Tarun Chugh
-
రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజయ్‌కు చుగ్ శుభాకాంక్షలు తెలిపారు. హోం శాఖకు మంచిపేరు తీసుకురావడంతోపాటు ప్రజలకు మరింత మేలు జరిగేలా పని చేయాలని తరుణ్ చుగ్ ఆకాంక్షించారు. అరగంట పాటు జరిగిన వారిద్దరి భేటీలో రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు నెలల్లోనే విశ్వసనీయతను కోల్పోయిందని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే విషయం కూడా పార్లమెంట్ ఫలితాలతో రుజువైందని చుగ్ పేర్కొన్నారు. బండికి శుభాకాంక్షల వెల్లువ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్‌కి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, బీవీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, ఎనీ్వఎస్‌ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు టి.ఆచారి, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, వీరేందర్ గౌడ్, జె.సంగప్పతోపాటు వివిధ మోర్చాలకు చెందిన నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. అలాగే.. కరీంనగర్ తోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచి్చన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బండి సంజయ్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తరుణ్ చుగ్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి బండి సంజయ్ -
అలవికాని హామీలు.. కాంగ్రెస్‌పై తరుణ్‌చుగ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌ను కలిశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం బండి సంజయ్ తొలిసారిగా తరుణ్ చుగ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన తరుణ్ చుగ్.. ఆయనతో అరగంటకుపైగా ముచ్చటించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ ఆ శాఖకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ప్రజలకు మరింత మేలు జరిగేలా పని చేస్తారనే ఆశాభావాన్ని తరుణ్ చుగ్ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన అంశాలపై అరగంటకుపైగా చర్చించారు. తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలను గెలిచిన బీజేపీ 35 శాతానికిపైగా ఓట్లు సాధించడంపట్ల సంతోషం వ్యక్తం చేసిన తరుణ్ చుగ్.. నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలవల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు నెలల్లోనే విశ్వసనీయతను కోల్పోయిందని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నిరాశను ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తోందన్నారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి అద్దం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే విషయం కూడా పార్లమెంట్ ఫలితాలతో రుజువైందన్నారు. -
ఎన్నికలకు రాష్ట్ర పార్టీని సన్నద్ధం చేసేలా..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్ర పార్టీని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడంలో భాగంగా బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణకు రాను న్నారు. ముఖ్యంగా పార్టీలో నాయకులు, కార్యక ర్తల మధ్య మెరుగైన సమన్వయ సాధన కోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ ఇన్చార్జిలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, ఇతర నేతలు సమీక్షించనున్నారు. గురువారం నుంచి వరుసగా రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలో ఎక్కడికక్కడ సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గాల ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలతో భేటీ అయ్యి ఇప్పటి వరకు చేపట్టిన, చేపడుతున్న కార్యకలాపాలను సమీక్షిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని లోక్‌సభ నియోజకవర్గాల్లో మండల పార్టీ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో, పట్టణ ప్రాంతాల్లోని స్థానా ల్లో డివిజన్, ఆపై స్థాయి నాయకులతో సమావేశమై ఆయా అంశాలపై సమీక్ష నిర్వహి స్తారు. గురువారం శివప్రకాశ్ నాగర్‌కర్నూల్, హైదరాబాద్ ఎంపీ స్థానాలో పర్యటించనుండగా, మిగతా నేతలకు కూడా రెండేసి లోక్‌సభ స్థానాలను కేటాయించినట్టు తెలిసింది. సునీల్ బన్సల్, ఇతర నేతలు కూడా ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రాన్ని సందర్శించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్‌లకు కూడా కొన్ని ఎంపీ సీట్లలో నాయకుల మధ్య సమన్వయం సాధించే బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. పార్టీ జాతీయ నాయకులతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ కూడా ఈ సమీక్ష సమావేశాల్లో పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారిని, ముఖ్యంగా మహిళలు, ఇతర వర్గాల వారిని కలుసుకుని మద్దతును కూడగట్టాలని నిర్ణయించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించడం, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీల భేటీల నిర్వహణ, ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేయడంపై దృష్టి పెట్టనున్నారు. -
ఈ నెల 6,7,8 తేదీల్లో బీజేపీ భేటీ
సాక్షి, హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కీలకభేటీకి బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 6, 7, 8 తేదీల్లో జాతీయ నేతలు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్‌లు రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కొత్త ఎన్నికల కమిటీ నియామకంపై దృష్టి పెట్టనున్నారు.90 రోజుల ఎన్నికల కార్యాచరణ ప్రణాళికపై చర్చించి ఖరారు చేయనున్నట్టు రాష్ట్రపార్టీవర్గాల సమాచారం. లోక్‌సభ ఎన్నికల ముందు వరకు పార్టీపరంగా ఏయే కార్యక్రమాలు చేపట్టాలి ? ఏయే అంశాలపై దృష్టి పెట్టాలి ? అనే అంశంపై ఐదారు కమిటీలను నియమించనున్నట్టు తెలుస్తోంది. పనిలోపనిగా జాతీయ నేతలు అభిప్రాయసేకరణ జరిపాక బీజేఎల్పీనేతను ఎన్నుకోవాల్సి ఉన్నందున, ఈ భేటీల సందర్భంగా ఈ ఎన్నిక జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని పార్టీనేతలు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి మహిళలు, బీసీలకు ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. ముందుగానే లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన : కిషన్‌రెడ్డి ఎంపీ టికెట్లకు సంబంధించి దరఖాస్తులేవీ స్వీకరించడం లేదని మంగళవారం మీడియా చిట్‌చాట్‌లో కిషన్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థుల ఖరారు అనేది జాతీయ నాయకత్వం పరిధిలోనే ఉంటుందన్నారు. గతంతో పోల్చితే ముందుగానే 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను నాయకత్వం ప్రకటిస్తుందని చెప్పారు. ఇప్పటికైతే నాలుగు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ గ్యారంటీపై చర్చ జరగలేదన్నారు. వరంగల్ నుంచి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ పోటీచేస్తారనే దానిపై ఎలాంటి చర్చ కానీ, నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. -
అవినీతిలో ఆస్కార్ ఇవ్వొచ్చు.. కేసీఆర్‌కు ఎదురుదెబ్బ ఖాయం..
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాను చూస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని స్పష్టమవుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ ఛుగ్ పేర్కొన్నారు. కనీసం 20 మంది ఎమ్మెల్యేలు దళిత బంధు పథకంలో 30శాతం లంచం తీసుకుంటున్నట్టు తనకు సమాచారం ఉందన్న కేసీఆర్.. ఆ అవినీతిని సమర్థిస్తూ మళ్లీ అభ్యర్థులుగా ఖరారు చేయడం దేనికి సంకేతమని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘‘పాచిపోయిన కూరను మళ్లీ వేడి చేసినట్టు.. చెడిపోయిన ఎమ్మెల్యేలనే మళ్లీ ప్రజలకు అందించే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్, ఆయన పార్టీ సిగ్గు తప్పిన విధానాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. సీఎం కేసీఆరే స్వయంగా పెద్ద అవినీతిపరుడు. అవినీతిలో ఆయన ఆవిష్కరిస్తున్న కొత్త విధానాలకు ఆస్కార్ స్థాయి అవార్డు ఇవ్వవచ్చు..’’అని తరుణ్ ఛుగ్ వ్యాఖ్యానించారు. మహిళలకు సీట్లు ఏవి? అసెంబ్లీ, పార్లమెంట్లో మహిళలకు 30శాతం రిజర్వేషన్లు కల్పిం చాలంటూ కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో ధర్నా చేశారని.. ఇప్పుడు బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థుల్లో ఏడుగురే మహిళలకు టికెట్ ఇవ్వడం దేనికి సంకేతమని తరుణ్ ఛుగ్ నిలదీశారు. సొంత పార్టీలో మహిళలకు జరిగిన అన్యాయాన్ని కవిత ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో సీపీఐ, సీపీఎంలతో దోస్తీ కట్టి, కలిసే ఉంటామని ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు వదిలేశారని పేర్కొన్నారు. కేసీఆర్ అవకాశవాద రాజకీయాలకు ఇది నిదర్శనమని.. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యమకారులను వాడుకుని వదిలేశారని ఆరోపించారు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని, వచ్చేదీ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారేనని పేర్కొన్నారు. -
ఎన్నికల సన్నద్ధతపై ‘కమలం’ కసరత్తు షురూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై కసరత్తును బీజేపీ వేగవంతం చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ఉమ్మడి జిల్లాల్లోని అనేక శాసనసభా నియోజకవర్గాల్లో పార్టీకి సానుకూల వాతావరణం, పరిస్థితులున్న విషయం తాము జరిపిన పలు సర్వేలు, అధ్యయనాల్లో వెల్లడైనందున మరింత దూకుడుగా ముందుకెళ్లాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు. ప్రధానంగా ప్రస్తుతం పార్టీ పరిస్థితి, సామాజికవర్గాల వారీగా మద్దతు, ప్రభావితం చేసే అంశాలు, సంబంధిత నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేయగలిగే సామాజికవర్గాలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు వచ్చి న ఓట్లు, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు పడిన ఓట్లు, వచ్చే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నుంచి పోటీచేసే సత్తా ఉన్న అభ్యర్థులు, వారి సామాజికవర్గాలు తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, బలాబలాలు, ఏవైనా లోటుపాట్లు, ఇతర అంశాలుంటే వాటిని ఎలా సరిచేసుకోవాలనే విషయాలను పరిగణనలోకి తీసుకోవడంలో భాగంగా వివిధ జిల్లాల సమీక్షలను ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్ (రాష్ట్ర ఎన్నికల సహఇన్‌చార్జి కూడా), జాతీయ కార్యదర్శి అర్వి0ద్ మీనన్ పార్టీపరంగా వివిధ జిల్లాల సమీక్షలను నిర్వహించనున్నారు. జిల్లాల నేతల నుంచి సమాచార సేకరణ బుధవారం రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లా కమిటీ లతో తరుణ్‌చుగ్ సమీక్షలు ప్రారంభించారు. ఆయా అంశాలపై నాయకుల నుంచి వివరాలు, సమాచారం సేకరించినట్లు తెలిసింది. కేసీఆర్ సర్కార్‌పై వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లా కమిటీలు, నాయకులను తరుణ్‌చుగ్ ఆదేశించినట్టు సమాచారం. గురువారం మేడ్చల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో చేపడుతున్న ఎన్నికల కార్యాచరణ, తయారీపై తరుణ్‌చుగ్ సమీక్షించనున్నారు. ఇదిలా ఉంటే గురువా రం వరంగల్ క్లస్టర్లో (ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు) సునీల్ బన్సల్, నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో మీనన్ వేర్వేరుగా సమీక్షలు చేపడుతున్నారు. శుక్ర, శనివారాల్లో వివిధ అంశాలపై రాష్ట్రపార్టీ ముఖ్యనేతలతో విడతల వారీగా తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్, అర్వింద్ మీనన్ చర్చిస్తారని పార్టీ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే ఆదిలాబాద్, జహీరాబాద్, మెదక్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ నాలుగు స్థానాల్లో కనీసం రెండింటిని గెలుపొందాలనే పట్టుదలతో ఉన్న ఆయన.. ఇప్పటికే వీటిపరిధిలో విస్తృతంగా పర్యటించారు. -
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్‌పై తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలకు షెడ్యూల్ వెలువడకముందే పొలిటికల్ హీట్ చోటుచేసుకుంది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే పలు కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తోంది. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్‌చుగ్.. కేసీఆర్ సర్కార్‌పై సంచలన కామెంట్స్ చేశారు. కాగా, తరుణ్ చుగ్ ఎల్బీనగర్లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం చేతితో కారు స్టీరింగ్ ఉంది. తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలన కొనసాగుతోంది. తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన ఘనత కేసీఆర్‌దే. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల స్కీమ్ ఎందుకు అమలు చేయడం లేదు. కుటుంబ పాలన, దుష్ట పాలన నుంచి తెలంగాణ ప్రజలను కాపాడేది కేవలం బీజేపీ ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌కు బీ టీమ్. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు రెండుసార్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోని నెట్టారు. దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు. మెట్రో నగరమైన హైదరాబాద్‌కు కేంద్రం నిధులు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టిస్తోంది. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్.. ప్రజలను మోసం చేస్తున్నాడు. దీనిలో కేంద్రం నిధులున్నాయని స్పష్టం చేశారు. ఇదే సమయంలో దేశంలో ప్రతీ గ్రామంలో స్వతంత్ర సమరయోధులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్ల విగ్రహాలను ప్రతిష్టిస్తామని తెలిపారు. ఇది కూడా చదవండి: పక్కా ప్లాన్‌తో అసెంబ్లీలో కేసీఆర్ స్పీచ్.. టార్గెట్ ఫిక్స్, ఇక సమరమే! -
పోటీ చేస్తాననడం రూమర్ మాత్రమే: జయసుధ
సాక్షి, ఢిల్లీ: సినీ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో అధికారికంగా చేరారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ ఆమెకు కండువా కప్పి కాషాయం పార్టీలోకి ఆహ్వానించారు. ప్రాథమిక సభ్యత్వం అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ‘‘ఎమ్మెల్యేగా నా పదవీకాలం పూర్తయ్యాక.. కొన్ని కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నా. ప్రధానమంత్రి మోదీ పరిపాలన నచ్చి బీజేపీలో చేరాను. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీలోకి వచ్చా. దాదాపు ఏడాదిగా బీజేపీలో చేరాలని ఆలోచిస్తున్నాను. జాతీయ పార్టీ ద్వారా ప్రజలకి సేవ చేస్తా. పార్టీ ద్వారా క్రైస్తవుల కోసం పని చేస్తా. కులమతాలకు అనుగుణంగా సేవలు అందిస్తా. సికింద్రాబాద్, ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తాననడం రూమర్ మాత్రమే’’ :::జయసుధ ‘‘సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ పనిచేశారు, 350కి పైగా సినిమాలలో నటించారు. జయసుధ చేరికతో బీజేపీ బలోపేతం అవుతుంది. BRS ఓటమి తోనే తెలంగాణ అమరుల ఆకాంక్ష నెరవేరుతుంది. పేదల సంక్షేమం, బస్తీల అభివృద్ధి విషయంలో జయసుధకు చిత్తశుద్ది ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే కుటుంబ పాలన, నియంతృత్వ పాలన పోవాలి అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన రావాలి.’’ :::కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ జయసుధకు సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఈ తొమ్మిదేళ్లలో మోదీ పాలన.. అభివృద్ధిని చూసి ఆమె బీజేపీలో చేరారు. జయసుధ చేరిక బీజేపీకి ఉత్సాహాన్ని ఇస్తుంది. :::తరుణ్‌చుగ్, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి -
ప్రజలతో మూడు ముక్కలాట ఆడుతున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలది ముక్కోణపు ప్రేమకథ అని... ఈ మూడు పార్టీలూ కలిసి తెలంగాణ ప్రజల జీవితాలతో మూడు ముక్కలాట ఆడుతున్నా యని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో ఆ మూడు పార్టీలు నాటకాలు ఆడు తూ అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేస్తు న్నాయని విమర్శించారు. తెలంగాణలో ఎన్ని కలకు ముందు లేదా తర్వాత కలిసి ప్రయాణం చేసే ఈ మూడు పార్టీల మధ్య ముక్కోణపు ప్రేమ కథ నడుస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు ఆయా పార్టీల అసలు స్వరూ పం తెలిసిపోయిందని, అందుకే బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందన్నారు. శనివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ (మల్కాజ్గిరి), నేతలు జైపాల్ రెడ్డి (జహీరాబాద్), లక్ష్మారెడ్డి (రంగారెడ్డి) కాషా య కండువా కప్పుకున్నారు. కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ ఛుగ్, ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో ఈ నలుగురు నాయకులకు పార్టీ సభ్యత్వ రశీదు అందించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా పనిచేసిన వారు బీజేపీలో చేరారని... మరిన్ని చేరికలు ఉండేలా కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళతామన్నారు. జిట్టా ఆరోపణలకు స్పందించను ఏ రోజు కూడా బీజేపీ, బీఆర్ఎస్తో కలిసి పనిచేయలేదని.. భవిష్యత్తులోనూ పనిచేయ బోదని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పనిచే స్తుందన్నారు. కాగా జిట్టా బాలకృష్ణారెడ్డి ఇచ్చే సర్టిఫికెట్ తనకు అవసరం లేదని.. అతను చేసే ఆరోపణలపై జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజే పీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్ళారని, అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం పోయిందన్నారు. త్వరలోనే కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి లభిస్తుందన్నారు. చైతన్యంలేని రాహుల్ నేతృత్వంలో ఎలా పనిచేస్తాం బీజేపీ కండువా కప్పుకున్న అనంతరం మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి మాట్లాడుతూ, ఇన్నేళ్లలో కనీసం 50 సార్లు రాహుల్ గాంధీని కలిసినా... కనీసం తనను గుర్తుపట్టలే రన్నారు. రాజకీయ చైతన్యం లేని రాహుల్‌గాంధీలాంటి నేత నేతృత్వంలో ఎవరైనా ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బీజేపీలో ఉన్నారని... డూప్లికేట్లు, అన్ని పార్టీలు తిరిగొచ్చిన నేతలు, మిక్స్డ్ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని రంగారెడ్డి వ్యాఖ్యానించారు. -
బీజేపీ ఇన్చార్జి తరుణ్‌ఛుగ్ స్థానంలో భూపేంద్రయాదవ్?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో బీజేపీని గద్దెనెక్కించాలనే దృఢసంకల్పంతో ఉన్న ఆ పార్టీ అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల వ్యూహానికి పదునుపెడుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను మార్చి ఆయన స్థానంలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించిన అధిష్టానం మరో కీలక మార్పు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలు స్తోంది. ఇందులో భాగంగా ట్రబుల్షూటర్గా పేరున్న కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను రంగంలోకి దించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్న తరుణ్ ఛుగ్‌ను తొలగించి ఆయన స్థానంలో భూపేంద్ర యాదవ్‌ను పంపిస్తారని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్చార్జిగా పనిచేసిన అనుభవం, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పట్టున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయనను క్రియాశీలం చేయను న్నట్లు తెలుస్తోంది. బీజేపీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తర్వాత భూపేంద్ర నాలుగో స్థానంలో ఉన్నారు. యూపీ, బిహార్, హరియాణాల్లో భూపేంద్ర యా దవ్ రచించిన వ్యూహాలు పార్టీ విజయానికి బాటలు వేశాయి. 2019 ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదవండి: Kishan Reddy: అందుకే కిషన్‌రెడ్డికి బీజేపీ బాధ్యతలు, ఈటలకు కీలక పదవి నడ్డాతో భేటీ.. రాష్ట్ర అధ్యక్ష మార్పు ప్రకటన వెలువడిన సమయంలో భూపేంద్రయాదవ్ ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్నారు. ప్రకటన వెలువ డటానికి కొద్దిగంటల ముందు జేపీ నడ్డాతో బండి సంజయ్ భేటీ అయిన సమయంలో కూడా భూపేంద్రయాదవ్ ఉన్నారు. ఈ సమయంలోనే రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. సుమారు గంటపాటు నడ్డా, యాదవ్ తెలంగాణ రాజకీ యాలపై గంటపాటు చర్చించుకున్నట్లుగా సమాచారం. -
ఢిల్లీలో కేసీఆర్, ఖర్గే చేతులు కలిపారు.. రేవంత్ పరిస్థితి ఏంటో!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ స్థాయిలో చేతులు కలిపారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ ఛుగ్ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు కొన్ని సందర్భాల్లో బీ టీంగా, కొన్నిసార్లు సీ టీంగా పనిచేసేందుకు పోటీ పడుతోందని ఛుగ్ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తన పరిస్థితి ఏంటో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరిన విషయం రేవంత్ రెడ్డి ఎలా మరిచిపోయారని, ఇది బీఆర్ఎస్ – కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు. అయితే ఇందుకు భిన్నంగా బీజేపీ– బీఆర్ఎస్ల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని రేవంత్ మాట్లాడడం కేవలం అభూత కల్పన అని అన్నారు. గురువారం ఢిల్లీ సౌత్ ఎవెన్యూలోని తన నివాసంలో తరుణ్ ఛుగ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని మార్చేది లేదని పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టత ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు దు్రష్పచారం చేస్తున్నారని ఛుగ్ మండిపడ్డారు. 25న నాగర్ కర్నూల్‌కు నడ్డా ఈనెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వస్తున్నారని తరుణ్ ఛుగ్ తెలిపారు. నాగర్ కర్నూల్ సభలో నడ్డా పాల్గొంటారన్నారు. గుజరాత్లో బిపర్ జోయ్ తుపాను వల్ల అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయ్యిందని, త్వరలో ఖమ్మంలోనే షా సభ ఉంటుందన్నారు. చదవండి: మోదీ మంచి మిత్రుడు -
బీజేపీ అధ్యక్షుడు మార్పు.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ఇన్చార్జి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి తరుణ్‌చుగ్ స్పష్టం చేశారు. నాయకులందరూ ఒకే తాటిపై ఉన్నారనీ తామంతా కలిసికట్టుగానే ఉన్నామని తెలిపారు. బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు ఉంటుందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నియమించామని, ఇక అధ్యక్షుడి మార్పు ఎక్కడిదని ఎదురు ప్రశ్నించారు. తుపాను ప్రభావం అనేక రాష్ట్రాలపై పడే అవకాశాలుండడంతో గురువారం కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడిందని చెప్పారు. ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభను కూడా వాయిదా వేశామన్నారు. మళ్లీ అమిత్ షా రాష్ట్ర పర్యటన ఖరారు చేసి, ఖమ్మం సభకు సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే ప్రకటిస్తామని తరుణ్‌చుగ్ తెలిపారు. త్వరలో ఖమ్మంలోనే అమిత్ షా సభ: బండి సంజయ్ త్వరలోనే ఖమ్మంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ నిర్వహించడం ఖాయమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. బుధవారం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ అనివార్య కారణాల వల్ల ఈ సభ రద్దుతో కార్యకర్తలెవరూ నిరాశ పడొద్దని చెప్పారు. గుజరాత్, మహారాష్ట్రలలో తుపాను పరిస్థితుల కారణంగా అమిత్ షా 24 గంటలూ పర్యవేక్షించాల్సి ఉన్నందున ఈ సభకు రాలేకపోయారని తెలిపారు. -
కాంగ్రెస్‌కు షాక్.. రేవంత్‌పై ఆరోపణలతో బీజేపీలో చేరిక
సాక్షి, న్యూఢిల్లీ: కేసీఆర్ కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో కేసీఆర్ చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గుర్తుమీద గెలిచినవాళ్లు కేసీఆర్ పంచన చేరి అసెంబ్లీలో కూర్చుంటున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్త పైడి రాకేష్‌రెడ్డికి తన నివాసంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సమక్షంలో తరుణ్‌ఛుగ్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ, తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందని, కేసీఆర్ అవినీతిపాలనను మోదీ నేతృత్వంలో అంతమొందిస్తామన్నారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో బీజేపీ ప్రజల సంపూర్ణ మద్దతుతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కవిత కేసీఆర్ మాట వినకుండా.. ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ, కవిత కేసీఆర్ మాట వినకుండా నిజామాబాద్ నుంచే పోటీ చేయాలని.. మెదక్‌కు పారిపోవద్దని కోరారు. కేసీఆర్ ఆమెను మెదక్ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఒక బీమారి అయితే దానికి వాక్సిన్ బీజేపీ అని వ్యాఖ్యానించారు. కర్నాటకలో ఫలితాలు, తెలంగాణలో ఏ మాత్రం ప్రభావం చూపించవని.. పక్క ఇంట్లో బిర్యానీ వండితే మన కడుపు నిండుతుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అర్వింద్ చెప్పారు రౌడీల రాజ్యంలా రాష్ట్రం: రాకేష్‌రెడ్డి అమరవీరుల త్యాగాల తెలంగాణ ఇది కాదని, రౌడీల రాజ్యంలా రాష్ట్రం ఉందని బీజేపీలో చేరిన పారిశ్రామికవేత్త పైడి రాకే‹Ùరెడ్డి మండిపడ్డారు. మోదీ నాయకత్వం నచ్చే బీజేపీలో చేరానని, కార్యకర్తగా ఉంటూనే పార్టీ ఎలాంటి బాధ్యత ఇచ్చినా మోసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అన్యాయాలు, అక్రమాలు ఎదుర్కొంటామని, టిప్పర్లను అడ్డుకోవడమే తన కర్తవ్యమని తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం ఇది: సీఎం కేసీఆర్ -
తెలంగాణలో అసెంబ్లీ రన్.. ‘160’ డేస్! బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. వచ్చే 160 రోజుల కార్యక్రమాలకు బీజేపీ జాతీయ నాయకత్వం రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. పోలింగ్ బూత్ స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం, ఎన్నికల సందర్భంగా ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేలా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవడంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటినుంచి సెప్టెంబర్ చివరిదాకా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలతోపాటు కేంద్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రచారం చేస్తూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ నేతలకు సూచించింది. మే రెండో వారంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 500 మంది ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని సూచించింది. ఇక ఎన్నికల మోడ్‌లోకి వచ్చేసినట్టేనని, ముందూ వెనకా చూడకుండా అంతా సమష్టిగా మెరుగైన సమన్వయంతో పార్టీ విజయానికి కృషి చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ, ముఖ్యనేతల సమావేశంలో.. బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శులు, రాష్ట్ర ఇన్చార్జులు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్, పార్టీ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, రాష్ట్రపార్టీ సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్ దిశానిర్దేశం చేశారు. అమిత్‌షా సభను సక్సెస్ చేయాలి ఈ నెల 23న చేవెళ్లలో కేంద్రమంత్రి అమిత్‌షా బహిరంగ సభను విజయవంతం చేయాలని.. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునే విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉండే విధంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా, మండల పార్టీ కమిటీల్లో ఖాళీగా ఉన్నస్థానాలను వెంటనే భర్తీ చేయాలని.. పార్టీ పదవుల్లో ఉండి కార్యక్రమాలు, ఆందోళనల్లో పాల్గొనని వారిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్, పార్టీనేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, పి.మురళీధర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి, విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు. పార్టీ నేతలు గురు, శుక్రవారాల్లోనూ సమావేశాలు నిర్వహించి, వివిధ అంశాలను సమీక్షించనున్నారు. కార్యక్రమాల తీరు ఇలా.. ♦ మోదీ నేతృత్వంలో ఎన్డీయే సర్కారు తొమ్మిదేళ్ల పాలన పూర్తిచేసుకుంటున్న సందర్భంగా మే 15 నుంచి జూన్ 15 వరకు ‘జన సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాలను నిర్వహిస్తారు. కేంద్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను, వివిధ రంగాల్లో సాధించిన విజయాలను ప్రచారం చేస్తారు. ♦ జూన్, జూలై మాసాల్లో ‘సాలు దొర.. సెలవు దొర’ పేరుతో తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి, అక్రమాలు, స్కామ్‌లు, వివిధ రంగాల సమస్యలు, ప్రజల ఇబ్బందులపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. ♦ ఆగస్టు, సెప్టెంబర్లలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు, కూలీలు తదితర వర్గాలను స్వయంగా కలుసుకుని.. బీజేపీ అధికారంలోకి వస్తే వారికి జరిగే ప్రయోజనాలను వివరిస్తారు. తాగేందుకు నీళ్లే లేవు.. అభివృద్ధి ఎక్కడ?: సంజయ్ బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తరుణ్‌చుగ్, బండి సంజయ్‌ల సమక్షంలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎంలకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. తాగడానికి మంచి నీళ్లు అందించలేని సీఎం కేసీఆర్.. అభివృద్ధి గురించి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ‘‘మంచి నీళ్లు అందక జనం అల్లాడుతున్నారు. ఎండలో కిలోమీటర్లు నడిచి వెళ్లి వ్యవసాయ బోర్ల వద్ద నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. దీనిని బట్టి మిషన్ భగీరథ ఎంత పెద్ద స్కామో తెలిసిపోతుంది..’’ అని వ్యాఖ్యానించారు. -
షోకాజ్ అందుకున్న మర్నాడే బీజేపీలోకి ఏలేటి
సాక్షి, న్యూఢిల్లీ/నిర్మల్: ‘నేనేమైనా ఉగ్రవాదినా? ఏమైనా తప్పు చేశానా? కారణం ఏమిటో చెప్పకుండా నాకు షోకాజ్ నోటీసు ఇవ్వడం.. గంటలోగా వివరణ కోరడం ఏమిటి? 15 ఏళ్లుగా అవినీతి మచ్చ లేకుండా పనిచేస్తున్న నన్ను ఎలాంటి ఆధారాల్లేకుండా, అభాండాలు వేసి బయటకు వెళ్లేలా చేశారు. కాంగ్రెస్ పార్టీలో అవమానాల నుంచి విముక్తి కోసమే బీజేపీలో చేరా’అని తెలంగాణ సీనియర్ నేత, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా ఉన్న మహేశ్వర్‌రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలో బీజేపీలో చేరారు. గురువారం ఉదయమే ఢిల్లీ చేరుకున్న ఆయన తొలుత బీజేపీ చేరికల కమిటీ కన్వీ నర్ ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారు. అనంతరం వారిద్దరూ కలసి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ నివాసంలో ఛుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ప్రత్యేకంగా సమావేశమ య్యారు. ఆ తరువాత ఆయన్ను తరుణ్ ఛుగ్, బండి సంజయ్, ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సంగప్ప బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ మహేశ్వర్‌రెడ్డికి జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం జేపీ నడ్డా నివాసం వద్ద తెలంగాణ బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడారు. బీజేపీ, మోదీతోనే అరాచక పాలనకు తెర రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను అంతమొందించడం కేవలం బీజేపీ, ప్రధాని మోదీ వల్లే సాధ్యమవుతుందని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. అందువల్లే తాను బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు కలసి అడుగులేసే దిశగా నడుస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతిపై పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ ఏమీ పట్టనట్లుగా పార్లమెంటులో వారితో కలసి తిరుగుతోందని విమర్శించారు. బీఆర్ఎస్తో పొత్తు విషయంలో కాంగ్రెస్ నాయకులు రోజుకో విధంగా మాట్లాడుతూ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారని... దీంతో రాష్ట్రంలో పార్టీ దయనీయమైన పరిస్థితికి చేరుకుందని, ఎటుచూసినా అయోమయం నెలకొందని మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్కు కోవర్టులుగా ఉన్నారనే నిందలను పలువురు కాంగ్రెస్ నేతలపై మోపుతున్నారని... అసలు ఎవరు ఎవరి కోవర్టులో తెలుసుకోలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు. 15 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఎలాంటి వివాదాలు లేకుండా పనిచేస్తున్న తనపై కావాలనే కొందరు సోషల్ మీడియాలో నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. కొంతకాలంగా కాంగ్రెస్‌లో ఒక నాయకుడు పథకం ప్రకారమే సీనియర్లను బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అందరం కలసికట్టుగా...: సంజయ్ రాష్ట్రంలో అహంకారపూరిత నియంత పాలనను అంతమొందించడానికి ప్రతి ఒక్కరం కలసికట్టుగా పనిచేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. మహేశ్వర్‌రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు బీజేపీలో చేరడం సంతోషకరమన్నారు. కేవలం నిర్మల్ జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లో బీజేపీ బలపడేందుకు మహేశ్వర్‌రెడ్డి లాంటి నాయకులు ఉపయోగపడతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలన్న ఏౖకైక లక్ష్యంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో మహేశ్వర్‌రెడ్డి చేరడం సంతోషకరమని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ తెలిపారు. రానున్న రోజుల్లో నిర్మల్ నుంచి పెద్ద ఎత్తున చేరికలుంటాయన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణను అందరికీ అందించేలా బీజేపీనే చర్యలు చేపడుతుందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. బీజేపీలో మహేశ్వర్‌రెడ్డి చేరికకు కారణాలివే సాక్షి, హైదరాబాద్: సొంత పార్టీలో విభేదాలు... నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ పరి ణామాలు... వెరసి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీజేపీ కండువా కప్పుకోవడానికి కారణమయ్యాయి. కొంతకాలంగా మహేశ్వర్‌రెడ్డి పార్టీ మార్పు ప్రచారం జరుగుతున్నప్పటికీ నిర్మల్‌లో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌లోనే ఆయన కొనసాగు తారని భావించారు. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్‌తో ముదిరిన విభేదాలు, తాజాగా ఇచ్చిన షోకాజ్ నోటీసుతో ఏలేటి అహం దెబ్బతింది. అదే సమయంలో నియోజకవర్గంలో అధికార పార్టీ అసంతృప్త నేతలు బీజేపీలో చేరడానికి చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఏలేటి తన రాజకీయ వ్యూహాన్ని మార్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలసి ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కమలదళంలో చేరారు. మైనారిటీల ప్రభావం అధికంగా ఉండే నిర్మల్‌లో ఆయన నిర్ణయం ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందోననే అంశాలపై రాజకీయ పరిశీలకులు వేచి చూస్తున్నారు. -
కాంగ్రెస్‌తో ఇబ్బంది లేదు కానీ.. : మహేశ్వర్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధికారికంగా బీజేపీలో చేరిపోయారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, మహేశ్వర్‌రెడ్డికి కండువా కప్పి బీజేపీలోకి స్వాగతించారు. అంతుకు ముందు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ మహేశ్వర్‌రెడ్డికి శాలువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, సంగప్ప తదితరులు మహేశ్వర్‌రెడ్డిని వెంట పెట్టుకుని మహేశ్వర్‌ను తరుణ్ చుగ్‌కు కలిపించారు. కాంగ్రెస్ రాజీనామా ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. రేపు(శుక్రవారం) మంచిర్యాలలో కాంగ్రెస్ సభకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇంతలోనే మహేశ్వర్‌రెడ్డి తన రాజీనామాను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపడం గమనార్హం. టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డితో పొసగకపోవడం, నోటీసుల నేపథ్యంలో నొచ్చుకుని ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నా విషయంలోనే ఇలా చేశారు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరాక మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. పొత్తులపై నేతలు తలో మాట మాట్లాడుతున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. కొంతమంది కోవర్టులున్నారని కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఎవరికోసం పనిచేస్తున్నారో తెల్వడం లేదు. నా మీద సోషల్ మీడియాలో నిందలు మోపారు. గంటలోపల బదులు ఇవ్వమని నోటీసులు ఇవ్వడం దారుణం. నా ఒక్కడి విషయంలోనే అలా జరిగింది. నాకు కాంగ్రెస్ లో నిత్యం అనుమానాలు, అవమానాలే ఎదురైయ్యాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలోనే తెలంగాణ ప్రజలకు విముక్తి వస్తుందనే నమ్మకం ఉంది. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తా. కాంగ్రెస్‌తో నాకు ఇబ్బంది లేదు. ఎప్పుడూ పార్టీ లైన్లోనే పని చేశా. కానీ, ఇటీవల పార్టీలోకి వచ్చిన ఓ వ్యక్తి సీనియర్లను ఇబ్బందులకు గురిచేస్తూ పార్టీని వీడేలా పనిచేస్తున్నారు అని మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ► మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఇన్ని రోజులు పని చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. బిజెపికి ప్రజలు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. అందరం కలిసి కట్టుగా నియంత పాలన అంతం చేసేందుకు కృషి చేస్తాం అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ► కాంగ్రెస్‌కి చెందిన పెద్ద నేత మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరారు. జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో చేరిపోయారు. ఆయన చేరికను స్వాగతిస్తున్నా. మహేశ్వర్ రెడ్డి చేరికతో బీజేపీ మరింత బలోపేతం అవుతుంది అని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ ఛుగ్ చెప్పారు. -
కాంగ్రెస్‌కు మహేశ్వర్ రెడ్డి షాక్.. బీజేపీలో చేరికపై క్లారిటీ!
సాక్షి, హైదరాబాద్: నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌లో రోజుకో చర్చకు దారితీస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో నెలకొన్న విభేదాల నేపథ్యంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. కాంగ్రెస్‌కు మహేశ్వర్‌రెడ్డి గురువారం రాజీనామా చేశారు. కాంగ్రెస్ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నానని, త్వరలోనే బీజేపీలో చేరున్నట్లు మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈమేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. కాగా కాసేపట్లో ఆయన తరుణ్‌చుగ్ ఇంటికి వెళ్లనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. చదవండి: కారేపల్లి ఘటనలో కుట్ర కోణం?.. కేటీఆర్ ఏమన్నారంటే! -
తెలంగాణలో బీజేపీకి ఈ స్పీడ్ సరిపోదు! ఆదేశాలు జారీ
సాక్షి, హైదరాబాద్: మరో 7, 8 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ప్రస్తుతం చేస్తున్న కృషి సరిపోదని, తెలంగాణ లోని అన్ని వర్గాలను చేరుకుని కార్యక్రమాల వేగం పెంచాలని రాష్ట్ర బీజేపీని జాతీయ నాయకత్వం ఆదేశించింది. ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సూచించింది. పార్టీలోని అన్ని విభాగాలు, 7 మోర్చాలు సన్నద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర నాయకత్వం, వివిధ విభాగాలు, మోర్చాల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జిలు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్ రెండు, మూడు రోజులుగా అంతర్గత సమావేశాలు నిర్వహించారు. శనివారం జరిగిన ప్రధాని మోదీ సభతో పార్టీ ఎన్నికల శంఖం పూరించినట్టేనని తెలిపారు. ఎస్సీ నియోజకవర్గాల్లో గెలుపు కోసం: అర్వింద్ మీనన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, కిసాన్ ఇతర మోర్చాల జిల్లా ఇన్చార్జిలతో జాతీయ నాయకుడు అరి్వంద్ మీనన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం వేర్వే రుగా సమావేశమయ్యారు. ఎస్సీ లు, ఎస్టీలు, ఓబీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆయా కులాలు, వర్గాలవారీగా ఓటర్లు, ప్రభా వం చూపే అంశాలపై లోతైన కసరత్తు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా 19 ఎస్సీ, 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ చేయాలని ఆదేశించారు. ఈ నియోజకవర్గాల్లో అధికస్థానాలు గెలిస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అసెంబ్లీని యూనిట్‌గా తీసుకుని అసెంబ్లీ, మండల, గ్రామ స్థాయి, శక్తి కేంద్రం (మూడు, నాలుగు పోలింగ్ బూత్‌లు కలిపి ఒకటి), బూత్‌స్థాయి వరకు Ð వెళ్లేలా కృషి చేయాలని సూచించారు. ప్రతి బూత్‌లో పార్టీ బలోపేతం... ఎస్సీ, ఎస్టీ మోర్చా రాష్ట్ర నేతలను మండలాల ఇన్‌చార్జీలుగా నియమించి 31 నియోజకవర్గాల్లోని ప్రతిబూత్‌లో పార్టీ బలోపేతానికి కార్యాచరణ సిద్ధం చేస్తామని మోర్చాల నేతలు తెలియజేసినట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ బస్తీల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం, ఆయా వర్గాల్లోని మేధావులకు, విద్యావంతులకు బీజేపీ ఆలోచనలు, ఆశయాలను తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు బాషా, ఓబీసీ మోర్చా ఆలె భాస్కర్ రాజ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు, ఎస్సీ మోర్చా ఇంచార్జి డా.జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ పాల్గొన్నారు. -
‘ఆలీబాబా నలభై దొంగల్లాంటి మంత్రి మండలి.. కేసీఆర్ పాలన ఇదే!’
సాక్షి, కరీంనగర్: పోలీసులు తెలంగాణాలో సీఎం కేసీఆర్ ఎలా చెబితే అలా ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్‌లదీ అదే దుస్థితి అని మండిపడ్డారు. ఈ మేరకు కరీంనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక పార్లమెంట్ సభ్యుడిని ఎలాంటి నోటీస్, వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. అయినా న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. తెలంగాణా యువత కోసం పోరాటం చేసినందుకు సంజయ్‌ను అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు కేరాఫ్‌గా మారిందని తరుణ్ చుగ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అనాగరిక, ఆటవిక పాలన కొనసాగుతోందని, ఒక లోక్ సభ సభ్యుడికే రక్షణ లేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటని సూటిగా ప్రశ్నించారు. రాత్రికి రాత్రే ఓ ఆతంకవాది తరహాలో ఓ పార్లమెంటేరియన్‌ను అరెస్ట్ చేసిన విధానం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేపర్ లీక్ మాఫియా నడుస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజల్లో కేసీఆర్ పాలనపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తమవుతోంది.. ఆలీబాబా నలభై దొంగల్లాంటి మంత్రి మండలిని పెట్టుకుని నియంతృత్వ పాలన చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పేపర్ లీకేజీ మాఫియా వెనుక ఎవరున్నారో కేసీఆర్ చెప్పాలని, ఆ కింగ్ పిన్ ఎవరో బయటపెట్టాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. -
బండి సంజయ్ అరెస్ట్.. తరుణ్‌చుగ్ రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు.. బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. అక్రమ అరెస్ట్ అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తరుణ్‌చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ అరెస్ట్‌పై తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. సంజయ్ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. కారణం లేకుండా సంజయ్‌ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. ప్రశ్నిస్తే జైల్లో వేస్తామంటే బీజేపీ నేతలు భయపడరు. బండి సంజయ్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. సంజయ్ కోసం బీజేపీ కార్యకర్తలంతా పోరాడుతారు. కేసీఆర్ ఏ వ్యవస్థను గౌరవించడం లేదు. కేసీఆర్ సర్కార్ అహంకారపూరితంగా వ్యవహరిస్తోంది. కేసీఆర్ కుటుంబ అవినీతిపాలనపై బీజేపీ పోరాడుతుంది. అరెస్టుకు కారణాన్ని వెల్లడించడంలో పోలీసులు విఫలమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు భయపడే కేసీఆర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు. మరోవైపు.. బండి సంజయ్ అరెస్ట్ బీజేపీ అధిష్టానం ఫోకస్ పెంచింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. కిషన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. సంజయ్ అరెస్ట్‌పై అమిత్‌షాకు కిషన్‌రెడ్డి వివరాలు తెలిపారు. ఇది కూడా చదవండి: బండి సంజయ్ తరలింపులో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు -
కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి
సాక్షి, న్యూఢిల్లీ: కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ అహంకార ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధమవుతున్నారని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అధికారంలోకి రాలేమనే భయంతో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే ప్రజల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు రాజ్యాంగంపై ఏమాత్రం నమ్మకం లేదన్నారు. సీబీఐ, కేంద్ర ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలతో పాటు రాజ్యాంగాన్ని సైతం గౌరవించడంలేదని విమర్శించారు. తమకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కేసీఆర్ ప్రభుత్వం లాఠీచార్జీలు చేస్తూ, తప్పుడు కేసులు బనాయిస్తోందని ధ్వజమెత్తారు. -
కేసీఆర్ కుటుంబం భయంతో వణికిపోతోంది: తరుణ్‌చుగ్
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాంలో వందల కోట్ల అవినీతి జరిగిందని తెలంగాణ బీజేపీ ఇన్చార్జ్ తరుణ్‌చుగ్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దర్యాప్తు సంస్థలకు కేసీఆర్, సోనియా ఎవరైనా ఒక్కటే.. లిక్కర్ స్కాంలో కవిత కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందేనన్నారు. ‘‘కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచేసింది. ఢిల్లీని దోచుకోవడానికి లిక్కర్ స్కామ్‌కు తెర తీశారు. దర్యాప్తు సంస్థలు నిజాలు నిగ్గు తేలుస్తున్నాయి. కేసీఆర్ కుటుంబం భయంతో వణికిపోతోంది. దోషులకు కఠిన శిక్షలు పడాల్సిందే’’ అని తరుణ్‌చుగ్ అన్నారు. చదవండి: హస్తినలో హై టెన్షన్.. ఢిల్లీ పరిణామాలపై సీఎం కేసీఆర్ ఆరా.. -
Telangana: పది నెలలూ ప్రజల్లోనే
సాక్షి, న్యూఢిల్లీ /సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని స్థాయిల బీజేపీ నాయకులు సమన్వయంతో, సమష్టిగా వ్యవహరిస్తూ ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధం కావాలని ఆ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి సాగనంపేలా, తెలంగాణలో కచ్చితంగా కాషాయజెండా ఎగురవేసేలా.. స్పష్టమైన వ్యూహాలు, కార్యాచరణతో ముందుకు సాగాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొనసాగుతున్న నియంత, కుటుంబ పాలనకు చరమగీతం పాడే సత్తా కేవలం బీజేపీకే ఉందనే సంకేతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. ‘ఇంటింటికీ కమలం పువ్వు’ నినాదంతో వచ్చే పది నెలలు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారి విశ్వాసాన్ని, మద్దతును కూడగట్టేలా వివిధ రూపాల్లో కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సూచించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అంతకుముందు నడ్డా, అమిత్‌షాతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ , తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జిలు తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, సహ ఇన్చార్జి అరవింద్ మీనన్, రాష్ట్రనేతలు సమావేశమయ్యారు. ఈ భేటీ మధ్యలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో అమిత్‌షా, నడ్డా, ఇతర నేతలు విడిగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన ఇతర నేతలు బయటే ఉండిపోయారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండున్నర గంటల వరకు రాష్ట్ర నేతలు కిషన్‌రెడ్డి, డీకే అరుణ, కె.లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, ఏపీ జితేందర్‌రెడ్డి, ధర్మపురి అరవింద్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయశాంతి, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావులతో అమిత్‌షా, నడ్డా భేటీ అయ్యారు. మొత్తం మీద రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతం, అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా రాష్ట్ర పార్టీ సంసిద్ధత, వ్యూహాల ఖరారు వంటి అంశాలపై నాలుగు గంటల పాటు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ‘ప్రజాగోస–బీజేపీ భరోసా’ స్ట్రీట్‌కార్నర్ మీటింగ్‌లకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అభినందించిన నడ్డా, షా.. పలు అంశాలపై రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేశారు. గెలుపు లక్ష్యంగా ప్రజల్లోకి... ‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పటికే నిర్వహించిన కార్యక్రమాలకు ప్రజా స్పందన మెరుగ్గా ఉందని మాకు నివేదికలు అందాయి. ఈ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా పోలింగ్ బూత్‌లు, నియోజకవర్గాల వారీగా సభలు, ర్యాలీలు, వివిధస్థాయిల నాయకుల చేరికలు వంటి వాటిని విస్తృతంగా చేపట్టి ప్రజలను బీజేపీ వైపు ఆకర్షితులను చేయాలి. ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు క్షేత్రస్థాయి నుంచి సంస్థాగతంగా పటిష్టం కావడం, కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లడంపై పార్టీ యావత్ యంత్రాంగం దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధి జరగకపోవడం, వివిధ వర్గాలు ఇంకా తీవ్రమైన సమస్యల్లో కొట్టుమిట్టాడుతుండటం వంటి అంశాలను మరింత ఉధృతంగా జనంలోకి తీసుకెళ్లాలి. 119 నియోజకవర్గాల్లోనూ సభలు నిర్వహించాలి. వీటికి జాతీయ నేతల్లో ఎవరో ఒకరు హాజరవుతారు. ఇక పాత పది జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభలకు అగ్ర నేతల్లో ఎవరో ఒకరు హాజరవుతారు..’ అని చెప్పారు. లిక్కర్ స్కాంపై చర్చ జరగలేదా? సాయంత్రం మూడున్నర గంటల సమయంలో ఈ భేటీలు ముగిశాయి. ఈ సమావేశాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై చర్చిస్తారని వార్తలు వచ్చినా అలాంటిదేమీ జరగలేదని నేతలు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం, పార్టీ అధ్యక్షుడి మార్పు వంటి అంశాలు కూడా చర్చకు రాలేదని చెప్పారు. అయితే బీఆర్ఎస్ పార్టీపై కొద్దిసేపు సరదాగా చర్చించిన నేతలు.. ఆ పార్టీ జాతీయ పార్టీ అయితే మొన్నటి త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదంటూ వ్యాఖ్యానించారని తెలిసింది. ఇకపై ప్రతి నెలా తమలో ఒకరి రాష్ట్ర పర్యటన ఉంటుందని, రెండు లేక మూడు సభలకు ప్రధాని మోదీ హాజరయ్యేలా చూస్తామని నడ్డా, షా అన్నట్టు నేతలు తెలిపారు. కాగా రాష్ట్రంలో పెద్దెత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో భాగంగా ప్రభుత్వంపై చార్జిషీట్లు విడుదల చేయాలని రాష్ట్ర పార్టీ నేతలు సూచించినట్టు సమాచారం. అన్ని స్థాయిల్లో చేరికలు ప్రోత్సహించాలి ‘రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలనపై ప్రజలు విసుగుతో ఉన్నారు. పార్టీ గెలుపునకు అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేరికలను ప్రోత్సహించాలి. నేతలు సమన్వయంతో వ్యవహరించాలి.’ అని నడ్డా, షా సూచించారు. ముమ్మర పర్యటనలు.. బహిరంగ సభలు ‘రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో సమావేశాలæ తర్వాత, పది ఉమ్మడి జిల్లాల పరిధిలో ఒక్కోచోట 50 వేల మందికి తగ్గకుండా బహిరంగ సభలు నిర్వహించాలి. మార్చిలో అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్య నేతలు పర్యటించాలి. ఏప్రిల్‌లో ప్రధాని పాల్గొనే విధంగా, రాష్ట్రవ్యాప్తంగా 34 వేలకు పైగా పోలింగ్ బూత్‌ల్లోని పార్టీ కమిటీలు, కార్యకర్తలతో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలి..’ అని సమావేశాల్లో నిర్ణయించారు. -
అప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్: తరుణ్ చుగ్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది సంస్థాగత ఎన్నికలు జరిగే దాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జీ తరుణ్ చుగ్ వెల్లడించారు. గురువారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ 2024లో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ‘ప్రజాగోస– బీజేపీ భరోసా’పేరిట నిర్వహిస్తున్న స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ మీటింగ్‌ల ద్వారా కేసీఆర్ సర్కార్‌కు చివరి మేకు దించేందుకు బీజేపీ సిద్ధమవుతోందన్నారు. వచ్చే నెల 11వ తేదీ నాటికి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతుండటంతో ఆయన పదవీకాలం ముగియనుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 2024 జూన్ వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను కొనసాగిస్తూ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంజయ్ పదవీకాలాన్ని పొడిగిస్తారనే చర్చ కొంతకాలంగా సాగుతున్న విషయం తెలిసిందే. వచ్చేనెల మొదటివారంలో అధ్యక్షుడిగా సంజయ్ పదవీకాలం పొడిగింపునకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం. చదవండి Hyderabad: మామిడి చెట్టు తెచ్చిన తంటా!.. మేడ మీద ఆకులు పడుతున్నాయని -
పాతికేళ్ల ప్రయాణం.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: సినీ నటిగానే కాదు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర కోసం ప్రయత్నించారు విజయశాంతి. ఆమె రాజకీయాలు పూర్తి చేసుకుని ఈ జనవరి 26తో పాతికేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా శుక్రవారం బీజేపీ సంబురాలు నిర్వహించగా.. పార్టీ కీలక నేతల సమక్షంలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతోనే తన రాజకీయ ప్రస్థానం మొదలైందన్న ఆమె.. గతంలో బాధగానే ఆ పార్టీని వీడినట్లు.. ఇప్పుడు ఆ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పోరాడతానని ప్రకటించారామె. మాజీ ఎంపీ విజయశాంతి మాట్లాడుతూ.. ‘‘43ఏళ్లుగా సినిమా పరిశ్రమ లో పనిచేసాను. కానీ, ఈ 25 ఏళ్లు సుదీర్ఘ ప్రయాణంగా అనిపించింది. అప్పట్లో విద్యాసాగర్ రావు, వెంకయ్య నాయుడులు నన్ను బీజేపీ లో చేరమని అడిగారు. 1998 జనవరి 26న వాజ్‌పేయి, అద్వానీల సమక్షంలో బీజేపీలో చేరాను. అవినీతి లేని, క్రమశిక్షణ గల పార్టీ కాబట్టే బీజేపీని ఎంచుకున్నా. తెలంగాణ కావాలి.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని నాకు చిన్నప్పటి నుంచి ఉంది. తెలంగాణ కోసం మొదటి నుంచి పోరాటం చేసిన పార్టీ బీజేపీ. సోనియా గాంధీ కి వ్యతిరేకంగా పోటీ చేయమని అద్వానీ కోరారు. కష్టాలైనా , నష్టాలైనా ఇబ్బందులు, వెన్ను పోటులు పడినా పోరాడుతూ వచ్చాను. తెలంగాణ కోసం పోరాడుతూ అందరికీ శత్రువు గా మారాను. తెలంగాణ వాదం వదులుకుంటే ఎన్నో పదవులు వచ్చేవి. అసలు తెలంగాణ కోసమే నేను బీజేపీ నుంచి బయటకు వచ్చాను. సమైక్య వాదులు నాపై ఒత్తిడి చేస్తూ వచ్చారు.. ఎంతో బాధతో బీజేపీ నుంచి బయటకు వచ్చా. ఆ తర్వాత తెలంగాణ సమస్యలపై పోరాడుతుంటే.. కేసీఆర్ అనే రాక్షసుడు నా జీవితంలో ఎంటర్ అయ్యాడు యూపీఏలో కేసీఆర్ కేంద్రమంత్రిగా తీసుకున్నప్పుడు.. బుద్దుందా? అని అడిగాను. మెదక్ లో ఎంపీ గా టికెట్ ఇచ్చి కేసీఆర్ నన్ను ఓడించేందుకు కుట్ర చేశాడు. ఆ తర్వాత అకారణంగా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బిల్లు రోజు నన్ను పోడియం వద్దకు పంపించి కేసీఆర్ సభ నుంచి జారుకున్నాడు. అందమైన తెలంగాణ ఇప్పుడు అసమర్దుడి చేతిలోకి వెళ్ళింది. కానీ, తెలంగాణను బీజేపీ అభివృద్ధి చేస్తుందనే నమ్మకం నాకుంది. కేసీఆర్ ను అధికారంలో నుండి దింపడానికి అంతా కలిసి పనిచేద్దాం. ఇదొక్కసారి కష్టపడితే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో మరోసారి కేసీఆర్‌కు అధికారం దక్కితే.. ఎవరూ బ్రతకరు. కేసీఆర్ అనే వ్యక్తి ఒక విషసర్పం. అందరినీ చాపకింద నీరులా చంపేస్తూ వస్తాడు. మరోసారి అధికారంలోకి వస్తే ఏ పెన్షన్లు ఇవ్వడు. నేతలు లేరు అనే విమర్శలు పట్టించుకోకుండా పని చేసుకుపోవాలి. బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలి అని ఆమె పిలుపు ఇచ్చారు. ఆమెది కీలక పాత్ర బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ మాట్లాడుతూ విజయశాంతిపై ప్రశంసలు గుప్పించారు. ‘‘25ఏళ్ల రాజకీయ ప్రస్థానం లో అనేక పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ అస్తిత్వం కోసం చేసిన పోరాటాలు మరువలేనివి. లోక్ సభ లో కూడా విజయశాంతి తెలంగాణ కోసం పోరాటం చేసింది. బిల్లు అమలు సమయంలో కూడా కేసీఆర్ సభలో లేడు. బంగారు తెలంగాణ కావాలన్న ప్రజలను కలలను పక్కన పెట్టి కుటుంబం ను బంగారు కుటుంబం చేసుకుంటున్నారు. మరో 50ఏళ్ళు ఆమె బీజేపీ లోనే ఉండాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. ఆ పని చేసింది విజయశాంతి మాత్రమే పాతికేళ్లపాటు రాజకీయాల్లో కొనసాగడం మామూలు విషయమేమీ కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. విజయశాంతిని ఉద్దేశించి పేర్కొన్నారు. తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడింది విజయశాంతి మాత్రమే అని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి విజయ శాంతి అని కొనియాడారు. అలాగే.. కేసీఆర్ ఎంతో మంది ఉద్యమకారులను మోసం చేశారని విమర్శించారు బండి సంజయ్. పార్టీని వీడిన నేతలంతా తిరిగి కాషాయ కండువా కప్పుకోవాలన్న ఆయన.. చిన్న చిన్న సమస్యలుంటే సర్థుకుని సిద్దాంతం కోసం పనిచేద్దామన్న పిలుపు ఇచ్చారు. బీజేపీలో ఉంటేనే అవకాశాలు వస్తాయి. బీజేపీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. పని చేయకపోతే పక్కకు తప్పించి బాధ్యతలు వేరే వాళ్ళకు ఇస్తారు. ప్రాంతీయ, కుటుంబ పార్టీల్లో ఇలాంటి అవకాశం ఉండదు. బీజేపీ కోసం రెండు తరాలు త్యాగం చేశాయి. ఇంకా ఎంతో మంది త్యాగాలు చేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలతో పార్టీ వీడిన నేతలంతా సిద్దాంతం కోసం పనిచేద్దాం తిరిగి రండి. తెలంగాణలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు.. వారిని ఆదుకునేందుకు కలిసి పోరాటం చేద్దాం అని పిలుపు ఇచ్చారాయన.