ఫ్రస్టేషన్‌లో ప్రభుత్వం.. వైఫల్యాలను ఎత్తి చూపినందుకే :కేటీఆర్‌ | KTR interesting comments on Telangana politics | Sakshi
Sakshi News home page

ఫ్రస్టేషన్‌లో ప్రభుత్వం.. వైఫల్యాలను ఎత్తి చూపినందుకే :కేటీఆర్‌

Oct 29 2024 2:01 PM | Updated on Oct 29 2024 3:36 PM

KTR interesting comments on Telangana politics

సాక్షి,హైదరాబాద్‌ : ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌పై ఫ్రస్టేషన్,డేస్పరేషన్‌లో ఉన్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ మాపై చేస్తున్న రాజకీయ వేధింపుల ప్రహసనంలో గత రెండు రోజుల్లో జరిగిన పరిణామాలన్నీ ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో మరిన్ని వేధింపులు ఉంటాయి. మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులకు, సోషల్ మీడియా వారియర్లకి ధన్యవాదాలు. ప్రభుత్వం చేసే వ్యక్తిగత దాడులను, కుట్రలను, కుతంత్రాలను, అబద్దాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందాం.

కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా డిఫ్ ఫేక్ టెక్నాలజీ వంటి అనేక అంశాల సహకారంతో వారి పెయిడ్ ఆర్టిస్ట్‌లతో చేసే దుర్మార్గపూరిత కుట్రలు చూడాల్సి వస్తుంది. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ వారి పెయిడ్ సోషల్ మీడియా అంతా కలిసి బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేయబోతున్నాయి. ఇలాంటి కుటిల ప్రయత్నాలతో అయోమయానికి గురి కావడం, ఆగం కావొద్దు. ప్రజా సమస్యలపైనే మన పోరాటం.

తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న మన పోరాటం పైనే దృష్టి సారిద్దాం. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, అసమర్ధతను, హిపోక్రసీని ఎత్తిచూపుదాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకై వారిపైన ఒత్తిడి తెద్దాం’ అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement