సాక్షి, హైదరాబాద్: నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌లో రోజుకో చర్చకు దారితీస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో నెలకొన్న విభేదాల నేపథ్యంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. కాంగ్రెస్‌కు మహేశ్వర్‌రెడ్డి గురువారం రాజీనామా చేశారు.
కాంగ్రెస్ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నానని, త్వరలోనే బీజేపీలో చేరున్నట్లు మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈమేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. కాగా కాసేపట్లో ఆయన తరుణ్‌చుగ్ ఇంటికి వెళ్లనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.
చదవండి: కారేపల్లి ఘటనలో కుట్ర కోణం?.. కేటీఆర్ ఏమన్నారంటే!
Comments
Please login to add a commentAdd a comment