కాంట్రాక్టు సంస్థపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి | A criminal case should be registered against the contracting company | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు సంస్థపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి

Published Wed, Aug 14 2024 4:39 AM | Last Updated on Wed, Aug 14 2024 4:39 AM

A criminal case should be registered against the contracting company

బీజేపీ శాసనసభాపక్షనేత మహేశ్వర్‌రెడ్డి 

‘సుంకిశాల’రిటైనింగ్‌వాల్‌ కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన బీజేపీ ఎమ్మెల్యేల బృందం

పెద్దవూర: సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్‌వాల్‌ కూలిన ఘటనలో కాంట్రాక్టు కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టి..క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు పునర్నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కాంట్రాక్టు కంపెనీ నుంచే రాబట్టాలన్నారు. రిటైనింగ్‌వాల్‌ కూలిన ప్రాంతాన్ని మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. అనంతరం మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 2వ తేదీన ఘటన జరిగితే సోషల్‌ మీడియాలో వచ్చే వరకు ఎందుకు గోప్యంగా ఉంచారో చెప్పాలన్నారు. 

కాంట్రాక్టర్‌ను కాపాడుకోవడానికా.. తప్పిదాలను వెనుకేసుకోవడానికా అని ప్రశ్నించారు. మంత్రులు వచ్చి సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి చిన్న ప్రమాదమని, చాలాతక్కువ నష్టమని అంటున్నారని, ఇప్పటివరకు త్రిసభ్య విచారణ కమిటీ ఎంత నష్టం జరిగిందో అంచనానే వేయలేదని చెప్పారు. రూ.2 వేల కోట్ల ప్రాజెక్టు వారికి చిన్నదిగా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. రిటైనింగ్‌వాల్‌ కూలిన ఘటనలో ఏదో లోపాయికారీ ఒప్పందం ఉందని, పనుల్లో నాణ్యత లోపమా, మరేదైనా కారణం ఉందా అనేది బహిర్గతం కావాలంటే సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని సిర్పూర్‌ ఎమ్మెల్యే హరీశ్‌బాబు డిమాండ్‌ చేశారు. 

కాంట్రాక్టర్‌ తప్పిదం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, లైసెన్సు రద్దు చేయాలని ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌ అన్నారు. ఎమ్మెల్సీ ఏవీఎన్‌.రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా విజిలెన్స్‌ కమిటీచే విచారణ చేపట్టి నాణ్యత ప్రమాణాలు పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement