Amit Shah Telangana Visit Kishan Reddy And Bandi Sanjay Focus Issues - Sakshi
Sakshi News home page

కిషన్‌ రెడ్డికి ఆ సూచనలిచ్చిన బీజేపీ హైకమాండ్‌.. హైదరాబాద్‌కు ఆయన రాకతో, హు‘షా’రు!

Published Tue, Jul 25 2023 4:27 PM | Last Updated on Wed, Jul 26 2023 4:40 PM

Amit Shah Telangana Visit Kishan Reddy Bandi Sanjay Focus Issues - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొన్నాళ్లుగా పార్టీ అంతర్గత కలహాలతో సతమైన తెలంగాణ కమలం పార్టీలో మళ్లీ జోష్‌ నింపేందుకు అగ్ర నాయకులు సమయాత్తమయ్యారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని.. ఎన్నికలకు వెళ్లాలని కమలనాథులు భావిస్తున్నారు. 

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో, జిల్లా కమిటీల్లో ఎలాంటి మార్పులు చేయవద్దని పార్టీ రాష్ట్ర సారథి కిషన్ రెడ్డికి పార్టీ హైకమాండ్ సూచించింది. ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన కమిటీలు వేయాలని నేతలు భావిస్తున్నారు. ప్రచార కమిటీ, మ్యానిఫేస్టో కమిటీ, సోషల్ మీడియా కమిటీ, ప్రచార సభల కమిటీ ఇలా 22 కమిటీలను త్వరలోనే ప్రకటించనున్నారు.  పోటీ ఎక్కువగా లేని నియోజకవర్గాల్లో ఎన్నికల పనులు ప్రారంభించుకోవాలని ఇప్పటికే సంకేతాలిచ్చారు.  
(చదవండి: లోక్‌సభలో ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం?)

అమిత్‌ షా ఫోకస్‌ చేసే అంశాలివే..
ఈ నెల 29న ఖమ్మంలో అమిత్ షాతో భారీ బహిరంగసభకు ముందుగా ప్లాన్ చేసుకున్నారు. భారీ వర్షాల కారణంగా ఖమ్మం సభను వాయిదా వేశారు. అందుకు బదులుగా హైదరాబాద్ లో అమిత్ షా సామాజిక వర్గాల ప్రముఖులతో భేటీ కానున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఇటీవల బీజేపీ నేతలు తమ మధ్య ఉన్న లుకలుకలు బయటపెట్టుకోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. 

పార్టీని లైన్లో పెట్టడమే ప్రధాన లక్ష్యంగా అమిత్ షా హైదరాబాద్ రానున్నారని సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి అవసరమైన వనరులు ఏంటీ ? హైకమాండ్ నుంచి ఎలాంటి సహకారం అవసరం?  ఎంత వరకు పార్టీ అధిష్టానం సహాయం చేయగలదు? ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఎలా ఉండాలి ? ఇలాంటి అంశాలపై అమిత్ షా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై అమిత్ షాతో సోమవారం చర్చించిన బండి సంజయ్ కు హైకమాండ్ నుంచి మంచి భరోసానే లభించినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అమిత్ షా పర్యటనతో తెలంగాణ బీజేపీలో లుకలుకలు ఏ మేరకు సర్ధుకుంటాయో చూడాలి!
(చదవండి: కేటీఆర్‌ అందులో మ్యానిపులేటర్‌.. రేవంత్‌ చురకలు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement