లేదంటే సీఎం రేవంత్ రాజీనామా చేస్తారా?
రుణమాఫీపై రైతుల సమక్షంలో చర్చకు సిద్ధమా?
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: రైతులకు వందశాతం రుణమాఫీ అయినట్లు నిరూ పిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వ ర్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా వెళ్లి రైతుల సమక్షంలోనే చర్చ పెట్టి, పూర్తిగా రుణమాఫీ జరిగిందంటే తాను దేనికైనా సిద్ధమేనన్నారు. అందరికీ రుణ మాఫీ జరగలేదని రైతులు చెబితే, రేవంత్‌రెడ్డి రాజ కీయాల నుంచి తప్పుకోవడమో, రాజీనామా చేయడమో.. ఏది చేస్తా రో చెప్పాలని డిమాండ్ చేశారు.
శనివారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్‌లో మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో రేవంత్ ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేసిందన్నారు. మొత్తం 60 లక్షల మంది అర్హులుండగా.. 22 లక్షల మంది రైతులకే రుణమాఫీ జరిగిందన్నారు. రుణమాఫీకి రూ.49 వేల కోట్లు ఇవ్వాల్సిఉండగా.. కేవలం రూ.17 వేల కోట్లే ఇచ్చారని తెలిపారు. సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల కు దమ్ముంటే గ్రామాలకు వెళ్లి రైతులకు రుణాలు మాఫీ అయ్యాయో లేదో ఆరా తీయాలన్నారు. దీనిపై రైతుల సమ క్షంలో చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. రుణమాఫీ జరిగిన రైతుల వివరాలను వారంరోజు ల్లోగా ప్రభుత్వం వెల్లడించాలన్నారు.
పెండింగులో ఉన్న రైతుల రుణాలను ఈ నెలా ఖరులోగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకం మార్గదర్శకాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ నివేదికపై చర్చించి, రైతు భరోసా పథకానికి మార్గదర్శ కాలు ఖరారు చేసేందుకు అసెంబ్లీని సమావేశ పరచాలన్నారు. రైతు భరోసాకు ఇవ్వాల్సిన నిధులనే రుణమాఫీకి మళ్లించారని ఆరోపించారు. రైతు భరోసా ఖరీఫ్ సీజన్ డబ్బులను ఈ నెలాఖరులోగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కాని రైతులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రేవంత్ కొత్త విషయాలను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అని రేవంత్ ప్రచారం చేస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment