సాక్షి, హైదరాబాద్: నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌లో రోజుకో చర్చకు దారితీస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో నెలకొన్న విభేదాల నేపథ్యంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న ఆయన ఈసారి ఏకంగా పార్టీ మారబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.
ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినందునే నియోజకవర్గ కార్యకర్తలతో మహేశ్వర్‌రెడ్డి భేటీ అయ్యారన్న వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఈ పరిస్థితుల్లో టీపీసీసీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయగా, తనకు షోకాజ్ ఇచ్చే అధికారం టీపీసీసీ లేదని ఏలేటి వ్యాఖ్యానించడం ఉత్కంఠ రేపుతోంది.
షోకాజ్.. గంటలో సమాధానం
‘మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ శ్రేణుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. మీరు బీజేపీకి దగ్గరవుతున్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కూడా తెలుస్తోంది. ఈ షోకాజ్ నోటీసు ఇచ్చి న గంటలోపు వివరణ ఇవ్వాలి. లేదంటే పార్టీ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’అని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి ఈ నోటీసు జారీచేశారు. అయితే, నోటీసు ఇచ్చిన గంటలోగా ఏలేటి టీపీసీసీకి ఎలాంటి సమాధానం ఇవ్వకపోగా, ఏకంగా టీపీసీసీనే తనకు వివరణ ఇవ్వాలని వ్యాఖ్యానించడం గమనార్హం.
మీరెలా ఇస్తారు?
టీపీసీసీ తనకు షోకాజ్ జారీచేసిన కొద్దిసేపటికే ఏలేటి హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నోటీస్ ఇచ్చి నట్టు ఇ ప్పుడే తెలిసిందని, అయినా తనకు షోకాజ్ ఇచ్చే అధికారం టీపీసీసీకి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. నోటీసు ఎందుకివ్వాల్సి వచ్చిందో టీపీసీసీనే వివరణ ఇవ్వాలన్నారు. విశ్వసనీయత లేని నాయకులు, పార్టీలు మారి వచ్చి న వాళ్లు తనకు నోటీసులివ్వడమేంటని నిలదీశా రు. తానెప్పుడూ పార్టీ లైన్ దాటలేదని, అనైతికంగా వ్యవహరించలేదని, రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.
తాను పార్టీలో కొనసాగడం ఇష్టం లే ని కొందరు బయటకు పంపాలని చూస్తున్నార ని వ్యాఖ్యానించారు. తాను బీజేపీ నాయకుల తో టచ్‌లోకి వెళ్లినట్టు చెబుతున్నారని, అలాంటి ఆధారాలేవైనా ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అసలు తాను పార్టీలో ఉండాలో వద్దో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వద్దనే తేల్చుకుంటానని, ఆయన్ను కలిసి జరిగిన పరిణామాలను వివరిస్తానని చెప్పారు. టీపీసీసీ పీఏసీలో తన వైఖరిపై చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment