సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో బీజేపీని గద్దెనెక్కించాలనే దృఢసంకల్పంతో ఉన్న ఆ పార్టీ అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల వ్యూహానికి పదునుపెడుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను మార్చి ఆయన స్థానంలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించిన అధిష్టానం మరో కీలక మార్పు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలు స్తోంది. ఇందులో భాగంగా ట్రబుల్‌షూటర్‌గా పేరున్న కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను రంగంలోకి దించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రాష్ట్ర ఇన్‌చార్జిగా ఉన్న తరుణ్ ఛుగ్‌ను తొలగించి ఆయన స్థానంలో భూపేంద్ర యాదవ్‌ను పంపిస్తారని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఇన్‌చార్జిగా పనిచేసిన అనుభవం, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పట్టున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయనను క్రియాశీలం చేయను న్నట్లు తెలుస్తోంది. బీజేపీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తర్వాత భూపేంద్ర నాలుగో స్థానంలో ఉన్నారు.
యూపీ, బిహార్, హరియాణాల్లో భూపేంద్ర యా దవ్ రచించిన వ్యూహాలు పార్టీ విజయానికి బాటలు వేశాయి. 2019 ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
చదవండి: Kishan Reddy: అందుకే కిషన్‌రెడ్డికి బీజేపీ బాధ్యతలు, ఈటలకు కీలక పదవి
నడ్డాతో భేటీ..
రాష్ట్ర అధ్యక్ష మార్పు ప్రకటన వెలువడిన సమయంలో భూపేంద్రయాదవ్ ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్నారు. ప్రకటన వెలువ డటానికి కొద్దిగంటల ముందు జేపీ నడ్డాతో బండి సంజయ్ భేటీ అయిన సమయంలో కూడా భూపేంద్రయాదవ్ ఉన్నారు. ఈ సమయంలోనే రాష్ట్ర ఇన్‌చార్జి బాధ్యతలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. సుమారు గంటపాటు నడ్డా, యాదవ్ తెలంగాణ రాజకీ యాలపై గంటపాటు చర్చించుకున్నట్లుగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment