Telangana BJP Incharge Tarun Chug Comments About MLC Kavitha ED Enquiry, Details Inside - Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కుటుంబం భయంతో వణికిపోతోంది: తరుణ్‌చుగ్‌

Mar 11 2023 6:50 PM | Updated on Mar 11 2023 7:12 PM

Telangana BJP Incharge Tarun Chug About Kavitha ED Enquiry - Sakshi

సాక్షి, ఢిల్లీ: లిక్కర్‌ స్కాంలో వందల కోట్ల అవినీతి జరిగిందని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్‌ తరుణ్‌చుగ్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,  దర్యాప్తు సంస్థలకు కేసీఆర్‌, సోనియా ఎవరైనా ఒక్కటే.. లిక్కర్‌ స్కాంలో కవిత కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందేనన్నారు.

‘‘కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోచేసింది. ఢిల్లీని దోచుకోవడానికి లిక్కర్‌ స్కామ్‌కు తెర తీశారు. దర్యాప్తు సంస్థలు నిజాలు నిగ్గు తేలుస్తున్నాయి. కేసీఆర్‌ కుటుంబం భయంతో వణికిపోతోంది. దోషులకు కఠిన శిక్షలు పడాల్సిందే’’ అని తరుణ్‌చుగ్‌ అన్నారు.
చదవండి: హస్తినలో హై టెన్షన్‌.. ఢిల్లీ పరిణామాలపై సీఎం కేసీఆర్‌ ఆరా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement