సాక్షి,హైదరాబాద్ : సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ కొణతం దిలీప్‌ను సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ మీడియా హెడ్‌గా కొణతం దిలీప్ వ్యవహారించారు.
అయితే,కొణతం దిలీప్ కుమార్ అరెస్ట్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొణతం దిలీప్ అరెస్ట్ అయ్యారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో కేటీఆర్ ఏమన్నారంటే
ప్రశ్నిస్తే సంకెళ్లు...నిలదీస్తే అరెస్టులు..
నియంత రాజ్యమది...నిజాం రాజ్యాంగమిది..
కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్ గారి అరెస్ట్
విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా?
ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావ్!
ప్రజాస్వామ్య…— KTR (@KTRBRS) November 18, 2024
Comments
Please login to add a commentAdd a comment