TS Congress Leader Paidi Rakesh Reddy Joined In BJP Party, Details Inside - Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు షాక్‌.. రేవంత్‌పై ఆరోపణలతో బీజేపీలో చేరిక

Published Fri, Jun 2 2023 12:12 PM | Last Updated on Fri, Jun 2 2023 1:55 PM

TS Congress Leader Paidi Rakesh Reddy Joined In BJP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేసీఆర్‌ కోసమే కాంగ్రెస్‌ పార్టీ పనిచేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ ఛుగ్‌ ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో కేసీఆర్‌ చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగా రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ గుర్తుమీద గెలిచినవాళ్లు కేసీఆర్‌ పంచన చేరి అసెంబ్లీలో కూర్చుంటున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్త పైడి రాకేష్‌రెడ్డికి తన నివాసంలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సమక్షంలో తరుణ్‌ఛుగ్‌ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తరుణ్‌ ఛుగ్‌ మాట్లాడుతూ, తెలంగాణలోనూ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రాబోతోందని, కేసీఆర్‌ అవినీతిపాలనను మోదీ నేతృత్వంలో అంతమొందిస్తామన్నారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో బీజేపీ ప్రజల సంపూర్ణ మద్దతుతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

కవిత కేసీఆర్‌ మాట వినకుండా..  
ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ, కవిత కేసీఆర్‌ మాట వినకుండా నిజామాబాద్‌ నుంచే పోటీ చేయాలని.. మెదక్‌కు పారిపోవద్దని కోరారు. కేసీఆర్‌ ఆమెను మెదక్‌ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ ఒక బీమారి అయితే దానికి వాక్సిన్‌ బీజేపీ అని వ్యాఖ్యానించారు. కర్నాటకలో ఫలితాలు, తెలంగాణలో ఏ మాత్రం ప్రభావం చూపించవని.. పక్క ఇంట్లో బిర్యానీ వండితే మన కడుపు నిండుతుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అర్వింద్‌ చెప్పారు 

రౌడీల రాజ్యంలా రాష్ట్రం: రాకేష్‌రెడ్డి  
అమరవీరుల త్యాగాల తెలంగాణ ఇది కాదని, రౌడీల రాజ్యంలా రాష్ట్రం ఉందని బీజేపీలో చేరిన పారిశ్రామికవేత్త పైడి రాకే‹Ùరెడ్డి మండిపడ్డారు. మోదీ నాయకత్వం నచ్చే బీజేపీలో చేరానని, కార్యకర్తగా ఉంటూనే పార్టీ ఎలాంటి బాధ్యత ఇచ్చినా మోసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో అన్యాయాలు, అక్రమాలు ఎదుర్కొంటామని, టిప్పర్లను అడ్డుకోవడమే తన కర్తవ్యమని తెలిపారు.   

ఇది కూడా చదవండి: ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం ఇది: సీఎం కేసీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement