సాక్షి, ఢిల్లీ: సినీ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో అధికారికంగా చేరారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ ఆమెకు కండువా కప్పి కాషాయం పార్టీలోకి ఆహ్వానించారు. ప్రాథమిక సభ్యత్వం అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
‘‘ఎమ్మెల్యేగా నా పదవీకాలం పూర్తయ్యాక.. కొన్ని కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నా. ప్రధానమంత్రి మోదీ పరిపాలన నచ్చి బీజేపీలో చేరాను. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీలోకి వచ్చా. దాదాపు ఏడాదిగా బీజేపీలో చేరాలని ఆలోచిస్తున్నాను. జాతీయ పార్టీ ద్వారా ప్రజలకి సేవ చేస్తా. పార్టీ ద్వారా క్రైస్తవుల కోసం పని చేస్తా. కులమతాలకు అనుగుణంగా సేవలు అందిస్తా. సికింద్రాబాద్, ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తాననడం రూమర్ మాత్రమే’’
:::జయసుధ
‘‘సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ పనిచేశారు, 350కి పైగా సినిమాలలో నటించారు. జయసుధ చేరికతో బీజేపీ బలోపేతం అవుతుంది. BRS ఓటమి తోనే తెలంగాణ అమరుల ఆకాంక్ష నెరవేరుతుంది. పేదల సంక్షేమం, బస్తీల అభివృద్ధి విషయంలో జయసుధకు చిత్తశుద్ది ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే కుటుంబ పాలన, నియంతృత్వ పాలన పోవాలి అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన రావాలి.’’
:::కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్
జయసుధకు సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఈ తొమ్మిదేళ్లలో మోదీ పాలన.. అభివృద్ధిని చూసి ఆమె బీజేపీలో చేరారు. జయసుధ చేరిక బీజేపీకి ఉత్సాహాన్ని ఇస్తుంది.
:::తరుణ్‌చుగ్, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి
Comments
Please login to add a commentAdd a comment