
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే భారీగా చేరికలుంటాయని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ నుంచి ఒక ఎంపీ, దక్షిణ తెలంగాణ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తారని తెలిపారు.
వారంతా కాంగ్రెస్ నాయకత్వంతో అందుబాటులో ఉన్నారని, రాహుల్ యాత్ర తర్వాత చేరికలుంటాయా?... ఈలోపే ఉంటాయా? అన్నది త్వరలోనే తెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్రపై వ్యాఖ్యలు చేసే స్థాయి మంత్రి కేటీఆర్‌కు లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment