస్ట్ బీజేపీ అధిష్టానం ఫోకస్ పెంచింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. కిషన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. సంజయ్ అరెస్ట్‌పై అమిత్‌షాకు కిషన్‌రెడ్డి వివరాలు తెలిపారు.
ఇది కూడా చదవండి: బండి సంజయ్ తరలింపులో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment