
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలకు షెడ్యూల్ వెలువడకముందే పొలిటికల్ హీట్ చోటుచేసుకుంది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే పలు కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తోంది. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్‌చుగ్.. కేసీఆర్ సర్కార్‌పై సంచలన కామెంట్స్ చేశారు.
కాగా, తరుణ్ చుగ్ ఎల్బీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ..
ఎంఐఎం చేతితో కారు స్టీరింగ్ ఉంది. తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలన కొనసాగుతోంది. తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన ఘనత కేసీఆర్‌దే. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల స్కీమ్ ఎందుకు అమలు చేయడం లేదు. కుటుంబ పాలన, దుష్ట పాలన నుంచి తెలంగాణ ప్రజలను కాపాడేది కేవలం బీజేపీ ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌కు బీ టీమ్.
తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు రెండుసార్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోని నెట్టారు. దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు. మెట్రో నగరమైన హైదరాబాద్‌కు కేంద్రం నిధులు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టిస్తోంది. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్.. ప్రజలను మోసం చేస్తున్నాడు. దీనిలో కేంద్రం నిధులున్నాయని స్పష్టం చేశారు. ఇదే సమయంలో దేశంలో ప్రతీ గ్రామంలో స్వతంత్ర సమరయోధులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్ల విగ్రహాలను ప్రతిష్టిస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: పక్కా ప్లాన్‌తో అసెంబ్లీలో కేసీఆర్ స్పీచ్.. టార్గెట్ ఫిక్స్, ఇక సమరమే!
Comments
Please login to add a commentAdd a comment