Eleti Maheshwar Reddy
-
100% రుణమాఫీ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
సాక్షి, హైదరాబాద్: రైతులకు వందశాతం రుణమాఫీ అయినట్లు నిరూ పిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వ ర్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా వెళ్లి రైతుల సమక్షంలోనే చర్చ పెట్టి, పూర్తిగా రుణమాఫీ జరిగిందంటే తాను దేనికైనా సిద్ధమేనన్నారు. అందరికీ రుణ మాఫీ జరగలేదని రైతులు చెబితే, రేవంత్‌రెడ్డి రాజ కీయాల నుంచి తప్పుకోవడమో, రాజీనామా చేయడమో.. ఏది చేస్తా రో చెప్పాలని డిమాండ్ చేశారు.శనివారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో రేవంత్ ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేసిందన్నారు. మొత్తం 60 లక్షల మంది అర్హులుండగా.. 22 లక్షల మంది రైతులకే రుణమాఫీ జరిగిందన్నారు. రుణమాఫీకి రూ.49 వేల కోట్లు ఇవ్వాల్సిఉండగా.. కేవలం రూ.17 వేల కోట్లే ఇచ్చారని తెలిపారు. సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల కు దమ్ముంటే గ్రామాలకు వెళ్లి రైతులకు రుణాలు మాఫీ అయ్యాయో లేదో ఆరా తీయాలన్నారు. దీనిపై రైతుల సమ క్షంలో చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. రుణమాఫీ జరిగిన రైతుల వివరాలను వారంరోజు ల్లోగా ప్రభుత్వం వెల్లడించాలన్నారు.పెండింగులో ఉన్న రైతుల రుణాలను ఈ నెలా ఖరులోగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకం మార్గదర్శకాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ నివేదికపై చర్చించి, రైతు భరోసా పథకానికి మార్గదర్శ కాలు ఖరారు చేసేందుకు అసెంబ్లీని సమావేశ పరచాలన్నారు. రైతు భరోసాకు ఇవ్వాల్సిన నిధులనే రుణమాఫీకి మళ్లించారని ఆరోపించారు. రైతు భరోసా ఖరీఫ్ సీజన్ డబ్బులను ఈ నెలాఖరులోగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కాని రైతులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రేవంత్ కొత్త విషయాలను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అని రేవంత్ ప్రచారం చేస్తున్నారన్నారు. -
కాంగ్రెస్ అసలు రూపం బయటపడింది: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో 17వేల కోట్లతో రుణమాఫీ చేసిన ఫార్ములా ఎంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక, రైతుభరోసా ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.కాగా, ఏలేటీ మహేశ్వర్ రెడ్డి శనివారం అసెంబ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో మాట్లాడుతూ.. స్పెషల్ డ్రైవ్ పెడుతున్నారు అంటే.. అందరికీ రుణమాఫీ కాలేదని ఒప్పుకుంటున్నారు కదా?. మీరు చెప్పిన గ్రామానికే వెళ్దాం. అక్కడ రైతులను అడుగుదాం. సీఎం రేవంత్ మీరు వస్తారా? లేక మీ వ్యవసాయశాఖ మంత్రి వస్తారా? రండి. రైతులందరికీ రుణ మాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. లేదంటే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా?. కేవలం 17వేల కోట్లతో రుణమాఫీ చేసిన ఫార్ములా ఎంటో చెప్పాలి. తీసుకున్న రెండు లక్షల రుణానికి నాలుగు ఐదు వేల వడ్డీ అయ్యిందని రుణమాఫీ కాలేదని గ్రామాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు.రుణమాఫీ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ విలీనం అని రేవంత్ కొత్త డ్రామా ఆడుతున్నారు. బీజేపీ ఏం చేసినా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఇది కేవలం డైవర్ట్ పాలిటిక్స్. బీఆర్ఎస్ విలీనానికి బీజేపీ ఎందుకు ఒప్పుకుంటుంది?. అంత అవసరం మాకేముంది?. పూర్తి రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలి. కాంగ్రెస్ అసలు రూపం బయటపడింది. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతాంగాన్ని మోసం చేసింది. అన్ని దేవుళ్ళ మీద ఒట్టు వేసి రైతులందరికీ రుణమాఫీ చేస్తానని రేవంత్ చెప్పారు. తెలంగాణలో 60 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరందరికీ రుణమాఫీ కావాలంటే రూ.49వేల కోట్లకుపైగా డబ్బులు అవసరం. ఏరోజు వరంగల్‌లో సభ పెడతారో చెప్పండి. ఆ సభలో రుణమాఫీ చేయని రైతులతో సభ నిండుతుంది. రుణమాఫీ అయిన అర్హుల జాబితాను బయట పెట్టండి. పెట్టుబడి సహాయాన్ని రుణమాఫీకి ఉపయోగించారు. రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదు.. ఎప్పటి లోపు ఇస్తారు?. రైతు భరోసా ఇవ్వకుండా ఎన్నికలకి ఎలా వెళ్తారు?. రుణమాఫీ చేయలేదు కాబట్టి రేవంత్ కట్టుకథలు ఆడుతూ ఎమ్మెల్యేల ఆఫీసుల మీద దాడులు చేయిస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కాంట్రాక్టు సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
పెద్దవూర: సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్‌వాల్ కూలిన ఘటనలో కాంట్రాక్టు కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టి..క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పునర్నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కాంట్రాక్టు కంపెనీ నుంచే రాబట్టాలన్నారు. రిటైనింగ్‌వాల్ కూలిన ప్రాంతాన్ని మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. అనంతరం మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 2వ తేదీన ఘటన జరిగితే సోషల్ మీడియాలో వచ్చే వరకు ఎందుకు గోప్యంగా ఉంచారో చెప్పాలన్నారు. కాంట్రాక్టర్‌ను కాపాడుకోవడానికా.. తప్పిదాలను వెనుకేసుకోవడానికా అని ప్రశ్నించారు. మంత్రులు వచ్చి సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి చిన్న ప్రమాదమని, చాలాతక్కువ నష్టమని అంటున్నారని, ఇప్పటివరకు త్రిసభ్య విచారణ కమిటీ ఎంత నష్టం జరిగిందో అంచనానే వేయలేదని చెప్పారు. రూ.2 వేల కోట్ల ప్రాజెక్టు వారికి చిన్నదిగా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. రిటైనింగ్‌వాల్ కూలిన ఘటనలో ఏదో లోపాయికారీ ఒప్పందం ఉందని, పనుల్లో నాణ్యత లోపమా, మరేదైనా కారణం ఉందా అనేది బహిర్గతం కావాలంటే సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ తప్పిదం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, లైసెన్సు రద్దు చేయాలని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. ఎమ్మెల్సీ ఏవీఎన్.రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా విజిలెన్స్ కమిటీచే విచారణ చేపట్టి నాణ్యత ప్రమాణాలు పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. -
రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడితే ఊరుకోం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్ర యోజనాల విషయంలో రాజీపడితే చూస్తూ ఊరుకో బోమని బీజేఎల్పినేత ఏలే టి మహేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. విభజన సమస్యల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల భేటీని స్వాగతిస్తున్నామన్నారు. శనివా రం అసెంబ్లీ మీడియా హాల్ ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాము ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పీకర్ ప్రసాద్‌కుమార్ అందుబాటులోకి రావడం లేదని తెలిపారు.కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే స్పీకర్ తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికే ఈ అంశం హైకోర్టులో కేసు ఉందని, తాము అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సర్కార్ పెద్దలు, వివిధ ట్యాక్సుల పేరుతో అవినీతికి పాల్పడిన తీరును తాను వాస్తవాలతో బయటపెట్టానని తెలిపారు. ముఖ్యంగా సివిల్ సప్లయ్ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై కేంద్రానికి నివేదిక ఇచ్చామని, త్వరలోనే విచారణ జరుగుతుందని తెలిపారు. వంద కోట్లు ముడుపులు చెల్లించాలేమో.. గత ప్రభుత్వంలో సర్పంచులు లక్షల రూపాయలు అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేయించారని, కానీ, కేసీఆర్ సర్కారు ఆ పనులకు సంబంధించిన నిధులు విడుదల చేయలేదని ఏలేటి చెప్పారు. ‘రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం ఒక్కో పంచాయతీలో రూ.3 లక్షల నుంచి రూ.కోటి వరకు బకాయి ఉన్నట్లు సర్పంచులు చెబుతున్నారు. ఈ లెక్కన రాష్ట్రం మొత్తమ్మీద రూ.1000 కోట్లకు పైగా బిల్లుల బకాయి ఉన్నట్లు సమాచారం. పది శాతం కమీషన్లు ఇస్తే తప్ప ఆర్ధిక శాఖ బిల్లులు ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. వెయ్యి కోట్లకుపైగా ఉన్న పెండింగు బిల్లులను క్లియర్ చేసేందుకు పది శాతం కమిషన్ అంటే.. వంద కోట్లు ముడుపులు చెల్లించాలేమో’అని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
‘యు ట్యాక్స్’ పచ్చి అబద్ధం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: నిత్యం వార్తల్లో ఉండాలనే ఆత్రుతతో కనీస అవగాహన కూడా లేకుండా బీజేపీ నేతలు నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఆ పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేసిన యు ట్యాక్స్ ఆరోపణలు పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇతర రాష్ట్రాల్లో తీర్థయాత్ర చేస్తున్న మంత్రి ఉత్తమ్ ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘వంద రోజుల్లో తెలంగాణలో అద్భుత పాలన అందించాం. అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిలో పెట్టి నడిపిస్తున్నాం. యు ట్యాక్స్ వసూలు చేస్తున్నామనడం దుర్మార్గం. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు వస్తున్నా. మహేశ్వర్‌రెడ్డి చేసిన అన్ని ఆరోపణలకు తగిన జవాబు చెప్తా..’అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. -
ప్రతిఒక్కరూ రజాకార్ సినిమా చూడండి : ఎంపీ బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో నిజామాబాద్–ఖమ్మం వరకు ఎన్‌హెచ్–563, ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ, రైలు మార్గాల నిర్మాణం, టర్మరిక్ బోర్డు, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నిధులు.. ఇలా ఎన్నో ఇచ్చాం.. వచ్చే పదేళ్లలో తెలంగాణ ప్రగతిపై ఫోకస్ చేసి, మరెన్నో ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలో రోడ్లు, రైలు, గోదాంలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. సోమవారం జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగించారు. రాష్ట్రంతోపాటు ఉమ్మడి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ కోసం బీజేపీని గెలిపించాలని, అబ్ కీ బార్ 400 పార్ అని పిలుపునిచ్చారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరతో రైతులను, సంక్షేమ పథకాలతో మహిళలను, రుణాలిచ్చి యువతను ఆదుకున్నామని తెలిపారు. పసుపు మద్దతు ధర, టర్మరిక్ బోర్డు ఏర్పాటు, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి, ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణకు రూ.6,400 కోట్లు వెచ్చించామన్నారు. కాళేశ్వరం అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల తీరును ఎండగట్టారు. ఆ పార్టీలు తెరచాటు మిత్రులని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ అగ్రనాయకులు లక్ష్మణ్, సత్యనారాయణరావు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి, నిర్మల్ ఎమ్మెల్యే పరమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. రజాకార్ సినిమా చూడండి వీరులను కన్న గడ్డ జగిత్యాలలో పీఎఫ్ఐ లుచ్చాగాళ్లు అడ్డా పెట్టి, పాకిస్తాన్ జిందాబాద్ అంటుంటే వాళ్లకు ఆర్థికసాయం చేస్తున్న వాళ్లను వదిలేద్దామా? నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులు జగిత్యాల సొంతం. రాముని పేరు చెబితే కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు గజగజ వణుకుతున్నరు. దేశ ప్రజల భాగస్వామ్యంతో అయోధ్యలో రాముని గుడిని కట్టింది బీజేపీయే. మా పార్టీ బరాబర్ శ్రీరాముని పేరుతో ఎన్నికల్లోకి వెళ్తుంది. మీకు దమ్ముంటే బాబర్ పేరుతో ఓట్లడగండి. తెలంగాణ ప్రజాలారా... ప్రతిఒక్కరూ రజాకార్ సినిమా చూడండి. నిజాం సమాధి వద్ద మోకరిల్లిన కేసీఆర్, ఒవైసీ సోదరులను కట్టేసి, ఈ సినిమా చూపించండి. – ఎంపీ బండి సంజయ్ ఐదో ఆర్థిక శక్తిగా మన దేశం ప్రధాని మోదీ వల్లే మన దేశం ప్రపంచ దేశాల్లో బలమైన ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది. మయన్మార్, పాకిస్తాన్ లాంటి దేశాలను దారికి తెచ్చిన ఘనత ఆయనదే. మోదీ వల్లే దేశంలో సుస్థిరత, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతాయి. ఇటీవల సీఏఏ అమలు చేశారు. త్వరలో ఎన్ఆర్సీ, యూసీసీ కోడ్‌ను కూడా అమలు చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. – ఎంపీ ధర్మపురి అర్వింద్ దేశ ప్రజలందరూ ప్రధాని కుటుంబమే ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబం లేదంటున్న విపక్షాలకు సిగ్గులేదు. దేశ ప్రజలందరూ ఆయన కుటుంబమే. వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో తెలంగాణ నుంచి బీజేపీ తరఫున అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచి, ప్రధానికి కానుకగా ఇద్దాం. పదేళ్ల యూపీఏ హయాంలో జరగని స్కాం లేదు. బీఆర్ఎస్ కాళేశ్వరం నుంచి కరెంటు వరకు అవినీతిమయం చేసింది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయలేక చేతులెత్తేసింది. – ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత -
అమ్మవారిని దర్శించుకుంటున్న మంత్రి ఐకేరెడ్డి..
సాక్షి, ఆదిలాబాద్: భక్తులకు కొంగుబంగారంగా.. కోరిన కోర్కెలు తీర్చే అనురాగవల్లిగా.. జిల్లా ప్రజల ఇలవేల్పుగా పేరొందిన అడెల్లి మహా పోచమ్మతల్లి గంగనీళ్లజాతర ఆదివారం ఘనంగా ముగిసింది. అమ్మవారి ఆభరణాలు, గంగాజలంతో దిలావర్పూర్ మండలం సాంగ్వి నుంచి చేపట్టి న శోభాయాత్ర ఆదివారం అడెల్లి ఆలయానికి చేరింది. అమ్మవారికి నగలు అలంకరించిన ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చన, పవిత్ర గంగానది జలాలతో ఆలయ శుద్ధి, అమ్మవారి విగ్రహానికి పాలాభిషేకం, అనంత రం పవిత్రోత్సవం తదితర పూజలు జరిపించారు. శనివారం రాత్రినుంచే ఆలయానికి భక్తులు రావడంతో పరిసరాలన్నీ కిటకిటలాడాయి. ఉమ్మడి ఆదిలా బాద్జిల్లా నలుమూలల నుంచే కాకుండా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహారాష్ట్రలోని యావత్మాల్, నాందేడ్, చంద్రాపూర్ జిల్లాలనుంచి, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలనుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఉదయం కోనేరులో పవిత్ర స్నానాలాచరించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దిలావర్పూర్లో జరిగిన అమ్మవారి ఆభరణాల ఊరేగింపులో పాల్గొన్నారు. గంగాజలంతో ఆభరణాల శుద్ధి దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రామ గోదావరి పరీవాహక ప్రాంతం ఆదివారం తెల్లవారుజామున అశేష భక్తజనంతో పులకించింది. అడెల్లి మహాపోచమ్మ ఆభరణాల ఊరేగింపు శోభాయాత్ర శనివారం ఉదయం సారంగపూర్ మండలం అడెల్లి దేవస్థానం నుంచి మొదలై దిలావర్పూర్ మండలంలోని కదిలి, మాడేగాం, దిలావర్పూర్, బన్సపల్లి, కంజర్ గ్రామాల మీదుగా రాత్రి సాంగ్వి పోచమ్మ ఆలయానికి చేరుకుంది. అమ్మవారి ఆభరణాల వెంట వచ్చిన భక్తులు రాత్రంతా అమ్మవారి నామస్మరణతో జాగరణలో పాల్గొన్నారు. ఆటపాటలతో అమ్మవారి ఆభరణాలను ఆదివారం తెల్లవారుజామున గోదావరి తీరానికి తీసుకువెళ్లారు. స్టానిక ఊరి పెద్దలు, అమ్మవారి ఆలయ పూజారులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారి నగలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి జలాలను గడ ముంతల్లో తీసుకున్న భక్తులు గంగనీళ్ల జాతరకు అమ్మవారి ఆభరణాల వెంట వెళ్లారు. గంగనీళ్ల జాతరలో బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి కన్నుల పండువగా శోభాయాత్ర సాంగ్వి ఆలయం నుంచి ఉదయం 6గంటలకు ప్రా రంభమైన గంగనీళ్ల జాతర అడెల్లి దేవస్థానానికి తిరుగుపయనమైంది. ఈక్రమంలో కంజర్, బన్సపల్లి, దిలావర్పూర్, మాడేగాం, కదిలి గ్రామాల్లో స్థానిక నాయకులు అమ్మవారి ఆభరణాల శోభా యాత్రకు మేళతాళాలు, భాజాభజంత్రీలతో ఘనస్వాగతం పలికారు. దిలావర్పూర్ గ్రామానికి చేరుకోగానే గ్రామస్తులు జాలుక దండ (భారీపూలతోరణం)తో స్వాగతం పలకగా.. గ్రామానికి చెందిన పోతరాజులు అమ్మవారికి పూజలు నిర్వహించి జాతర ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు యాటపిల్లలను (గొర్రె పొట్టేళ్లు) బహూకరించారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. దారి పొడవునా అమ్మవారి ఆభరణాలపై పసుపు నీళ్లు చల్లుతూ కొబ్బరి కాయలు కొడుతూ భక్తులు మొక్కు తీర్చుకున్నారు. భక్తులకు ప్రత్యేక వసతులు.. అడెల్లి ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయ ఇన్చార్జి ఈవో, దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రవికిషన్‌గౌడ్, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. సారంగపూర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సుభాష్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో వలంటీర్లు భక్తులకు సేవలందించారు. భారీ పోలీస్ బందోబస్తు! అమ్మవారి ఆభరణాలతో శోభాయాత్ర నిర్వహించగా దారివెంట నిర్మల్ రూరల్ సీఐ శ్రీనివాస్, సారంగపూర్ ఎస్సై కృష్ణసాగర్ సిబ్బందితో బందోబస్తు చేపట్టారు. దిలావర్పూర్లోనూ నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, నిర్మల్ సీఐ శ్రీనివాస్, సోన్ సీఐ నవీన్‌కుమార్, దిలావర్పూర్ ఎస్సై యాసిర్ అరాఫత్, సోన్ ఎస్సై రవీందర్, రూరల్ ఎస్సై చంద్రమోహన్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
షోకాజ్ అందుకున్న మర్నాడే బీజేపీలోకి ఏలేటి
సాక్షి, న్యూఢిల్లీ/నిర్మల్: ‘నేనేమైనా ఉగ్రవాదినా? ఏమైనా తప్పు చేశానా? కారణం ఏమిటో చెప్పకుండా నాకు షోకాజ్ నోటీసు ఇవ్వడం.. గంటలోగా వివరణ కోరడం ఏమిటి? 15 ఏళ్లుగా అవినీతి మచ్చ లేకుండా పనిచేస్తున్న నన్ను ఎలాంటి ఆధారాల్లేకుండా, అభాండాలు వేసి బయటకు వెళ్లేలా చేశారు. కాంగ్రెస్ పార్టీలో అవమానాల నుంచి విముక్తి కోసమే బీజేపీలో చేరా’అని తెలంగాణ సీనియర్ నేత, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా ఉన్న మహేశ్వర్‌రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలో బీజేపీలో చేరారు. గురువారం ఉదయమే ఢిల్లీ చేరుకున్న ఆయన తొలుత బీజేపీ చేరికల కమిటీ కన్వీ నర్ ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారు. అనంతరం వారిద్దరూ కలసి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ నివాసంలో ఛుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ప్రత్యేకంగా సమావేశమ య్యారు. ఆ తరువాత ఆయన్ను తరుణ్ ఛుగ్, బండి సంజయ్, ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సంగప్ప బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ మహేశ్వర్‌రెడ్డికి జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం జేపీ నడ్డా నివాసం వద్ద తెలంగాణ బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడారు. బీజేపీ, మోదీతోనే అరాచక పాలనకు తెర రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను అంతమొందించడం కేవలం బీజేపీ, ప్రధాని మోదీ వల్లే సాధ్యమవుతుందని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. అందువల్లే తాను బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు కలసి అడుగులేసే దిశగా నడుస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతిపై పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ ఏమీ పట్టనట్లుగా పార్లమెంటులో వారితో కలసి తిరుగుతోందని విమర్శించారు. బీఆర్ఎస్తో పొత్తు విషయంలో కాంగ్రెస్ నాయకులు రోజుకో విధంగా మాట్లాడుతూ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారని... దీంతో రాష్ట్రంలో పార్టీ దయనీయమైన పరిస్థితికి చేరుకుందని, ఎటుచూసినా అయోమయం నెలకొందని మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్కు కోవర్టులుగా ఉన్నారనే నిందలను పలువురు కాంగ్రెస్ నేతలపై మోపుతున్నారని... అసలు ఎవరు ఎవరి కోవర్టులో తెలుసుకోలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు. 15 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఎలాంటి వివాదాలు లేకుండా పనిచేస్తున్న తనపై కావాలనే కొందరు సోషల్ మీడియాలో నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. కొంతకాలంగా కాంగ్రెస్‌లో ఒక నాయకుడు పథకం ప్రకారమే సీనియర్లను బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అందరం కలసికట్టుగా...: సంజయ్ రాష్ట్రంలో అహంకారపూరిత నియంత పాలనను అంతమొందించడానికి ప్రతి ఒక్కరం కలసికట్టుగా పనిచేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. మహేశ్వర్‌రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు బీజేపీలో చేరడం సంతోషకరమన్నారు. కేవలం నిర్మల్ జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లో బీజేపీ బలపడేందుకు మహేశ్వర్‌రెడ్డి లాంటి నాయకులు ఉపయోగపడతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలన్న ఏౖకైక లక్ష్యంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో మహేశ్వర్‌రెడ్డి చేరడం సంతోషకరమని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ తెలిపారు. రానున్న రోజుల్లో నిర్మల్ నుంచి పెద్ద ఎత్తున చేరికలుంటాయన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణను అందరికీ అందించేలా బీజేపీనే చర్యలు చేపడుతుందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. బీజేపీలో మహేశ్వర్‌రెడ్డి చేరికకు కారణాలివే సాక్షి, హైదరాబాద్: సొంత పార్టీలో విభేదాలు... నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ పరి ణామాలు... వెరసి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీజేపీ కండువా కప్పుకోవడానికి కారణమయ్యాయి. కొంతకాలంగా మహేశ్వర్‌రెడ్డి పార్టీ మార్పు ప్రచారం జరుగుతున్నప్పటికీ నిర్మల్‌లో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌లోనే ఆయన కొనసాగు తారని భావించారు. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్‌తో ముదిరిన విభేదాలు, తాజాగా ఇచ్చిన షోకాజ్ నోటీసుతో ఏలేటి అహం దెబ్బతింది. అదే సమయంలో నియోజకవర్గంలో అధికార పార్టీ అసంతృప్త నేతలు బీజేపీలో చేరడానికి చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఏలేటి తన రాజకీయ వ్యూహాన్ని మార్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలసి ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కమలదళంలో చేరారు. మైనారిటీల ప్రభావం అధికంగా ఉండే నిర్మల్‌లో ఆయన నిర్ణయం ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందోననే అంశాలపై రాజకీయ పరిశీలకులు వేచి చూస్తున్నారు. -
కాంగ్రెస్‌కు మహేశ్వర్ రెడ్డి షాక్.. బీజేపీలో చేరికపై క్లారిటీ!
సాక్షి, హైదరాబాద్: నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌లో రోజుకో చర్చకు దారితీస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో నెలకొన్న విభేదాల నేపథ్యంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. కాంగ్రెస్‌కు మహేశ్వర్‌రెడ్డి గురువారం రాజీనామా చేశారు. కాంగ్రెస్ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నానని, త్వరలోనే బీజేపీలో చేరున్నట్లు మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈమేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. కాగా కాసేపట్లో ఆయన తరుణ్‌చుగ్ ఇంటికి వెళ్లనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. చదవండి: కారేపల్లి ఘటనలో కుట్ర కోణం?.. కేటీఆర్ ఏమన్నారంటే! -
ఏలేటి... ఎటువైపు?
సాక్షి, హైదరాబాద్: నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌లో రోజుకో చర్చకు దారితీస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో నెలకొన్న విభేదాల నేపథ్యంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న ఆయన ఈసారి ఏకంగా పార్టీ మారబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినందునే నియోజకవర్గ కార్యకర్తలతో మహేశ్వర్‌రెడ్డి భేటీ అయ్యారన్న వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఈ పరిస్థితుల్లో టీపీసీసీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయగా, తనకు షోకాజ్ ఇచ్చే అధికారం టీపీసీసీ లేదని ఏలేటి వ్యాఖ్యానించడం ఉత్కంఠ రేపుతోంది. షోకాజ్.. గంటలో సమాధానం ‘మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ శ్రేణుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. మీరు బీజేపీకి దగ్గరవుతున్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కూడా తెలుస్తోంది. ఈ షోకాజ్ నోటీసు ఇచ్చి న గంటలోపు వివరణ ఇవ్వాలి. లేదంటే పార్టీ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’అని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి ఈ నోటీసు జారీచేశారు. అయితే, నోటీసు ఇచ్చిన గంటలోగా ఏలేటి టీపీసీసీకి ఎలాంటి సమాధానం ఇవ్వకపోగా, ఏకంగా టీపీసీసీనే తనకు వివరణ ఇవ్వాలని వ్యాఖ్యానించడం గమనార్హం. మీరెలా ఇస్తారు? టీపీసీసీ తనకు షోకాజ్ జారీచేసిన కొద్దిసేపటికే ఏలేటి హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నోటీస్ ఇచ్చి నట్టు ఇ ప్పుడే తెలిసిందని, అయినా తనకు షోకాజ్ ఇచ్చే అధికారం టీపీసీసీకి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. నోటీసు ఎందుకివ్వాల్సి వచ్చిందో టీపీసీసీనే వివరణ ఇవ్వాలన్నారు. విశ్వసనీయత లేని నాయకులు, పార్టీలు మారి వచ్చి న వాళ్లు తనకు నోటీసులివ్వడమేంటని నిలదీశా రు. తానెప్పుడూ పార్టీ లైన్ దాటలేదని, అనైతికంగా వ్యవహరించలేదని, రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. తాను పార్టీలో కొనసాగడం ఇష్టం లే ని కొందరు బయటకు పంపాలని చూస్తున్నార ని వ్యాఖ్యానించారు. తాను బీజేపీ నాయకుల తో టచ్‌లోకి వెళ్లినట్టు చెబుతున్నారని, అలాంటి ఆధారాలేవైనా ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అసలు తాను పార్టీలో ఉండాలో వద్దో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వద్దనే తేల్చుకుంటానని, ఆయన్ను కలిసి జరిగిన పరిణామాలను వివరిస్తానని చెప్పారు. టీపీసీసీ పీఏసీలో తన వైఖరిపై చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. -
ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా?
నిర్మల్: ఏఐసీసీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్నారా?.. సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో ఓ క్లారిటీ ఇవ్వనున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది కాంగ్రెస్శ్రేణుల నుంచి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ క్షేత్రస్థాయి ప్రభావానికి తగ్గట్లు ఏలేటి అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈమేరకు జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం పార్టీ ప్రధాన కార్యకర్తలు, తన ముఖ్య అనుచరులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఈ సమావేశంలో మెజారిటీ కార్యకర్తలు, అనుచరులు బీజేపీలో చేరితేనే ఎన్నికల సమరంలో గెలువగలమని వెల్లడించినట్లు తెలిసింది. వారి నిర్ణయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటానన్న మహేశ్వర్‌రెడ్డి తుది నిర్ణయాన్ని మాత్రం ప్రకటించలేదు. మరోవైపు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్‌పై.. ఎన్నికలు సమీపిస్తుండటంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్ఎస్లో ఇప్పటికే గులాబీ శ్రేణుల్లో సందడి నెలకొంది. అదే పార్టీలో శ్రీహరిరావు, సత్యనారాయణగౌడ్లాంటి సీనియర్లు ఎదురుతిరగడమూ చర్చనీయాంశమైంది. మరోవైపు కాంగ్రెస్‌లోనూ పెను మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏఐసీసీ నేత మహేశ్వర్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా యి, ఓటర్ల తీరు ఎలా ఉందని ఆరా తీస్తున్నారు. కమలంవైపే అనుచరుల మొగ్గు.. ప్రస్తుత పార్టీలో ఉండటమా.. పార్టీ మారడమా.. ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలి.. అనే అంశాలపై ఏలేటి తన ప్రధాన అనుచరులు, ముఖ్య నాయకులతో చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలోకి వెళ్తేనే బాగుంటుందన్న అభిప్రాయం ఎక్కువమంది కార్యకర్తల నుంచి వచ్చినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కంటే ప్రస్తుతం బీజేపీ మెరుగ్గా ఉందన్న అభిప్రాయాన్ని మెజార్టీ నాయకులు వెల్లడించినట్లు సమాచారం. మహేశ్వర్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నా.. తన వెంటే ఉంటామని, ఈసారి ఎలాగైనా గెలవాలని చెప్పినట్లు ఓ సీనియర్ నేత వెల్లడించారు. మరోవైపు మహేశ్వర్‌రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నారని, ఈనెల 14న మంచిర్యాలలో కాంగ్రెస్ సభరోజే ఆ పార్టీకి షాక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. నేడో రేపో ఢిల్లీకి కూడా వెళ్తారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆలోచించి నిర్ణయం.. రాజకీయ భవిష్యత్‌పై చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలోనే పలువురు నాయకులతో సమావేశం నిర్వహించా. బీజేపీతో పాటు బీఆర్ఎస్ నుంచీ ఆహ్వానం ఉంది. కానీ పార్టీ మార్పుపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం లేదు. మరోసారి అందరితో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటా. – ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ -
కాంగ్రెస్‌లోకి త్వరలో ఒక ఎంపీ.. ముగ్గురు ఎమ్మెల్యేల చేరిక
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే భారీగా చేరికలుంటాయని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ నుంచి ఒక ఎంపీ, దక్షిణ తెలంగాణ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తారని తెలిపారు. వారంతా కాంగ్రెస్ నాయకత్వంతో అందుబాటులో ఉన్నారని, రాహుల్ యాత్ర తర్వాత చేరికలుంటాయా?... ఈలోపే ఉంటాయా? అన్నది త్వరలోనే తెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్రపై వ్యాఖ్యలు చేసే స్థాయి మంత్రి కేటీఆర్‌కు లేదన్నారు. -
నేడు జిల్లాకు టీపీసీసీ అధ్యక్షుడు ‘పొన్నాల’
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు తాత్కాలికంగా సద్దుమణిగినా.. అంతర్గతంగా రగులుతూనే ఉన్నాయి. జిల్లా కాం గ్రెస్ సారథిగా ముందుగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి భార్గవ్‌దేశ్‌పాండే ను నియమిస్తూ అధిష్టానం నిర్ణయిం తీసుకుంది. ఆ సమయంలో ఓ వర్గం భగ్గుమంది. అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు పార్టీకి కూడా రాజీనామాలు చేస్తామంటూ ప్రకటించారు. ఇప్పుడు ఆ స్థానాన్ని నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి ఇవ్వడంపై జిల్లాలోని మరోవర్గం ఆచితూచి వ్యవహరిస్తోంది. అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం చెప్పలేదు.. కానీ, రానున్న రోజుల్లో ఈ రెండు గ్రూపుల మధ్య సమన్వయం ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు అధిష్టానం దృష్టి సారించింది. ఇందుకోసం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే.. శుక్రవారం ఆసిఫాబాద్‌లో నిర్వహించిన తొలి నియోజకవర్గ సమావేశానికి కొత్తగా డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన మహేశ్వర్‌రెడ్డి హాజరుకాకపోవడం విడ్డూరం. ఇందులో సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభించారు. ఆ నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ప్రశ్నార్థకం.. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి నా యకత్వం ప్రశ్నార్థకంగా తయారైంది. ఈ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు మరో నాలుగేళ్లు ఉంటడంతో ఇప్పుడే ప్రజల్లోకి రావడం లేదు. ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన గడ్డం అరవింద్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు కూడా ఎన్నికల తర్వాత కనుమరుగయ్యారు. కాంగ్రెస్ ఆ ధ్వర్యంలో అడపాదడపా కార్యక్రమాలు నిర్వహిస్తూ నే ఉన్నారు. నెల రోజుల క్రితం రైతుల సమస్యలపై కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకోవాల ని ఇటీవల కోటపల్లిలో ధర్నా నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలు ఈ ధర్నాలో పాల్గొ న్నా, జిల్లా ముఖ్య నాయకులు పలువురు దూరంగా ఉన్నారు. కేవలం జిల్లాలోనే కాదు, గాంధీభవన్‌లో జరుగుతున్న కార్యక్రమాలకు కూడా కొన్ని నియోజకవర్గ ఇన్చార్జీలు హాజరుకావడం లేదు. ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం కావడం ప్రశ్నార్థకంగా మారింది. నేడు నిర్మల్‌కు పొన్నాల రాక తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శనివారం నిర్మల్‌కు వస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న నిర్మల్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి వస్తున్నట్లు టీపీసీసీ కార్యదర్శి నరేష్‌జాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ, మండలిల సీఎల్పీ నేతలు జానారెడ్డి, డి.శ్రీనివాస్‌లు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.