తరుణ్ చుగ్‌తో బండి సంజయ్ భేటీ
రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చ
కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది: తరుణ్ చుగ్
సంజయ్‌కు పలువురు ప్రజాప్రతినిధుల అభినందనలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజయ్‌కు చుగ్ శుభాకాంక్షలు తెలిపారు. హోం శాఖకు మంచిపేరు తీసుకురావడంతోపాటు ప్రజలకు మరింత మేలు జరిగేలా పని చేయాలని తరుణ్ చుగ్ ఆకాంక్షించారు. అరగంట పాటు జరిగిన వారిద్దరి భేటీలో రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు నెలల్లోనే విశ్వసనీయతను కోల్పోయిందని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే విషయం కూడా పార్లమెంట్ ఫలితాలతో రుజువైందని చుగ్ పేర్కొన్నారు.
బండికి శుభాకాంక్షల వెల్లువ
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్‌కి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, బీవీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, ఎనీ్వఎస్‌ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు టి.ఆచారి, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, వీరేందర్ గౌడ్, జె.సంగప్పతోపాటు వివిధ మోర్చాలకు చెందిన నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. అలాగే.. కరీంనగర్ తోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచి్చన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బండి సంజయ్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
తరుణ్ చుగ్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment