సాక్షి, న్యూఢిల్లీ: కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ అహంకార ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధమవుతున్నారని వ్యాఖ్యానించారు.
శనివారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అధికారంలోకి రాలేమనే భయంతో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే ప్రజల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్‌కు రాజ్యాంగంపై ఏమాత్రం నమ్మకం లేదన్నారు. సీబీఐ, కేంద్ర ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలతో పాటు రాజ్యాంగాన్ని సైతం గౌరవించడంలేదని విమర్శించారు. తమకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కేసీఆర్ ప్రభుత్వం లాఠీచార్జీలు చేస్తూ, తప్పుడు కేసులు బనాయిస్తోందని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment